Logo Raju's Resource Hub

Fish Varities

Google ad

చేపల వేపుడు


చేపల వేపుడుకు బొచ్చె చేపలు, వంజిరం చేపలు, పండుగప్ప లేక కొంచెం పెద్ద చేపలు బాగుంటాయి. చేప తోకముక్కలు, చిన్నచేపలు ముళ్ళతో ఉండి తినటానికి అసౌకర్యంగా ఉంటుంది.

కావలిసినవి
చేపముక్కలు : కిలో
కారం : 2 టీస్పూన్లు
ధనియాల పొడి : టీ స్పూను
మెంతిపొడి : అరస్పూను
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒకటేబుల్ స్పూన్
ఉప్పు: తగినంత
పసుపు : టీస్పూను
నిమ్మరసం : 4 టీస్పూన్లు
నూనె : వేయించటానికి సరిపడినంత తీసుకోవాలి.
కొత్తిమీర : కొద్దిగా

బజారు నుండి కొనుగోలు చేసిన చేపముక్కలను అలాగా వండరాదు. వాటిని ఉప్పు కొద్దిగా మజ్జిగ కలిపి శుభ్రం చేసుకోవాలి తరువాతవాటిని చక్కగా కడిగాలి.

ఒక పాత్రలో కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, మెంతిపొడి, మిరియాలపొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నీరు పోసీ వీటన్నిటినీ పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమాన్ని చేపలకు బాగా పట్టించి ఓ స్టీల్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో ఓ గంటసేపు ఉంచాలి. తరువాత బయటకు తీసి కొంచెంసేపు ఉంచితే చల్లదనం తగ్గి మాములుగా ఉంటాయి.

Google ad

స్టవ్ మీద వెడల్పాటి పాన్ లేక నాన్ స్టిక్ కుక్ వేర్ కానీ పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తరువాత మంట సిమ్ లో ఉంచి చేపముక్కలను పరవాలి. ఓ అయిదు నిమిషాల తరువాత చేపముక్కలను రెండవపక్కకు త్రిప్పాలి. మంటను మీడియంలో పెట్టి చేపేముక్కలను రెండుప్రక్కలా బ్రౌన్ కలర్ వచ్చే దాకా వేయించి దించుకొని నిమ్మరసం, కొత్తిమీర చల్లుకొని కొద్దిగా ఆరిన తరువాత వడ్డించాలి.

చేపల పులుసు


కావలిసినవి
చేపలు : 1 కె.జి
ఉల్లిపాయలు : పావు కిలో
పచ్చిమిర్చి : 4 పసుపు : అర స్పూను
చింతపండు గుజ్జు : అరకప్పు (చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టి పిండుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
కరివేపాకు : 4 రెమ్మలు
దనియాలపొడి : టేబుల్ స్పూన్
జీలకర్రపొడి : 1 స్పూన్
ఉప్పు : తగినంత
కారం : 4 స్పూన్లు

తయారు చేసే విధానం
చేపముక్కలను శుభ్రం చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరుగుకోవాలి. ముందుగా పాన్ లేక వెడల్పాటి పాత్రలో నూనె వేసి వేడెక్కిన తరువాత అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దనియాల పొడి, జీలకర్రపొడి, కరివేపాకు వేసికొద్దిగా వేగిన తరువాత చేపముక్కలు వేసి అందులో చింతపండు గుజ్జు కలపాలి. తగానంత ఉప్పు, పసుపు కూడా వేసి అన్నీ కలిసేటట్లు నెమ్మదిగా గరిటతో కలపాలి. కొద్దిగా నీరుపోసి చేప ముక్కలు ఉడికాక దించుకొని కొత్తిమీర చల్లి వడ్డించాలి.
కారం ఎక్కువగా తినేవారు ఇంకొద్దిగా కారం కలుపుకోవచ్చు. చేపల పులుసుకు బొచ్చెలు, కొరమీనులు, వంజిరం, పులస చేపలు, పండుకప్ప, చందువాలు పెద్దముక్కలు బాగుంటాయి.

బొమ్మిడాయిల పులుసు

కావలిసినవి
బొమ్మిడాయిలు : కిలో
ఉల్లిపాయలు : 2 పెద్దవి
పచ్చిమిర్చి : 4 కాయలు
టమాటోలు : 4 మీడియం సైజ్ వి
చింతపండు : 50 గ్రాములు
పసుపు : ఒక స్పూన్
కారం : 3 స్పూన్లు
కరివేపాకు రెబ్బలు : నాలుగు
కొత్తిమీర : కొద్దిగా
నూనె : 4 టేబుల్ స్పూన్లు
పుల్ల మామిడి కాయ : చిన్నది

తయారు చేసే విధానం
బొమ్మిడాయిలను శుభ్రం చేసుకోవాలి. చింతపండును వేడినీళ్ళలో నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకోవాలి. టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా తరుగుకోవాలి.

