
కావలసినవి :
రొయ్యలు : అర కిలో
బాస్మతి బియ్యం : 2 కప్పులు
ఉల్లిపాయ : సన్నగా ముక్కలు చేయాలి
పచ్చి మర్చి : 2 నిలువుగా చీల్చాలి
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లు
టమాటోలు : 2 ముక్కలుగా తరుగుకోవాలి
నిమ్మకాయ : ఒకటి
కొత్తిమీర : గుప్పెడు
పొదినా ఆకులు : గుప్పెడు
కారం : 2 స్పూన్లు
ధనియాల పౌడర్ : 1 స్పూను
పసుపు : పావు స్పూను
ఉప్పు : తగినంత
లవంగాలు : 4
పెరుగు : అరకప్పు
దాల్చిన చెక్క : 1 ముక్క
ఏలకులు : రెండు
బిర్యాని ఆకు : 1
జాపత్రి : 1
నెయ్యి : 2 స్పూన్లు
నూనె : 2 స్పూన్లు
తయారు చేయువిధానం : రొయ్యలు ఒలిచి శుభ్రం చేసుకోవాలి. బాగా కడిగి ఒక స్పూను కారం, అర స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు అన్నింటినీ రొయ్యలకు బాగా పట్టించి పక్కన ఉంచుకోవాలి. పాన్లో నూనె, నెయ్యు వేసి కాగాక దాల్చిన చెక్క, ఏలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగాలు వేయాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి తరువాత మిగిలిన అల్లం, వెల్లుల్లి పేస్ట్,పచ్చి మిర్చి వేసి పచ్చివాసన పోయే దాకా రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాటోలు, మిగిలిన కారం, ధనియాల పౌడర్, పసుపు వేసి మంచి మషాలా వాసన వచ్చేదాకా వేయించాలి. తరువాత తరిగిన కొతిమీర కొద్దిగా, తరిగిన పొదీనా ఆకులు వేసి 2 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మషాలా పట్టించిన రొయ్యలను కలపి రెండు నిమిషాలపాటు ఉంచాలి. తరువాత బియ్యం, నిమ్మరసం, మూడు కప్పుల నీళ్ళు కలిపి బాగా కలిపి మొత్తం ఉడికే దాకా ఉంచి దించుకోవాలి. రుచి కోసం కొత్తీమీర చల్లుకోవచ్చు.
రొయ్యలతో దమ్ బిర్యానీ

కావాల్సినవి: రొయ్యలు – అరకిలో, బాస్మతి బియ్యం – ముప్పావుకిలో, పెరుగు – ఒక టీస్పూను, టమాటా – ఒకటి, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీస్పూను, పచ్చిమిర్చి – రెండు, గరంమసాలా పొడి – ఒక టీ స్పూను, పసుపు – అర టీస్పూను, లవంగాలు – ఆరు, దాల్చిన చెక్క – ఒక ముక్క, యాలకులు – నాలుగు, అనాస పువ్వు – ఒకటి, బిర్యానీ ఆకులు – మూడు, పుదీనా – ఒక కట్ట, కారం – ఒక టీస్పూను, నీళ్లు తగినన్ని , ఉల్లిపాయ – ఒకటి, నూనె, నెయ్యి – సరిపడినంత
తయారీ: రొయ్యల్ని బాగా కడిగి గిన్నెలో వేసుకోవాలి. అందులో కాస్త పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా పొడి, కారం వేసి, బాగా కలిపి ఒక గంట పాటూ పక్కన పెట్టేయాలి. బాస్మతి బియ్యం కడిగి ఇరవై నిమిషాల పాటూ నానబెట్టాలి. స్టౌ మీద పెద్ద గిన్నె పెట్టి (బిర్యానీ పాత్ర) ముప్పావు కిలో బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని వేయాలి. అందులో మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, సరిపడినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసి ఉడికించాలి. అన్నం పూర్తిగా ఉడకడానికి పదినిమిషాల ముందు స్టవ్ ఆపేయాలి. బియ్యంలోని నీటిని వంపేయాలి. పాన్‌ను స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడెక్కాక తరిగిన ఉల్లి, పచ్చిమర్చి వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. మారినేషన్ చేసిన రొయ్యల్ని కూడా అందులో వేసి వేపాలి. తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేయించాలి. గ్రేవీలా వచ్చాక ఆపేయాలి. ఇప్పడు ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి అడుగున కొంచెం నూనె వేసి, సగం ఉడికిన రైస్ కొంత పరవాలి. దానిపై రొయ్యల గ్రేవీ వేయాలి. మళ్లీ దానిపై మిగిలిన రైస్ వేసేయాలి. రైస్ పై కాస్త నెయ్యి చల్లి, తరిగిన పుదీనా, కొత్తిమీర వేయాలి. ఇప్పడు కుక్కర్ మూతపెట్టి, విజిల్ కూడా పెట్టేయాలి. ఒక అయిదు నిమిషాల పాటూ స్టవ్ సిమ్ లో పెట్టి ఉడకనివ్వాలి. విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. పావు గంట తరువాత మూత తీస్తే బిర్యానీ వాసన ఘుమఘుమలాడి పోతూ వస్తుంది.
Raju's Resource Hub