కావలసినవి :
2 కప్పుల ఉడికిన అన్నం
ఉల్లిపాయ సన్నగా తరిగినది 1
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్
టమాటోలు సన్నగా తరిగినవి-1 , గ్రైండ్ చేసినవి- 2
పచ్చిమిర్చి : 2 సన్నగా తరిగినవి
కారం :1 స్పూను
ఉప్పు : తగినంత
ఆయిల్ 2 టీ స్పూన్లు
ఆవాలు : పావు స్పూను
జిలకర్ర : పావు స్పూను
కరివేపాకు : 2 రెమ్మలు
వేరుశెనగ గుళ్ళు లేక జీడిపప్పు 2 స్పూన్లు
తయారు చేయువిధానం : పాన్లో నూనెపోసి కాగిన తరువాత ఆవాలు, జిలకర్ర, చాయమినపప్పు వేసి 2 నిమిషాల పాటు వేయించి, ఉల్లిపాయలు తరిగినవి, పచ్చిమిర్చి, వేరువెనగ లేకజీడిపప్పు వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తరువాత అల్లం,వెల్లుల్లి పేస్ట్ కలపాలి తరువాత టమాటో గుజ్జు వేసి కొద్దిసేపు ఉంచాలి. తరువాత సన్నగా తరిగిన టమాటోలు, గరమ్ మసాలా కొద్దిగా, కారం కలిపి రెండు నిమిషాలపాటు వేయించాలి. చివరిలో అన్నం ఉప్పు కలిపి రెండు నిమిషాలు ఉంచి దించాలి. కొద్దిగా సన్నగా తరిగిన కొతిమీర చల్లి వడ్డించాలి.
Raju's Resource Hub