📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

సినిమాటోగ్రాఫర్ అవ్వడానికి టిప్స్

Google ad

మనం చలన చిత్రాలను చూస్తూనే ఉంటాం. అయితే ఈ చలన చిత్రాన్ని షూటింగ్ చేయడానికి ఒక సినిమాటోగ్రాఫర్ కావాలి సినిమాటోగ్రాఫర్ తీయకపోతే మనకి చిత్రం తెర మీద ఎలా కనబడుతుంది…? కాబట్టి సినిమాటోగ్రాఫర్ సినిమా తీయడం లో ముఖ్య పాత్ర పోషిస్తాడు అయితే సినిమాటోగ్రాఫర్ అంటే ఎవరు? అతను ఏ పని చేస్తాడు? సినిమాటోగ్రాఫర్ వల్ల లాభం ఏమిటి….? అలానే సినిమాటోగ్రాఫర్ రోల్ ఏమిటి…? వీటి కోసం వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా……? మరి ఆలస్యం చేయకండి ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.

సినిమాటోగ్రాఫర్ కెమెరా ఫిలిమ్స్ టాక్ కెమెరా లెన్స్ ఫిల్టర్స్ మొదలైన విభాగాల లో పని చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ చిత్రించే సీన్లు ప్రకారం ఇతను వీటిని చిత్రీకరిస్తూ ఉంటాడు. ఒక్క సారి డైరెక్టర్ చెప్పిన విధంగా కాకుండా సినిమాటోగ్రాఫర్ కి నచ్చిన విధంగా కూడా చిత్రీకరించడానికి డైరెక్టర్ ఒప్పుకుంటాడు. కొన్ని కొన్ని సార్లు డైరెక్టర్ చెప్పినట్లు మాత్రమే సినిమాటోగ్రాఫర్ తన పనిని చేయాలి. డైరెక్టర్ ఎలా చిత్రీకరించమని అంటున్నాడు ఆ విధంగా సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ ని ఫాలో అవ్వాలి.
కొన్ని కొన్ని సార్లు డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ కి ఛాన్స్ కూడా ఇస్తూ ఉంటాడు అప్పుడు తన స్వంత ఆలోచనల తో తాను డైరెక్షన్ చేయవచ్చు కానీ సినిమాటోగ్రాఫర్ రోల్ నిజంగా చాలా కష్టం అయితే చాలా చోట్ల మనం చూస్తున్నాము. ముఖ్యంగా అమెరికాలో సినిమాటోగ్రాఫర్ కూడా డైరెక్ట్ గా మారిపోయారు రీడ్ మొరానో వంటి వాళ్లు సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ కింద మారిపోయి డైరెక్టర్ గా అనేక సినిమాలు చేస్తూ పనిచేస్తున్నారు
సినిమాటోగ్రాఫర్ అవ్వాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి :
ముందు బేసిక్స్ అన్ని బాగా నేర్చుకోవాలి. మీరు ఎవరైనా వ్యక్తులు ఇన్స్పైర్ తీసుకుని ఆ విధంగా పని చేయడానికి ప్రయత్నం మీరు చేయండి ఫిలిమ్స్ సెట్స్ పై మీరు సమయం కేటాయించండి మీ నెట్వర్క్ నీ మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ విజువల్ స్టైల్ ని మీరే క్రియేట్ చేసుకోండి మీ జాబ్ కోసం మీరే వెతుక్కోండి. నీకంటూ సొంత గుర్తింపుని మీకు మీరుగా తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించండి
సినిమాలు టీవీ షో షూటింగ్ మ్యూజిక్ వీడియోస్ ఇలా ఏమైనా సరే మీరు చేయడానికి ప్రయత్నం చేయండి లైటింగ్ బ్యాక్గ్రౌండ్ వంటి వాటి పై దృష్టి పెట్టండి మీ కంటూ మీ కొత్త స్టైల్ ని రూపొందించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఈ టిప్స్ ని ఫాలో అవుతూ మీరు నెమ్మదిగా నేర్చుకునే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పెద్ద సినిమాటోగ్రాఫర్ మీకు కూడా సొంత గుర్తింపు లభిస్తుంది
సినిమాటోగ్రాఫర్ అవ్వాలంటే కచ్చితంగా బ్యాచ్ లర్ డిగ్రీ ఉండాలి అప్పుడు మీరు టెక్నికల్ స్కూల్ కానీ లైవ్ మినిట్స్ ప్రోగ్రామ్స్ కానీ వెళ్ళవచ్చు దీనికి తోడు మీకు నైపుణ్యం కలిగి ఉండాలి ఆర్టిస్ట్గా చిత్రీకరించడానికి కెమెరా డిజిటల్ వైపు అవగాహన ఉండాలి ఈ విధంగా మీకు ఈ క్వాలిఫికేషన్స్ గనుక ఉంటే కచ్చితంగా మీరు సినిమాటోగ్రాఫర్ అవ్వడానికి అర్హులు.కాబట్టి మీ నైపుణ్యం తో మీరు ముందుకు వెళ్లిపోండి.

Google ad
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading