Logo Raju's Resource Hub

భారత్ లో టాప్ విద్యుత్ స్కూటర్లు

Google ad

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్..

samayam telugu

జనవరిలో భారత విపణిలోకి అడుగుపెట్టిన ఈ వాహనం ఆనతి కాలంలో మంచి విజయవంతమైంది. ఎక్స్ షోరూంలో ఈ టూ-వీలర్ ప్రారంభ ధర లక్ష రూపాయలు. బజాజ్ బైక్స్ లో అత్యంత విజయవంతమైన చేతక్ స్కూటర్ పేరును ఈ వాహనానికి పెట్టేసరికి దీని ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఈ స్కూటర్ 3.8 కిలోవాట్, 4.1కిలోవాట్ విద్యుత్ మోటార్లను కలిగి ఉంది. అంతేకాకుండా లిథియం అయాన్ బ్యాటరీని బజాజ్ చేతక్ విద్యుత్ స్కూటర్లో పొందుపరిచారు. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే నిరంతరాయంగా గరిష్ఠంగా 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదే స్పోర్ట్ మోడ్ లో అయితే 85 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. చేతక్ ప్రీమియం ప్రొడక్ట్ లో హైక్వాలిటీ మెటీరియల్స్ పొందుపరిచారు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, టచ్ స్విచ్ గేర్, డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ లాంచి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

ఏథర్ 450..

samayam telugu

మనదేశానికి చెందిన ఏథర్ ఎనర్జీ అనే విద్యుత్ వెహికల్ స్టార్టప్ కంపెనీ విడుదల చేసిన ఏథర్ 450 స్కూటర్ కు మంచి ఆదరణ దక్కింది. కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లు నిర్మించడమే లక్ష్యంగా వీటిని ఉత్పత్తి చేస్తుంది ఏథర్ ఎనర్జీ. 2018లో విడుదలైన 450 స్కూటర్ 2.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. ఈ వాహనానికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎకో మోడ్లో 75 కిలోమీటర్లు, స్పోర్ట్ మోడ్లో 55 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది. ఏథర్ 450 ప్రారంభ ధర రూ.1.13 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అంతేకాకండా ఈ వాహనం పూర్తిగా ఛార్జింగ్ ఎక్కాలంటే 5 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.27 సెకండ్లలోనే ఇది అందుకుంటుంది.

​ఏథర్ 450ఎక్స్..

samayam telugu

ఇటీవలే లాంచ్ అయిన ఈ వాహనానికి తక్కువ సమయంలో పాపులారిటీ దక్కించుకుంది. 450 మోడల్ తర్వాత భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ విద్యుత్ స్కూటర్ మంచి విక్రయాలు సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఏథర్ 450 ఎక్స్ విద్యుత్ మోటార్.. 6కిలోవాట్ల పవర్, 26ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్లో 2.9కేడబ్ల్యూహెచ్(కిలోవాట్ అవర్) సామర్థ్యమున్న బ్యాటరీని ఉపయోగించారు. దీంతో ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే గరిష్ఠంగా 85కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీంతో ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే గరిష్ఠంగా 85కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గత ఏథర్ మోడల్ స్టాండార్డ్ 450 కంటే 10కిలోమీటర్లు అధికం. గరిష్ఠంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. కేవలం 3.3సెకండ్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వరకు చేరుకోవచ్చు. 60 కిలోమీటర్ల వేగాన్ని 6.5 సెకండ్లలో అందుకుంటుంది. ఎక్స్ షోరూంలో ఈ వాహనం ప్రారంభ ధర రూ.1.49 లక్షలు.

​టీవీఎస్ ఐక్యూబ్…

samayam telugu

టీవీఎస్ సంస్థ విడుదల చేసిన ఈ విద్యుత్ స్కూటర్ జనవరి 25న భారత మార్కెట్లో విడుదలైంది. బజాజ్ చేతక్ వచ్చిన కొన్ని రోజులకే ఈ స్కూటర్ విపణిలోకి రావడం గమనార్హం. అంతేకాకుండా టీవీఎస్ సంస్థ విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. 4.4 కిలోవాట్ సామర్థ్యం కలిగిన విద్యుత్ మోటార్ ను కలిగి ఉంది. టీఎఫ్ టీ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ లాంటి ప్రత్యేకత ఇందులో ఉంది. టీవీఎస్ ఐ క్యూబ్ స్కూటర్ కు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే గరిష్ఠంగా 75 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లవచ్చు. అంతేకాకుండా 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.2 సెకండ్లలోనే అందుకుంటుందీ స్కూటర్. ఎక్స్ షోరూంలో టీవీఎస్ ఐక్యూబ్ విద్యుత్ స్కూటర్ ప్రారంభ రూ.1.15 లక్షలు.

Google ad

​హీరో ఎలక్ట్రికా ఆప్టిమా..

samayam telugu

పైన చెప్పిన విద్యుత్ స్కూటర్లన్నింటిలో అత్యంత ధర తక్కువైన విద్యుత్ స్కూటర్ హీరో ఎలక్ట్రికా ఆప్టిమా. ఈ వాహనాన్ని గతేడాది భారత విపణిలో విడుదల చేశారు. ఎక్స్ షోరూంలో దీని ప్రారంభ ధర రూ.41,770. గరిష్ఠంగా ఈ విద్యుత్ స్కూటర్ వెల రూ.68,721 వరకు ఉంది. హీరో ఆప్టిమా స్టాండర్డ్ వేరియంట్ కు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అదే ఎక్స్ టెండెడ్ వేరియంట్ అయితే స్టాండర్డ్ వేరియంట్ కంటే రెట్టింపుగా 110 కిలోమీటర్లు వెళ్లవచ్చు. పూర్తిగా ఛార్జింగ్ ఎక్కేందుకు 5 గంటల సమయం పడుతుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ స్కూటర్ లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్కూటర్ 250 వాట్ల బీడీఎల్ సీ మోటార్ ను అమర్చారు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading