📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

కాశీ క్షేత్రదర్శనము

ఆనందమయి మా ఘాట్‌:

వారణాసి లోని ఆనందమయి మా ఘాట్‌ మనకు చాలా ప్రస్ఫుటముగా కనబడుతూ ఆహ్వానిస్తూ వుంటుంది.
ఆ ఘాట్ నుంచి మనము ఆనందమయి మా ఆశ్రమములోనికి వెళ్ళవచ్చు. చాలా ఆశ్రమాలకు వలనే నదిపై ఈ ఆశ్రమము చేరటము చాలా తేలిక. కానీ రోడ్డు నుంచి వెళ్ళాలంటే కొంత ప్రయాస తప్పదు.
‘ఆనందమయి మా’ రూపుదిద్దుకున్న పరిపూర్ణ చైతన్యమే. మానవ శరీరములో మెసిలి, భక్తులకు ఆనంద ఆధ్యాత్మికత ప్రసాదించిన అవధూత అవతార రూపమే యోగిని మాత ‘ఆనందమయి మాత”.
ఆనందమయి మా గురించిన ప్రస్థావన ప్రసిద్ధి చెందిన ‘శ్రీ పరమహంస యోగానంద’ రచించిన ‘ఒక యోగి ఆత్మకథ’లో వున్నది.  శ్రీ పరమహంస ‘మా’ ను కలసిన వివరము, వారికి ‘మా’ కు మధ్య నడచిన సంభాషణ ఆ గ్రంథంలో వున్నాయి.
ఎందరో మహాపురుషులను కదిలించి, తమ భక్తులకు ఆధ్యాత్మిక ఆత్మోన్నతి నిచ్చిన ఆనందమయి మాత జన్మనామము ‘నిర్మల సుందరీ దేవి’. 1896 లో ఒక నిరుపేద సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబములో ఆనాటి అవిభక్త బెంగాలు రాష్టంలో జన్మించినది. పుట్టిన నాటి నుంచి కూడా భగవన్నామము వినపడినంతనే వింతైన ఆనందములో మునకలు వేసేది ఆ బాలిక. నిశ్ఛలమైన మౌనములో సమాధి స్థితిలో నిత్యానందములో తేలియాడే బాలిక వింత ప్రవర్తన తల్లి తండ్రులను అబ్బురపరిచేది.
Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading