Google ad
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలేపండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతి నగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడునాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలేఆడుతాం – నీ పాటలే పాడుతాం
జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!
Google ad
Raju's Resource Hub