Logo Raju's Resource Hub

ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్

Google ad

సాధారణమైన ఓడలు తాను వెళ్ళే దిశ మార్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది. దాని దిశ మార్చుకోవడానికి కనీసం 90 నిమిషాల నుంచి అది ఎంత పెద్దది అన్నదాన్ని బట్టి చాలా సమయం తీసుకుంటుంది. మెల్లిగా ఇంజన్లు మార్చుకున్న తిప్పుకోవాలి. బైక్ తిప్పినట్టు టక్కున తిప్పలేరు, ఒక సర్కిల్‌లా తిరగాలి. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్‌లో యుద్ధ విమానాలు ఉంటాయి. ఆ యుద్ధ విమానాలను లాంచ్ చేసి, ఆకాశంలో ఎలాగైనా తిప్పి శత్రువుల ఓడల మీద దాడులు చేయగలవు. ముందు చెప్పుకున్నట్టు ఓడలు అన్నవి ఆ యుద్ధ విమానాల దాడి నుంచి తప్పించుకోవడానికి తప్పుకోవడమో, దారి తిప్పుకోవడమో చాలా కష్టం. కాబట్టి, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు అన్నవి ఒక సముద్రం మొత్తాన్ని సంరక్షించగలవు. ఐతే, మరో సమస్య ఏమిటంటే ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ అయిన ఓడ కూడా ఒక ఓడే కదా. దానికి ఇతర నౌకలకు ఉండే వల్నరబిలిటీ తిప్పుకోలేకపోవడం ఉంటాయి. తద్వారా ఎదుట ఒక మిస్సైల్ షిప్ వచ్చి ఎలాగోలా ఎయిర్‌క్రాఫ్ట్ ఎటాక్‌ నుంచి తనను తాను కాపాడుకుని క్యారియర్ షిప్ మీద దాడి చేస్తే అంతటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఓడ కూడా చటుక్కున నాశనమైపోతుంది. దాని వల్ల ఈ పవర్‌ఫుల్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్‌ని కాపాడడానికి చుట్టూ చాలా ఎస్కార్ట్ ఓడలు ఉంటాయి. సర్వీస్‌ షిప్‌లు, ప్రొటెక్షన్ షిప్‌లు – ఇలా చాలానే ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్‌ చుట్టూ ఎప్పుడూ ఉంటాయి.

ఇలా ఒక్క ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఓడ విశాఖపట్టణం దగ్గర ఉంటే ఇటు బంగ్లాదేశ్‌ నుంచి అటు శ్రీలంక వరకూ బంగాళాఖాతం మొత్తాన్నీ మన కోసం సంరక్షించగలదు. ఆ ఒక్క ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఓడ ఉండగా ఆ మూల నుంచి ఈ మూల దాకా ఏ ఒక్క శత్రు నౌకా వెళ్ళలేవు. ఎందుకంటే – సముద్రంలో మనకు ఒక డిఫెన్స్ ఎయిర్‌పోర్టు ఉన్నట్టే కదా. ఫైటర్ జెట్‌లు చాలా చిన్నవిగా ఉంటాయి, చాలా వేగంగా ప్రయాణించగలుగుతాయి. బంగాళాఖాతం మధ్యలో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ని నిలబెట్టి అక్కడ నుంచి ఫైటర్‌ జెట్‌లను పంపుతూ హిందూ మహా సముద్రం నుంచి బంగాళాఖాతంలోకి రాబోతున్న శత్రు నౌకలను అడ్డుకోవచ్చు. అంత పవర్‌ఫుల్.

ఫోటో క్రెడిట్స్: Indian Navy, GODL-India

ముందే చెప్పినట్టు సముద్రంలోకి వెళ్ళి ఫుల్ యాక్టివ్‌గా ఉన్న సమయంలో ఫ్యుయెల్, మెయింటైనెన్స్ వంటి అన్ని ఖర్చులూ కలిపి చూస్తే రెండు కోట్ల రూపాయలు అవసరం, దాన్ని నిర్వహించడానికి ఐదువేల మంది వరకూ పనిచేస్తారు. ఇలాంటిది అసలు కమిషన్ చేసి, తయారుచేయించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఊహించుకోండి.

మొత్తంగా చెప్పేది ఏంటంటే – దాన్ని నిర్వహించడం చాలా ఖర్చుతో కూడిన పని, దాన్ని తయారుచేయడానికి సంవత్సరాలకు సంవత్సరాలు పడుతుంది, ఎంతో ఖర్చు అవుతుంది, అలానే ఆ ఒక్క ఓడ ఒక సముద్రం మొత్తాన్ని మనకోసం ప్రొటెక్ట్ చేసేయగలదు. ఇవన్నీ కలిపి చూస్తే మనకు ఒక్క ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఉన్నా కూడా ఎంత అడ్వాంటేజ్ అన్నది తెలుస్తుంది. 

Google ad
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading