📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

స్ప్లిట్ ఏసీ

గది పరిమాణం బట్టి ఎంత కెపాసిటీ ఏసీ అవసరమో నిర్ణయించుకోవాలి.

150 చ.అడుగుల గది – 1 టన్

250 చ.అడుగుల గది – 1.5 టన్

Google ad

అంతకన్నా పెద్ద గదులకు 2టన్

సంక్షారణము (Corrosion) – రాగి vs అల్యుమీనియం

ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు రాగి కాయిల్స్ ఉన్న మోడళ్ళు అమ్ముతున్నాయి. ఇవి గదిని త్వరగా చల్లబరుస్తాయి, ఎక్కువ కాలం మన్నుతాయి, అల్యుమీనియం కాయిల్స్‌తో పోలిస్తే ఖరీదెక్కువ.

ఇన్వర్టర్ ఏసీ

ఇవి వేగంగా గదిని చల్లబరుస్తాయి, గదిలోని ఉష్ణోగ్రతను నిరంతరంగా ఏకరీతిన ఉంచుతాయి, కరెంటు తక్కువ వాడతాయి కానీ ఎక్కువ ఖరీదు.

స్టార్ రేటింగ్

రేటింగ్‌లో నక్షత్రాలెన్ని ఉంటే ఏసీ కరెంటు అంత తక్కువ వాడుతుంది. అయితే రేటింగ్ ఎక్కువ ఉన్నవి ఖరీదు ఎక్కువ, మన్నికా ఎక్కువే. ఇంకా ఫోన్‌తో నియంత్రించగల స్మార్ట్ ఏసీలు, హానికర దుమ్ము రేణువులను ఫిల్టర్ చేసేవి, స్టెబిలైజర్ అవసరం లేనివి, ఇలా పలు ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ను బట్టి ఇష్టమైనవి ఎంచుకోవచ్చు.

స్ప్లిట్ ఏసీ ఖరీదు ఎంత ఉంటుంది?

పై ఫీచర్లను బట్టి పాతిక నుండి డెబ్బై వేల వరకు ఉంటాయి. క్యారియర్, డైకిన్, జెనరల్ వంటి సంస్థల ఏసీలు ఎక్కువ కాలం రెపేర్లు అవసరం లేకుండా పని చేస్తాయి. వీటిలో 1.5టన్ను ఇన్వర్టర్ ఏసీలు సుమారు 50వేల వరకు ఖరీదు ఉంటాయి. దీర్ఘకాలంలో అతితక్కువ నిర్వహణ శిరోభారం కొరకు వీటిని కొనటం మంచిది .

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading