Logo Raju's Resource Hub

లోక్ సభ

Google ad
Get ready for a younger, more gender-balanced Lok Sabha

ఇంతవరకు ఏర్పడిన వివిధ లోక్ సభల చారిత్రిక -విశేషాలు

70 సంవత్సరాలకు పైబడిన ప్రతినిధులు లేని మొదటి లోక్ సభ నుంచి స్త్రీలకు అధిక ప్రాతినిద్యం ఇచ్చిన 17వ లోక్ సభ వరకు పరిశిలించిన మనకు లోక్ సభ నిర్మాణం లో అనేక  చారిత్రిక విశేషాలు కన్పించును.
 
 
మొదటి లోక్ సభ : మొదటి లోక్ సభ లో ఎక్కువమంది స్వతంత్ర (ఇండిపెండెంట్లు) ప్రతినిధులు కన్పిస్తారు.
 
మొత్తం 489 సభ సబ్యులలో  37గురు ఇండిపెండెంట్లు. ఇది ఒక రికార్డు. ఇండిపెందేన్ట్స్ సభ లో రెండోవ స్థానం పొందిన పార్టీ కమ్యునిస్ట్ పార్టీ కన్నా ఎక్కువ సంఖ్య లో ఎన్నికైనారు. కమ్యునిస్ట్ పార్టి 16 స్థానాలు పొందినది. నెహ్రు నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ 364 స్థానాలతో సభ లో మెజారిటీ పార్టి గా అవతరించినది.
.
మొదటి లోక్ సభ 17 ఏప్రిల్ 1952న ఏర్పడినది. మొదటి సమావేశం మే 13న జరిగింది. సభ తన పదవీకాలం పూర్తిగా  పూర్తి చేసింది మరియు అందులో 70 సంవత్సరలకు పై బడిన సబ్యులు లేరు. సభ సగటున సాలిన  72బిల్లులు ఆమోదించినది.
 
2 వ లోక్ సభ : చివరిసారిగా సభ లో బహుళ సబ్య నియోజకవర్గాలు కలవు.
 
1957 ఎన్నికలలో 494 సీట్లలో కాంగ్రెస్ 371 లో విజయం సాధించి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికైనారు..మొత్తం 494 సీట్లలో 91స్థానాలు ఇద్దరు సబ్య స్థానాలు. మిగిలిన  312 స్థానాలు ఒకే సభ్యులతో  ఉన్నవి. ఈ బహుళ సబ్య  నియోజకవర్గాలు తదుపరి ఎన్నికలకు ముందు  రద్దు చేయబడ్డాయి.
 
రెండోవ లోక్ సభ ఏప్రిల్ 5, 1957 నుండి 31మార్చ్, 1962 వరకు కొనసాగింది. 10 మరియు 12వ రాజ్యాంగ సవరణలు సభ చే ఆమోదింపబడి  దాద్రా మరియు నగర్ హవేలీ మరియు గోవా, డయ్యు, డామన్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా రూపొందినవి.
.
 
3 వ లోక్ సభ : ఇద్దరు ప్రధాన మంత్రులను  నెహ్రూశాస్త్రిలను కోల్పోయింది
 
3వ లోక్ సభ పదవి కాలం ఏప్రిల్ 2, 1962 నుంచి 3 మార్చి 1967 వరకు ఉంది. ప్రధాన మంత్రి నెహ్రూ 27 మే 1964 న మరణించారు. అతని తరువాతి లాల్ బహదూర్ శాస్త్రి జనవరి 11, 1966 న మరణించారు. 1966 జనవరి 24 న ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారు. 1962 లో చైనా తో మరియు పాకిస్తాన్ తో 1965 యుద్ధం పై సభ లో అనేక తీవ్రమైన  చర్చలు జరిగాయి
 
ప్రచ్ఛన్న యుద్ధం లో అగ్రరాజ్యాలకు విరుద్దంగా   చైనాతో సఖ్యత గా ఉండాలని భావిస్తున్న నెహ్రు కు  చైనా యుద్ధం తీవ్ర షాక్ నిచ్చింది. రక్షణ మంత్రి V.కృష్ణ మీనన్ చైనా యుద్ధంలో తన పాత్ర గురించి తీవ్ర విమర్శలు ఎదుర్కొని చివరకు రాజీనామా చేశారు. చైనీయులు  అక్సాయ్ చిన్ ఆక్రమించి మరియు వాస్తవాదిన  రేఖ వరకు చోచ్చుకొచ్చారు.
 
4 వ లోక్ సభ : బలహీనమైన  కాంగ్రెస్ కానీ సభలో బలమైన ప్రధాని.
26స్థానాలు  పెరిగి  ఈ సభ లో మొత్తం 520 మంది ఎంపిలు గా  ఉన్నారు. కాంగ్రెస్ 1967 సాధారణ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయినారు. (నెహ్రూ మరియు శాస్త్రి మరణాల అనంతరం చాలా సీట్లు కోల్పోయి  కాంగ్రెస్ గణనీయంగా బలహీనపడింది).
 
స్వతంత్ర పార్టీ 44 మంది సభ్యులతో సభలో రెండవ స్థానంలో నిలిచింది.
 
ఈ సభ  4 మార్చి 1967 నుండి 27 డిసెంబరు 1970 వరకు పనిచేసింది. దాని పదవీకాలం ముగియడానికి ఒక సంవత్సరం ముందు ఇందిరా గాంధీ సభను రద్దు చేసి, 1971 లో మధ్యంతర ఎన్నికలకు  పిలిచారు,
 
 
5 వ లోక్ సభ : అణు పరీక్షఅత్యవసర పరిస్థితిజెపి ఆందోళన.
 
15 మార్చి 1971 నుండి 18 జనవరి 1977 వరకు సాగిన ఈ సభ లో పాక్ తో యుద్ధం జరిగి  బంగ్లాదేశ్ ఏర్పడుట మరియు అత్యవసర పరిస్థితి ప్రకటన పై చాలా చర్చలు జరిగినవి.  1974 లోభారతదేశం మొదటి అణు పరీక్షలు నిర్వహించిందిమరియు లోక్ నాయక జయప్రకాష్ నారాయణ్ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అవినీతి మరియు దుర్మార్గపు పాలనకు కి వ్యతిరేకంగా తీవ్ర  ఆరోపణల తో జే.పి. ఆందోళన  ప్రారంభించారు.
 
ఇందిరా గాంధీసభలో మెజారిటీని పొందినప్పటికీతన అధికారాన్ని నిలబెట్టుకోవాలని కోరుకున్నారు. ఐదోవ లోక్ సభ పదవి కాలం పొడిగించి  1975 లో అత్యవసర పరిస్థితి ప్రకటనను జారీచేసిపౌర స్వేచ్ఛను నిలిపివేసినారు.  
 
 
6 వ లోక్ సభ : ఎమర్జెన్సీ అనంతరం  భారతదేశం లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వo ఏర్పడింది.
 
21-నెలల అత్యవసర పరిస్థితి అనంతరం  ఆరవ లోక్ సభ మొదటి సారిగా  భారతదేశంలో  కాంగ్రెస్ రహిత మంత్రివర్గాన్ని ఏర్పరిచినది. జనతా పార్టి 345 సీట్లు గెలుచుకున్నది.మొరార్జీ దేశాయ్ మార్చి 24, 1977న ప్రధాన మంత్రి అయ్యారు. ఆ తరువాత చౌదరి చరణ్ సింగ్ 28 జూలై 1979 న ప్రధాన మంత్రి అయ్యారు.
 
ఆరవ లోక్ సభ లో కాంగ్రెస్ కేవలం 154 సీట్లను సాధించగలిగింది, 1980 లో సభ పదవీకాలం ముగిసింది.
 
ఆరవ లోక్ సభ లో  27 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 542 సీట్లకు ఎన్నికలు జరిగాయి
 
 
7 వ లోక్ సభ: ఇందిరా గాంధి హత్యఅల్లర్లు చెలరేగాయి
 
1980 జనవరిలో  జరిగిన ఎన్నికలలో 353 లోక్ సభ  స్థానాలలో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జనతా పార్టీ కేవలం 31 సీట్లు మాత్రమే సాధించింది. చరణ్ సింగ్ యొక్క జనతా పార్టీ (సెక్యులర్) 41 స్థానాలు సాధించింది. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి గా మరోసారి ఎన్నికైనారు. కాని 1984 అక్టోబరు 31 న ఆమె హత్య చేయబడిందిఅదే రోజుఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా నియమించబడ్డారు. ఇందిరా హత్య తరువాతవేలమంది సిక్కులు రాజధానిలో జరిగిన మత హింసలో చంపబడ్డారు.7 వ లోక్ సభ సబ్యుల  సగటు వయసు 46.2 సంవత్సరాలు.
 
 
8 వ లోక్ సభ : కాంగ్రెస్ మెజారిటీ సాధించినది కానీ  ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగింది.
 
ఇందిరా గాంధీ హత్య తర్వాత సానుభూతితో కూడిన తరంగం వీచి ఎనిమిదవ లోక్ సభ లో లో కాంగ్రెస్ 422 సీట్లను సాధించినది. జాతీయ స్థాయి రాజకీయాలలో బలమైన ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం జరిగింది. తెలుగుదేశం పార్టీ 30 సీట్లతో సభ లో రెండవ అతిపెద్ద పార్టీగా ఉంది. భారతీయ జనతా పార్టీకి రెండు స్థానాలున్నాయి. రాజీవ్ గాంధీ ఆరవ ప్రధానమంత్రిగా 1984 నుంచి 1989 వరకు పదివిలో  ఉన్నారు. ఆయన పదవి కాలం  బోఫోర్స్ కుంభకోణంపంజాబ్లో ఉగ్రవాదం పెరుగుదల మరియు శ్రీలంకలో జరిగిన పౌర యుద్ధం తో నిండినది.
 
9 వ లోక్ సభ : మండల్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం అమలుచేస్తోంది
 
2 డిసెంబరు 1989 నుండి 13 మార్చి 1991 వరకు V.P.సింగ్  బిజెపికమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) మద్దతుతో ప్రధాని పదవిలో ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతులకు ప్రభుత్వరంగంలో కోటా కేటాయింపు కోసం మండల్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలన్న తన ప్రభుత్వ ఉద్దేశం ను వి.పి సింగ్ ప్రకటించినారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు  హింసాత్మక నిరసన ప్రదర్శనలకు పాల్పడినారు. ఎల్.కే. అద్వాని అరెస్టు అయిన తర్వాత బిజెపి, ప్రభుత్వంకు  తన మద్దతును ఉపసంహరించుకుంది. చంద్రశేఖర్ ప్రధాన మంత్రి అయ్యారు, 1990 నవంబరు 10 నుండి కాంగ్రెస్కు వెలుపల మద్దతుతోజూన్ 21, 1991 వరకు పదవి లో ఉన్నారు.
 
 
10 వ లోక్ సభ : కాంగ్రెస్ పార్టీ వామపక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది
 
పదవ లోక్ సభ కు  ఎన్నికలు 1991 లో జరిగాయిమరియు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ హత్య తరువాత ఏర్పడిన సానుభూతి తో పెద్దదైన పార్టీగా అవతరించింది.
244 స్థానాలు పొందిన కాంగ్రెస్వామపక్ష పార్టీల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
 
పివి నరసింహారావు నరసింహరావు ప్రధానమంత్రి అయ్యారు. రావు 21 జూన్ 1991 నుండి 16 మే 1996 వరకు పదవిని కలిగి ఉన్నారు.
ఇది సంస్కరణలు మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క సరళీకరణ విధానాలు అనుసరించిన యుగం.
 
11 వ లోక్ సభ: దేశం రెండు సంవత్సరాల వ్యవధిలో మూడు ప్రధాన మంత్రులను చూస్తుంది
 
1996 ఎన్నికల ఫలితం గా హాంగ్ పార్లమెంటు ఏర్పడినది మరియు సభ రద్దు చేయబడటానికి మరియు ఎన్నికలు జరగాతానికి ముందు రెండు సంవత్సరాలలో దేశంలో ముగ్గురు  ప్రధానమంత్రులు గా ఉన్నారు.
 
బిజెపి 161 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది, 16 మే 1996 న ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, 13 రోజుల తరువాత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మెజారిటీ నిరూపించలేకపోయారు.జనతాదళ్ఎస్పిడిఎంకెటిడిపిఇతర పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ కాంగ్రెస్ బయటి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేవ్ గౌడ మరియు I.K. గుజ్రాల్ ప్రధానులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించిన తరువాతనవంబరు 28, 1997 న సభ రద్దు చేయబడింది.
 
 
12 వ లోక్:  సభ లో జయలలిత నేతృత్వoలోని ఎఐఎడిఎంకె కింగ్-మేకర్  పాత్ర పోషిoచినది.
 
పూర్తి పదవీకాలం లేదా స్థిరమైన ప్రభుత్వాన్ని అందించని మూడవ వరుస సభ ఇది.
సభ 13 మార్చి 1998 నుండి 10 మార్చి 1998 వరకు 26 ఏప్రిల్ 1999 వరకు కొనసాగింది. అటల్ బిహారీ వాజ పాయ్  ప్రధానమంత్రిగా మరియు అతని పార్టీ బిజెపి కి 182 మంది ఎంపీలు ఉన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె  చెందినా  18 మంది ఎంపీలు ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటూకూటమి నుండి వైదొలిగిన తరువాత వాజ్పేయి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDAఎన్డిఎ) ప్రభుత్వం కూలిపోయింది. పార్లమెంట్ విశ్వాసం ఒక్క వోట్ తేడాతో కోల్పోయింది.  
 
 
13 వ లోక్ సభ : వాజపాయ్ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది
 
అక్టోబరు 10, 1999 నుండి 6 ఫిబ్రవరి 2004 వరకు కొనసాగిన ఈ సభ తన పదవి కాలం పూర్తి చేసింది. సభ లో NDA  270 సీట్లు కలిగి ఉంది. వాజపేయి మరోసారి ప్రధానమంత్రిగా అయ్యారు. ఈ సభలో కార్గిల్ యుద్ధం నుండిపాకిస్తాన్తో శాంతి చర్చలతో పాటు  రూపాయి విలువలో క్షీణత మరియు ఐసి 814 ను హైజాక్ చేయడంపై నిరసన చర్చలు జరిగాయి. 1998 లో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఉగ్రవాదులు 2001 లో పార్లమెంటుపై దాడి చేశారు. లోక్ సభ కార్యకలాపాల పరంగాఅంతరాయం కలిగిన సమయం తక్కువగా ఉంది. లోక్ సభ మొత్తం పనితీరులో క్షీణత ఈ సభతో ప్రారంభమైంది.
 
 
 14 వ లోక్ సభ : లోక్ సభ కార్యక్రమాలకు  తరచూ అంతరాయo కలిగి  సభ పని చేయలేదు.
 
మే 14, 2004 నుండి 18 మే 2009 వరకు 14 వ లోక్ సభ  సమావేశం కాగామన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని UPAయునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ సభలో మెజారిటీని కలిగి ఉందిమరియు ఎనిమిది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.
 
2004 లో పార్లమెంటు అతి తక్కువ బిల్లులను అనగా కేవలం 18 మాత్రమే ఆమోదించింది. పార్లమెంటులో ప్రశ్నలను అడుగుటకు 10 మంది లోక్ అభ  ఎంపీలు  (మరియు ఒక రాజ్యసభ ఎంపి) నగదును స్వీకరించినట్లు ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయట పడినది. మొత్తం 10 మంది సభ్యులువీరిలో ఎక్కువ మంది బిజెపిబిఎస్పిలకు చెందిన వారు సభ  నుంచి బహిష్కరించబడ్డారు.
 
 
15 వ లోక్ సభ :  సభ పనిలో  తరచూ అంతరాయo ఏర్పడినది.
 
https://www.livemint.com/images/static/1x1_img.gif
2009 సాధారణ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ2 ప్రభుత్వం తిరిగి అధికారం లోకి నడిపించింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కొనసాగారు. 2 జి స్పెక్ట్రమ్బొగ్గు గనుల కేటాయింపురిటైల్ రంగంలో FDIఎఫ్డిఐప్రత్యేక తెలంగాణా డిమాండ్కామన్వెల్త్ క్రీడలలో అవినీతి ఆరోపణల పై సభలో  తరచుగా పని భంగమైంది.
 
ఈ లోక్ సభ  సంవత్సరానికి సగటున 40 బిల్లులను ఆమోదించిందిఇది మునుపటి లోక్ సభలతో  పోల్చితో చాలా తక్కువ.  ఈ సభ  ద్వారా ఆమోదించబడిన ముఖ్యమైన చట్టాలు సివిల్ లయబులిటి ఫర్ న్యూక్లియర్ డామేజేస్ బిల్లు, రైట్ టు ఎడ్యుకేషన్ భూ సేకరణఆహార భద్రతకంపెనీల చట్టం మొదలగునవి.
 
16 వ లోక్ సభ  : బిజెపి స్పష్టమైన మెజారిటీ పొందిన మొదటి కాంగ్రెసేతర రాజకీయ పక్షం
 
16వ లోక్ సభ 2014 మే 26 న నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ప్రారంభమైంది. బిజెపికి 282 స్థానాలతో సంపూర్ణ మెజారిటీ ఉందిఎన్డిఎ దాని మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్కు కేవలం 44 సీట్లు మాత్రమే ఉన్నాయి.
 
ఈ సభ  133 బిల్లులను ఆమోదించింది మరియు 45 ఆర్దినేన్సేస్ జారి చేసింది.. 16 వ లోక్ సభ  1,615 గంటలకు పనిచేసిందిఇది గత సభ కంటే 20 శాతం ఎక్కువకానీ అన్ని పూర్తి-కాలపు లోక్ సభల (2,689 గంటలు) సగటు కంటే 40% తక్కువగా ఉంది. 16 వ లోక్ సభ లో 62 మంది మహిళా ఎంపీలు ఉన్నారుఅత్యధికంగాసభ్యులు సగటున 80% సమావేశాలకు  హాజరు అయ్యారు.

17వ లోక్ సభ:
2019 లోక్ సభ ఎన్నికల లో 303 స్థానాలతో బి.జే.పి అతి పెద్ద పార్టిగా అవతరించినది. కాంగ్రెస్స్ 52 స్థానాలు పొందినది. NDA కూటమికి ఈ ఎన్నికలలో 352 స్థానాలు లబించగా, UPA కూటమి 91 స్థానాలు ఇతర రాజకీయ పక్షాలకు 99 స్థానాలు లబించినవి. శ్రి నరేంద్ర మోడీ తిరిగి ప్రధాన మంత్రిగా ఎన్నికైనారు. విజయం పొందిన 542 అబ్యర్దులలో 300 మంది కొత్తగా ఎన్నికైనవారు. 197 మంది తిరిగి ఎన్నికైనారు. 45 మంది క్రిందటి లోక్ సభ లో సబ్యులుగా ఉన్నారు.70 సంవత్సరాల కంటే అధికులు కొద్ది సంఖ్యలో ఎన్నికైనారు. ఎక్కువమంది 40 కంటే తక్కువ సంవత్సరాలు కలవారు. MPల సగటు వయస్సు 54 సంవత్సరాలు. మహిళలు  78 విజయం విజయం పొందారు. ఇది ఒక రికార్డు. కొత్త లోక్ సభ లో ఎన్నికైన  దాదాపు 50 శాతం ఎంపీల పై  క్రిమినల్ రికార్డు కలదు. లోక్ సభ కు ఎన్నికైన 542 మంది లో 475 మంది కోటిశ్వరులు.
 
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading