📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

బెర్ముడా త్రికోణానికి సంబంధించిన మిస్టరీ కథలు ఏమిటి? వాటిలో వాస్తవం ఎంత?

Google ad
గడిచిన 100 సంవత్సరాలలో ,1000కి పైగా ఓడలని, విమానాలను చిన్న ఆనవాలు కూడా లేకుండా ,అసలు అవి ఏమౌతున్నాయో కూడా ఎవరి ఊహకు అందకుండా మాయం చేసే ఒకే ఒక్క మిస్టీరియస్ ప్లేస్ బెర్ముడా త్రికోణం(Bermuda triangle).
అసలు బెర్ముడా త్రికోణంలో ఏం జరుగుతుంది అని చెప్పడానికి చాలా మంది చాలా థియరీస్ (Theories) చెప్తుంటారు.అందులో 3 థియరీస్ ప్రసిద్ధి చెందినవి,అవి ఏంటంటే..
థియరీ-1
సిటీ ఆఫ్ అట్లాంటిస్:-
బెర్ముడా త్రికోణంలో ,అండర్ వాటర్లో ఒక రాక్ ఫార్మేషన్ని (Rock formation) కనిపెట్టారు.ఇది ఖచ్ఛితంగా మనుషులు చేసిన ఫార్మేషన్ అని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.శాస్త్రవేత్తలు ఈ ఫార్మేషన్ చరిత్రలోనే అతి శక్తివంతమైన అట్లాంటిస్ నగరంకి చెందినదని,అట్లాంటిస్ నగరం బెర్ముడా త్రికోణం క్రిందనే ఉందని అనుకుంటున్నారు.అప్ఫట్లో అట్లాంటిస్ నగరంకి పవర్ సోర్స్,అక్కడ ఉండే పవర్ఫుల్ క్రిస్టల్స్ నుంచి క్రిస్టల్ ఎనర్జీగా ప్రొడ్యూస్ అయ్యేదట.ఇప్పుడు బెర్ముడా త్రికోణం క్రిందనున్న అట్లాంటిస్ నగరంలో మిగిలిపోయిన ఆ క్రిస్టల్ టెక్నాలజీ వల్లె ,అక్కడ కంపాస్లు సరిగ్గా పనిచేయవని,అక్కడ షిప్స్ మరియు ప్లేన్స్ మాయమైపోవడానికి అవే కారణమని అంటుంటారు.
థియరీ-2
గల్ఫ్ స్ట్రీమ్:-
బెర్ముడా త్రికోణం వద్ద సముద్రం లోతు 28,373 అడుగులు.అక్కడ సముద్రం అడుగు భాగాన నీరంతా ఒక పవర్ఫుల్ స్ట్రీమ్లా ప్రవహిస్తుందని,అక్కడ మునిగిపోయిన షిప్స్ ఈ ప్రవాహం వలనే అక్కడే ఉండకుండా, దూరంగా వెళ్లి అక్కడ సముద్రం అడుగు భాగాన ఉండిపోతాయని చాలా మంది అంటుంటారు.ఇందువల్లనే అక్కడ మునిగిపోయిన షిప్స్ ఆనవాళ్ళు ఏమి మిగలట్లేదు అని అంటుంటారు.
థియరీ-3
మీతేన్ గ్యాస్:-
బెర్ముడా త్రికోణం అడుగు భాగాన చాలా ఎక్కువ పరిమాణంలో మీతేన్ గ్యాస్ బుడగలు ఉన్నాయి.అవి ఎంతపెద్దవి అంటే ఒక్క బుడగ పగిలి గ్యాస్ పైకి వస్తే పెద్ద పెద్ద షిప్స్ని సైతం లోతుకి లాగగలవని,అందుకే షిప్స్ మాయం అవుతున్నాయని చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తుంటారు.
ఈ థియరీసే కాకుండా ఇంకా అక్కడ ఒక పెద్ద పిరమిడ్ ఉందని దాన్నుంచి వచ్చే పవర్ వల్లే ఈ అదృశ్యాలు జరుగుతున్నాయని కొంత మంది చెప్తుంటారు.ఇంకొంతమంది అక్కడ వేరే ప్రపంచంకి వెళ్లే దారులు ఉన్నాయని చెప్తుంటారు.ఇవే కాకుండా అక్కడ ఏలియన్స్ ఉన్నాయని చెప్తుంటారు.ఇలా చాలా థియరీస్ ఉన్నాయి.కారణం ఏదైనా ఇలా ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.ప్రస్తుతం మనకున్న అడ్వాన్సడ్ టెక్నాలజీతో అసలైన బెర్ముడా త్రికోణం మిస్టరీని చేదించి మనందరి మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం చేకూర్చాలని కోరుకుందాం.
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading