మిడుత చాలా చిన్న జీవి.పతంగం అంటే కూడా మిడత అని అర్ధం ఉంది. దీనికున్న బలం ఎగురగలగడం. దీని బలహీనత నిప్పు. మిడుతలు ఎడారుల్లో గుడ్లు పెడతాయి. అవి ఒకటి రెండు మూడు ఆపై అసంఖ్యాకంగా పెరిగి ఆహారానికి బయలు దేరాతాయి. వీటికి దేశాలు సరిహద్దులు లేవు. పచ్చదనం ఎక్కడవుంటే అక్కడ వాలతాయి. అన్నీ తినేస్తాయి, లేచి వెళతాయి, అక్కడేం మిగలదు. ఇది కూడా కొన్ని అత్యాశాపరులైన దేశాల వారి సృష్టి కావచ్చు. ప్రపంచాన్ని శాసించాలనే ఎత్తుగడ కావచ్చు.జీవ జంతువులతో విలయం సృష్టి కావచ్చు. ఇవి దండుగా ఎగురుతోంటే ఆకాశం లో సూర్యుడే కనపడకపోవచ్చు. ఏమవుతుంది ఇవొస్తే ముందు పచ్చని ఆకు కనపడదు. ఉన్న ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆ తరవాత ఆహారానికి కరువొస్తుంది. అదుపు చేయండి, ఎలా చిన్న చిన్న మంటలేయండి, అందులో దూకి చస్తాయి. పైర్లమీద పచ్చదనం మీద వేప కషాయం చల్లండి, అవి వేప కషాయం చల్లిన వాటిని తినలేవు. ఒక వేళ తింటే చనిపోతాయి, పునరుత్పత్తీ చేయలేవు. బహుపరాక్, మనదేశంలో మహా రాష్ట్ర,రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ మొదలైన ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోంది, ఈ మిడత, రేపు మనదీ అదే పరిస్థితి కావచ్చు….
మిడతల దండు
Google ad
Google ad
Raju's Resource Hub