Logo Raju's Resource Hub

పి.టి. ఉష పరుగుల రాణి

Google ad
PT Usha

పి.టి. ఉష క్రీడారంగంలో భారత దేశపు క్రీడారంగంలో పరుగుల రాణి పేరు పొందింది.
ఉష కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో 1964 మే 20 న జన్మించింది.
1979 నుంచి, భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది. ఈమెను పయోలి ఎక్స్ ప్రెస్ అని పిలుస్తారు. పి.టి.ఉష 1976లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశాలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి, అందులో చేరింది. 1979లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొన్నది. అప్పుడే ఆమెలోని నైపుణ్యాన్ని కోచ్ ఓ. నంబియార్ పసిగట్టాడు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు అతడే కోచ్ గా శిక్షణ ఇచ్చాడు. ఆ సమయంలో దేశంలో మహిళా అథ్లెట్ల సంఖ్య చాలా తక్కువ.

అథ్లెటిక్ సూట్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అరుదుగా జరిగేది. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్ననూ ఆమెకు అది అంతగా కలిసిరాలేదు. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో 100 మీ. మరియు 200 మీటర్ల పరుగులో రజత పతకం పొందింది. 1985లో కువైట్లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఉష బంగారుపతకం పొందడమే కాకుండా, కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 1983 నుంచి 1989 మధ్యకాలంలో ఉష ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పోటీలలో 13 స్వర్ణ పతకాలను సాధించింది. 1984లో అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఉష సెమీఫైనల్స్ లో పథమస్థానంలో వచ్చినా కూడా పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే అవకాశం పోగొట్టుకుంది. సెకనులో వందోవంతు తేడాతో కాంస్యపతకం పొందే అవకాశం జారవిడుచుకున్ననూ, ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 1960లో ప్లయింగ్ సిఖ్ మిల్కాసింగ్ కు కలిగిన దురదృష్టమే పి.టి.ఉషకు కూడా కలిగింది.

1986లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగిన 10 వ ఆసియా క్రీడలలో పి.టి.ఉష 4 బంగారు పతకాలను సాధించడమే కాకుండా అన్నిట్లోనూ ఆసియా రికార్డులు సాధించడం విశేషం. అదే ఆసియాడ్ లో మరో రజత పతకం కూడా సాధించింది. 1985లో జకార్తాలో జరిగిన 6వ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్ పోటీలలో ఈమె 5 బంగారు పతకాలను సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ క్రీడాజీవితంలో ఈమె 101 స్వర్ణ పతకాలను సాధించింది.
1984 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదం అందుకుంది. 1985 లో జకర్తా అథ్లెటిక్ మీట్ లో గొప్ప మహిళా అథ్లెట్ గా పేరుపొందింది.

1984, 1985, 1986, 1987 మరియు 1989 లలో ఆసియా అవార్డులో అత్తమ అథ్లెట్ గా అవార్డు అందుకుంది
1984, 1985, 1989 మరియు 1990 లలో ఉత్తమ రైల్వే క్రీడాకారులకు ఇచ్చే మార్షల్ టిటో అవార్డు దక్కించుకొంది
1986 లో సియోల్ ఆసియా క్రీడలలో ఉత్తమ అథ్లెట్ కు ప్రధానం చేసే అడిడాస్ గోల్డెన్ షూ అవార్డు సంపాదించింది
అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రదర్శనకు 30 అంతర్జాతీయ అవార్డులు
1999 కేరళ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవార్డు కైవసం చేసుకొంది
1985, 1986 లలో ఉత్తమ అథ్లెటకు ఇచ్చే వరల్డ్ ట్రోఫీ అవార్డు ఈమెకు ప్రధానం చేసారు.

Google ad
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading