స్త్రీలలో గర్భధారణ సమస్యలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అండాలు విడుదల సక్రమమంగా లేకపోవటం, ఫాలోషియస్ ట్యూఋలు మూసుకుపోవటం, పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవటం వంటి అనేక కారణాలు గర్భధారణకు అవరోధంగా మారుతాయి. ఈ సమస్యకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ థెరపీ చక్కని ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు డాక్టర్ సునీత.
ఎవరు చేసుకోవచ్చు : గర్భధారణతో కీలక పాత్ర పోషించే ఫాలోషియస్ ట్యూబ్స్ మూసుకుపోవటం లేదా దెబ్బతినడం, పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం, లేదా కణాలు చురుకుగా లేకపోవడం, గర్భధారణ సమస్యకు కారణాలు తెలియకపోవడం వంటి పరిస్థితులో ఐ వి ఎఫ్ చికిత్స ద్వారా గర్భధారణ ఇబ్బందులను అధిగమించవచ్చు.
ఐ వి ఎఫ్ అంటే ఏమిటి? సహజ సిద్ధంగా గర్భధారణ జరగని పక్షంలో పురుషుడి వీర్యాన్ని స్త్రీ అండాన్ని ప్రయోగశాలలో సంయోగం చేసి అండం ఫలదీకరణ జరిగేలా చేసి ఒకటి లేదా రెండు పిండములను స్త్రీ గర్భాశయములోకి బదిలీ చేసి అవి గర్భాశయ వాహికలోకి చేర్చడం ద్వారా అవి అక్కడ ఎదిగేలా చేయడం జరుగుతుంది.
ఐ వి ఎఫ్ ప్రక్రియ ముందుగా స్త్రీ శరీరంలోని అండమును అచేతనం చేయడానికి హార్మోన్ చికిత్స ఇవ్వడం జరుగుతుంది. గర్భధారణ చికిత్స జరుగుతున్న సమయంలో సొంత హార్మోన్లు అడ్డుపడకుండా ఉండేందుకు ఈ చికిత్స అవసరం. ఇది ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. అనంతరం అండాశయం అధిక సంఖ్యలో అండములను విడుద చేసేలా ప్రేరేపించడానికి ఫలదీకరణ ఇన్‌జెక్షన్ చికిత్స (గోనడోట్రోఫిన్ థెరపీ)ను స్త్రీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ చికిత్సా కాలంలో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా అండము ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది. అండము తగిన పరిమాణంలో పెరిగిన తరుణంలో హెచ్‌సిజి ఇంజక్షన్ ఇస్తారు. హెచ్‌జీజి ఇంజక్షన్ చేసిన 32-34 గంటల తరువాత పేషెంట్‌ను ఆసుపత్రిలో చేర్చుకొని జనరల్ అనస్థీషియా ఇచ్చి అండాశయంలో నుండి అండము సేకరిస్తారు. ఆల్ట్రా స్కానింగ్ ద్వారా అండమును గుర్తించడానికి జననాంగం పైన ఒక సన్నని నీడిల్‌ని అండాశయ పొరలోకి పంపడం జరుగుతుంది. పొర లోపలి ఉండే అండమును ఈ సూది ద్వారా వెలికితీసి పెట్రి డిష్‌లోకి చేరుస్తారు.
అలా మొత్తం అన్ని అండముల సేకరణ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ సాగుతుంది.అండముల సేకరణ పూర్తయిన అనంతరం పేషెంట్ విశ్రాంతి తీసుకున్న అనంతరం అదేరోజు ఇంటికి పంపించి వేస్తారు. అదే సమయంలో ఆమె భర్త నుంచి వీర్య సేకరణ జరుగుతుంది. అనంతరం ఈ కణాలను పెట్రిడిషలో ఉన్న అండముతో సంయోగం చేయడం జరుగుతంది. ఈ డిష్‌ను ఇన్‌క్యుబరేటర్‌లో ఉంచుతారు.
48 గంటల తర్వాత కొన్ని అండము ఫలదీకరణ జరుగుతుంది. అండము ఫలదీకరణ చెందిన తర్వాత ఇవి పిండముగా ఎదుగుతాయి. పిండమును గర్భాశయంలో ప్రవేశపెట్టే ప్రక్రియ చాలా సుభమైనది దీనికి అనెస్థీషియా కూడా అవసరం లేదు. గర్భాశయంలోకి వీటిని క్యాథటర్ ట్యూబ్ ద్వారా ప్రవేశ పెడతారు గరిష్టంగా రెండు పిండములను మాత్రమే గర్భాశయంలోని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అనంతరం స్త్రీకి ఫలదీకరణ చెంది ప్రత్యేక డిష్‌లో మిగిలిపోయిన పిండమును ఘనరూపంలోకి మార్చి భద్రపరచడం జరుగుతుంది. ఒకవేళ గర్భధారణ విఫలమైనా లేక మరోసారి గర్భధారణ ఆశించినా ఈ పిండము ఉపయోగపడుతుంది.
విజయావకాశము ఎంత? ఈ ప్రక్రియలో సుమారు 30-35 శాతం విజయావకాశాలు లభిస్తున్నాయి .అంతేగాక 35 సంవత్సరాల లోపు స్త్రీలలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దుష్పభావాలు ఉంటాయా ? గొనడోట్రోఫిన్ ఇన్‌జెక్షన్ వాడకం వల్ల అండాలు ఎక్కువ సంఖ్యలో పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల ఓవరీయన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ ఏర్పడి అండాశయంలో వాపు ఏర్పడవచ్చు. అయితే ఈ పరిస్థితి కేవలం 2 శాతం మందిలో మాత్రమే తలెత్తే అవకాశం ఉంది. అలాగే గర్భధారణ ఫలప్రదం అయ్యేందుకు రెండు పిండములను ప్రవేశ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల కవల శిశువులు జన్మించే అవకాశం 20 నుండి 40 శాతం వరకు ఉంది.
IVF …..సంతాన సాఫల్యానికి ఐ. వి. ఎఫ్
Google ad
Google ad
Raju's Resource Hub