Google ad
కావలసినవి :
ఒక కప్పు ఓట్స్
ముప్పావు కప్పు నీరు
పావు టీస్పూన్ పసుపు
నిమ్మరసం : ఒకటిన్నర స్పూనులు
ఉప్పు : సరిపడా
వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా
నూనె : 2 టీస్పూన్లు
తాలింపుకు :
పోపు గింజలు : 1 స్పూను
కరివేపాకు : రెండు రెమ్మలు
ఎండుమిరపకాయ : 1
ఇంగువ : కొద్దిగా
పచ్చి మిరపకాయలు : రెండు సన్నగా తరిగినవి
తయారు చేయువిధానం : అడుగు మందంగా గల పాన్లో నూనె వేడి చేసి పోపుగింజలు వేసి చిటపటలాడనివ్వాలి. పచ్చిమిరకాయ ముక్కలు, వేరుశెనగ గుళ్ళు, ఎండు మిరపకాయ కరివేపాకు, ఇంగువ వేసి కలపాలి రెండునిమిషాలు వేయించాలి నీరుపోసి, పసుపు, ఉప్పు వేసి బాగా మరగ నివ్వాలి. తరువాత ముందుగానే కొద్దిగా వేయించిన ఓట్స్ ను వేసి కలిపి మూతపెట్టి నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి. నిమ్మరసం పిండి వడ్డించాలి.
Google ad
Raju's Resource Hub