వెబ్ డిజైనింగ్ కోర్సులు గ్రాఫిక్స్‌ను ఉపయోగించి నిర్వహణ యోగ్యమైన వెబ్‌సైట్‌ను తయారు చేయడం నేర్చుకోవచ్చ. సమాచారాన్ని అందంగా ఎలా కంటికి నచ్చే తీరులో తీర్చిదిద్దాలి, లే అవుట్, కంప్యూటర్, మొబైల్ మొదలైన అన్ని డివైజ్‌ల్లో సులభంగా ఉపయోగించేలా ఎలా రూపొందించొచ్చో నేర్చుకోవచ్చు. కెరియర్ కోసమే కాకుండా దీనిలో నేర్పు సాధిస్తే సొంతంగా వ్యాపారం చేయవచ్చు. సృజనాత్మక ఆలోచనలు, కొత్తగా ఆలోచించగల మనస్తత్వమున్నవారికి ఇది మంచి ఎంపిక.
నేర్చుకోవలసిన అంశాలు
* హెచ్‌టీఎంఎల్5, సీఎస్‌ఎస్3, జేక్వెరీ, జావా స్క్రిప్ట్
* బూట్‌స్ట్రాప్, రెస్పాన్సివ్, ఫొటోషాప్
* ఇలస్ట్రేటివ్, కోరెల్‌డ్రా, హెచ్‌టీఎంఎల్ స్లైసింగ్
ప్రారంభ వేతనం కనీసం రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఉంటుంది.
ఈ కోర్సులు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. చదువుకు ఇబ్బంది కలుగకుండా ఇంట్లో ఉండే కోర్సులను చేయాలనుకునేవారు కింది వెబ్‌సైట్లను అనుసరించొచ్చు.
https://in.udacity.com/course/intro-to-html-and-css–ud001-india
https://www.udemy.com/html-css-javascript/
https://www.coursera.org/learn/html-css-javascript-forweb-developers
నేరుగా తరగతులకు హాజరై నేర్చుకోవాలనుకుంటే ఎన్‌ఐఐటీ, ఆప్‌టెక్ లేదా ఇతర ప్రైవేటు సంస్థల్లో చేరొచ్చు. ఎన్‌ఐఈఎల్‌ఐటీ- తిరుపతి, సీ-డాక్- హైదరాబాద్ వంటి ప్రభుత్వ సంస్థలూ అందుబాటులో ఉన్నాయి.
వెబ్ డిజైనింగ్ కోర్సులు
Google ad
Google ad
Google ad
Google ad
Google ad