పాన్ లో గానీ, వెడల్పాటి పాత్రలో గానీ నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోలు వేసి ఇవన్నీ బాగా మెత్తబడేవరకు ఉంచాలి. తరువాత చేప ముక్కలను మామిడి ముక్కలు ఉప్పు, కారం పసుపు వేసి చక్కగా కలపాలి. తరువాత చింతపండు గుజ్జును వేసి మరొకసారి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు కలిపి చక్కగా ఉడికిన తరువాత దించేముందు కొత్తిమీర చల్లి వడ్డించాలి.

Kerala fish – Nethili fish fry / నెత్తిలి చేపల ఫ్రై

Kerala fish – Nethili fish fry / నెత్తిలి చేపల ఫ్రై
కావలిసినవి
నెత్తిలి చేపలు – పావుకేజీ
నూనె – వేయించేందుకు సరిపడా.
మసాలా కోసం: చిన్న ఉల్లిపాయలు – ఎనిమిది
వెల్లుల్లి- నాలుగు రెబ్బలు
అల్లం ముక్కలు – రెండు
కారం – చెంచా
పసుపు – చిటికెడు
మిరియాల పొడి – పావు చెంచా
మైదా – మూడు చెంచాలు
గుడ్డు – ఒకటి ఉప్పు – తగినంత.
ముందుగా చేపలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. అల్లం, మిరియాలు, కరివేపాకును మిక్సీలో ముద్దలా నూరుకోవాలి. ఈ మిశ్రమానికి కారం, పసుపు, ఉప్పు, చెంచా నీళ్లు కలిపి చేప ముక్కలకు పట్టించాలి. అరగంటయ్యాక బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది బాగా కాగిన తరువాత ఒక్కొక్క చేపను వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.

Kerala Spicy Fish Fry / కేరళ స్పైసీ ఫిష్ ఫ్రై

చేపల వేపుడుకు బొచ్చె చేపలు, వంజిరం చేపలు, పండుగప్ప లేక కొంచెం పెద్ద చేపలు బాగుంటాయి. చేప తోకముక్కలు, చిన్నచేపలు ముళ్ళతో ఉండి తినటానికి అసౌకర్యంగా ఉంటుంది. చేపలు – అరకేజీ,
కారం – నాలుగు చెంచాలు
పసుపు- పావు చెంచా
అల్లంముక్క- చిన్నది
మిరియాలు – చెంచా
కరివేపాకు- నాలుగు రెబ్బలు
ఉప్పు – తగినంత
నూనె- వేయించేందుకు సరిపడా
ముందుగా చేపలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. అల్లం, మిరియాలు, కరివేపాకును మిక్సీలో ముద్దలా నూరుకోవాలి. ఈ మిశ్రమానికి కారం, పసుపు, ఉప్పు, చెంచా నీళ్లు కలిపి చేప ముక్కలకు పట్టించాలి. అరగంటయ్యాక బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది బాగా కాగిన తరువాత ఒక్కొక్క చేపను వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.

Fish cutlets….బొచ్చెచేపలతో కట్ లెట్స్

కావలిసినవి
బొచ్చె చేప ముక్కలు – 10
తాజా అల్లం వెల్లుల్లి రెబ్బలు : 4 టీ స్పూన్ల పేస్ట్
పుదీనా ఆకు – ఒక కట్ట
పచ్చిమిర్చి – పది కాయలు
పొద్దుతిరుగుడు నూనె – అరకప్పు
తాజా కొబ్బరి తురుము – వంద గ్రా
ఉప్పు – సరిపడా
పసుపు – అరస్పూను
అరటిఆకులు – పెద్దవి నాలుగు

తయారు చేసే విధానం
ముందుగా పుదీనా ఆకులు, అల్లం తరుగు, కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తీసుకుని నీళ్లు పోయకుండా మెత్తగా రుబ్బుకోవాలి.

బొచ్చె చేప ముక్కలను బ్రెడ్ స్లైసులలాగా వెడల్పాటి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పడు మందుగా తయారు చేసుకున్న మషాలాను ఒక్కోచేపముక్కకు పట్టించి ఒక గంటసేపు ఉంచాలి. తరువాత అరటి ఆకులను కొంచెం వెడల్పుగా కత్తిరించికొని వాటికి పైభాగంలో నూనె రాసి ఒకో దాంట్లో ఒకో చేపముక్కను ఉంచి అరటి ఆకుల అంచులను మడచి ఊడిపోకుండా దారంతో కట్టాలి.
వీటిని ఆవిరి మీద (ఇడ్లీ పాత్రలో) షుమారు 20 నుండి 25 నిమిషాల సేపు ఉడికించుకొని దించుకోవాలి. దీని వల్ల ఎక్కువగా నూనె వాడాల్సిన అవసరం ఉండదు. నిమ్మరసం, కొత్తిమీర తురుము చల్లుకోవచ్చు. వేడిగా తింటే రుచిగా ఉంటాయి

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading