Logo Raju's Resource Hub

Dental Problems…దంత సమస్యలు

Google ad

పళ్ళు జివ్వున లాగటం
ఐస్‌క్రీము, కూల్‌ డ్రింక్స్, వేడి వేడి కాఫీ..టీ.. చల్లగా లేదా వేడిగా నోట్లో ఏం పెట్టుకున్నా పళ్లు జివ్వున లాగేస్తాయి…లక్షలాది మందిని బాధించే సర్వసాధారణ సమస్యలు…
నోట్లో మనం చూసేది, మనకు కనిపించేదీ దంతం పై భాగమే.దీన్నే మనం క్రౌన్‌ అంటాము. ఈ దంతాలన్నిటికీ దవడ ఎముకలో, చిగురు లోపల కూడా కొంత భాగం ఉంటుంది. దాన్ని దంత మూలం (రూట్‌) అంటారు. మనకు పైకి కనిపించే దంతంలో ప్రధానంగా ఎనామిల్‌, డెంటిన్‌, పల్స్‌ అనే మూడు పొరలుంటాయి. ఎనామిల్‌ పొర మన శరీరం మొత్తం మీద అత్యంత దృఢమైన, ఎముక కంటే గట్టి పదార్థం. దంతాల పైభాగాన మనకు కనిపించేది అదే. రకరకాల కారణాల రీత్యా ఈ ఎనామిల్‌ పొర అరిగిపోతే దంతాలు అతి సున్నితంగా తయారై చిన్న చిన్న స్పందనకు కూడా జివ్వున లాగుతాయి. ఎనామిల్‌ డెంటిన్‌ పొరలు రెండూ కలిసే భాగం బయటపడిందంటే చాలు. మనకు దంతాలు జివ్వుమనే భావన ఆరంభమవుతుంది..
బాధకు కారణాలు
చాలా మంది దంతాలు శుభ్రంగా తెల్లగా మెరుస్తుండాలన్న ధ్యాసలో రోజూ 10నుండి15 నిమిషాలు పండ్లను బలంగా తోముతుంటారు. దీనివల్ల ఎనామిల్‌ అరిగిపోయి పన్ను సున్నితంగా తయారవుతుంది.
దంత ధావనంకోసం ఉప్పు, బొగ్గు వంటి గరుకు పదార్థాలను వాడటం.బలంగా రుద్దినా ఎనామిల్‌ అరిగిపోతుంది. బ్రష్ లలో హార్డ్‌ రకం బ్రష్ లు ఉపయోగించడం, ఎక్కువ బలాన్ని ఉపయోగించి రుద్దటటం, కిందికీ, పైకీ కాకుండా అడ్డంగా తోమటం, వీటివల్ల కూడా ఎనామిల్‌ అరిగిపోతుంది.
పండ్లు పండ్ల రసాలు, కూల్‌ డ్రింకు వంటి వాటిని తీసుకుని వెంటనే దంతాలను శుభ్రం చేసుకోకపోవటం వల్ల అక్కడ సిట్రిక్ ఆమ్లం తయారై అది ఎనామిల్‌ను తినేస్తుంది.
కొన్ని సార్లు దంతాలు విరిగి పోతుంటాయి. చిన్న చిన్న చెక్కల్లా రేగిపోతుంటాయి. ఇలా విరిగినప్పుడు డెంటిన్‌ పొర బయటపడడటం వలన కూడా పళ్లు జివ్వుమని అనిపించవచ్చు.
కొందరికి శరీరంలో క్యాల్షియం లోపం ఉంటుంది. అలాగే స్వతహాగా కొందరికి దంతాల మీద ఎనిమిల్‌ తయారవ్వదు. తయారైనా బలంగా ఉండదు. ముఖ్యంగా ఎమిలోజెనిసిస్‌ ఇమ్‌పర్‌ఫెక్టా, డిరటినో జెనిసిస్‌ ఇమ్‌పర్‌ ఫెక్టా వంటి సమస్యల్లో కూడా ఎనామిల్‌ పొర సరిగా లేక జివ్వుమనే సమస్య ఆరంభమవుతుంది.
దీర్ఘకాలంగా చిగుళ్ల వ్యాధి ఉండటం (క్రానిక్‌ పెరిడాంటైటిస్‌) వల్ల చిగుళ్లు కిందికి జారిపోయి, దంతమూలం బయటపడుతుంది. దీనివల్ల కూడా జివ్వుమనే సమస్య వస్తుంది. దంతాల మీద రంధ్రాలు (క్యావిటీస్‌) ఏర్పడినా కూడా లోపలి నాడులు ప్రభావితమవుతూ దంతాలు జివ్వున లాగుతాయి. జాగ్రత్తలు
హార్డ్‌ బ్రష్ బదులు మరింత సున్నితంగా ఉంటే ఎక్స్‌ట్రా సాఫ్ట్‌ బ్రష్ వాడటం సున్నితంగా తోముకోవటం 3 నిమిషాలకు మించి పండ్లు తోమకుండా ఉండటం, ఉదయమే కాకుండా రాత్రి కూడా బ్రష్షింగ్‌ చేసుకోవటం చాలా అవసరం.
పండ్లుగానీ పండ్లరసాలు గానీ తిసుకుంటే వెంటనే నీరు పుక్కిలించి నోరు శుభ్రం చేసుకోవటం అవసరం.చిగుళ్ల సమస్య ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.
చికిత్స
పళ్లు జివ్వుమనే సమస్య అసలెందుకు వచ్చింది, ఎనామిల్‌ ఏ కారణంతో అరిగిందన్నది పరిశీలించి దాన్నిబట్టి చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారు. ముందు దంతా సున్నితత్వాన్ని తగ్గించే డీసెన్సిటైజింగ్‌ టూత్‌పేస్టు వాడటం వలన బాధ నుంచి ఉపశమనం ఉంటుంది. ఈ పేస్టును దంతాకు పట్టించి రెండు నిమిషాలుంచి ఆ తర్వాత మొత్తటి బ్రష్షుతో రుద్దుకుంటే సరిపోతుంది. అలాగే సున్నితత్వాన్ని తగ్గించేందుకు దంతాలకు ఫ్లోరైడ్‌ పేస్టు, క్రీము వంటివి పట్టించినా ఫలితం ఉంటుంది. కొందరికి దంతాల మీద రంధ్రాలు ఏర్పడటం వల్ల పళ్లు జివ్వున లాగుతుంటాయి. వీటిని వెంటనే ఫిల్లింగ్‌ చేయుంచుకోవాలి. దాంతో సమస్య తగ్గిపోతుంది. దంతాలు విరగటం వల్ల జివ్వుమనే సమస్య తలెత్తితే వాటికి రూట్‌ కెనాల్‌ చికిత్స చేసి పైన క్యాప్స్‌ అమరిస్తే సమస్య తగ్గిపోతుంది. దంతం లోపల ఉండే పల్స్‌ భాగం బయట పడకపోతే క్రౌన్స్‌ అమర్చినా ఉపయోగం ఉంటుంది. అత్యాధునిక ఆయాన్లతో చికిత్స లేదా లేజర్‌ చికిత్సతో సున్నితత్వాన్ని సమర్థంగా తగ్గించే అవకాశం ఉంది.
ఒకవేళ చిగురు కిందికి వెళ్లిపోవటం వల్ల దంతమూలం బయటపడి, జివ్వుమంటుంటే ముందు ఆ చిగుళ్ల వ్యాధికి చికిత్స చేయాలి. తరువాత దంతాన్ని సరిచేయాలి. కొందరికి వాంతలు, ఆమ్లాలు బయటకు వస్తుంటాయి. అవి కూడా దంతాలను దెబ్బతీస్తాయి. వాటిని న్యూట్రలైజ్‌ చెయ్యటానికి చికిత్స చేయాలి. దంతం విరిగిపోతే అదెంత వరకూ విరిగింది, దానికి క్యాప్స్‌ వెయ్యచ్చా? లేక కాంపోజిట్‌ ఫిల్లింగ్‌ చేయాల్పి ఉంటుంది? ఇవన్నీ ఆలోచించి వైద్యులు దాన్ని సరిచేస్తారు.
రూట్‌ కెనాల్‌ చికిత్స
పంటి మీద ఎనామిల్‌, దాని లోపల డెంటిన్‌ ఇంకా లోపల పల్స్‌ భాగాుంటాయి. లోపలగా ఉండే పల్స్‌లో నాడులు, రక్తనాళాలుంటాయి. దంతాల మీద చిన్న చిన్న రంధ్రాలు (క్యావిటీస్‌) ఏర్పడినపుడు తొలిదశలో డెంటిన్‌ వరకూ వెళ్లినా కూడా జివ్వుమనటం తప్పించి తీవ్రమైన బాధ ఉండదు. కానీ అది డెంటిన్‌ను దాటి పల్స్‌లోకి వెళ్లిందంటే మాత్రం బాధ తీవ్రంగా ఉంటుంది. అందులో నాడులు ఉంటాయి. కాబట్టి అవి ప్రభావితమై తీవ్రమైన నొప్పి ఆరంభమవుతుంది. ముఖ్యంగా ఈ నొప్పి రాత్రి పడుకున్నపుడు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలో రూట్‌కెనాల్‌ చికిత్స చాలా ఉపయోగపడుతుంది. దీనిలో దంతంలో ఉన్న నాడులు, రక్తనాళాలను శుభ్రం చేసి, రూట్‌ వరకూ ఫిల్లింగ్‌ చేసి, ఆ పంటి మీద సిరామిక్‌ లేదా జిర్కోనియంతో క్రౌన్‌ వేయ్యాల్సి ఉంటుంది. దీంతో పంటిని పూర్తిగా రక్షించుకున్నట్లుగా అవుతుంది.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading