
ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన పర్యాటక దేశాలలో టర్కీ కూడా ఒకటి. టర్కీని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ అని పిలుస్తారు. టర్కీ ఆసియా, ఐరోపా రెండు ఖండాలలోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా మరియు రుమేలియా (బాల్కన్ ప్రాంతం) లోనూ వ్యాపించి యున్నది. టర్కీకి 8 పొరుగుదేశాల సరిహద్దులు ఉన్నాయి. టర్కీ పెద్ద ద్వీపకల్ప దేశం. మూడుపక్కలా నల్ల సముద్రం, మెడిటేరియన్ సముద్రం మరియు ఏజియన్ సముద్రం చే ఆవరించబడి ఉంది. ఒక పక్క భూభాగం.
టర్కీ రాజధాని నగరం అంకారా. ఇస్తాంబుల్ టర్కీలోని పెద్ద నగరం. ఈ నగరం కూడా రెండు ఖండాల్లో విస్తరించిన నగరం. వీరి భాష టర్కిష్, లీరాలు వీరి ద్రవ్యం. టర్కీ ముస్లిం దేశం. ముస్లిం దేశం అయినప్పటి అభివృద్ధి చెందిన పర్యాటక దేశంగా పేరుపొందింది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు చారిత్రక ప్రాధాన్యం గల దేశం టర్కీ.
అందమైన సముద్రతీరాలు, అద్భుతమైన కట్టడాలతో, సాంస్కృతిక ఉత్సవాలతో టర్కీ పర్యాటకులకు కనువిందు చేస్తుంది.
టర్కీ ప్రజలు సహృదయులు. వీరు పర్యాటకులను తమ ఇంటికి ఆహ్వనించి భోజనం పెట్టి పంపిస్తారు.
మంచు మేనిముసుగు ధరించిన ప్రకృతి కాంత శీతాకాలపు సోయగం ‘పముక్కలే’. మంచుతో కప్పబడిన పర్వతాలు.. కనువిందుచేసే సెలయేటి ఒంపులు ఇక్కడి ప్రత్యేకతలు.
టర్కీ భాషలో పముక్కలే అంటే ‘కాటన్ క్యాజల్’ అని అర్థం. పట్టులా కనిపించే తెల్లని మంచు వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.
క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచే పముక్కలే పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి పొందింది. పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశాల్లో టర్కీ కూడా ఒకటి. చారిత్రక ప్రాధాన్యం, మధ్యయుగపు వైభవం, ఆధునిక నిర్మాణాలు, ప్రకృతి సోయగాలతో కూడిన దేశం టర్కీ.
అపెండస్ థియేటర్, బండ్రమ్ క్యాజల్, లైబ్రరీ ఆఫ్ సెల్సస్లు టర్కీ దేశంలో గల చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిర్మాణాలు.
మెట్లు మెట్లుగా ఉన్న లైమ్ స్టోన్ కొండ చరియలను మంచు కప్పి ఉంటుంది. అందులో ఉండే నీరు స్పష్టంగా, స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది..
రాజధాని నగరం ఇస్తాంబుల్ అభివృద్ధి చెందిన మానవ నాగరికతకు అద్దం పడుతుంది. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్యం లేని నగరాలు, ప్రకృతి సోయగాలు, అద్భుత నిర్మాణాలు టర్కీలోని ప్రధాన ఆకర్షణలు. సౌకర్యాల పరంగా ఇస్తాంబుల్ ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఒకటి. పతారా బీచ్, పముక్కలే వంటివి టర్కీలో సందర్శించ దగ్గవి. పముక్కలే గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం మరియు సహజంగా ఏర్పడిన ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేస్తుంది.
పముక్కలే మంచు కొండల మధ్యన కొన్ని చిన్న చిన్న నీటి చెలమలు ఉంటాయి. స్థానిక వాతావరణానికి అనుగుణంగా ఈ నీటి ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. వేసవి కాలంలో చుట్టూ మంచు ఉన్నప్పటికీ, ఆ మంచు కరగదు. ఈ చెలమల్లోని నీరు వెచ్చగా ఉంటుంది. ఆ సమయంలో ఈ నీటిలో స్నానం చేస్తే రక్తపోటు, నేత్ర, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ఇక్కడి స్థానికుల నమ్మకం.
ఇందులో స్నానం చేయడం మంచిదని యూరోపియన్లు కొన్ని శతాబ్దాలుగా నమ్ముతున్నారు. ఈ నమ్మకం కూడా పముక్కలేకు పర్యాటకులు ఎక్కువగా రావటానికి ఒక కారణం. ఒకవైపు ప్రకృతి సౌందర్యం, మరోవైపు చెలమలలో స్నానం ఇవి పముక్కలేకు మాత్రమే సొంతం.
ఇక్కడ క్లియోపాత్ర అనే ఇంకొక కొలను ఉంటుంది. అందులో నీరు స్వచ్ఛతకు మారుపేరు. ఎంతమంది స్నానాలు చేసినా ఆ నీరు కలుషితం కాకుండా స్వచ్ఛంగా అలాగే ఉంటుంది. నీటి లోపల ఉన్న వారు కూడా స్పష్టంగా కనిపిస్తారు.
ఈ ప్రాంతానికి గ్రీకు, రోమన్ పురాణాలలో స్థానం ఉంది. వీరి గ్రంథాల్లో ఇదొక పవిత్ర నగరంగా స్థానం పొందింది. ఇప్పటికీ ప్రజల్లో ఈ నమ్మకం కొనసాగుతోంది. రోమ్ మైథాలజీలో స్పా సిటీగా దీని ప్రస్తావన ఉందంటారు. పురాతన రోమన్లు నిర్మించిన పవిత్ర ‘హైరపొలిస్’ అనే పూల్ ని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇందులోని నీరు పవిత్రమైనదిగా ఇక్కడి ప్రజలు భావిస్తారు.
టర్కీలో ఒక చిన్న టౌన్ పముక్కలే. హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీస్ షాపులు అందుబాటులో ఉంటాయి. వసతి సౌకర్యాలు కూడా కొదవలేదు.
ఎప్పుడైనా పముక్కలేని సందర్శించవచ్చు. కానీ శీతాకాలంలో మాత్రం పముక్కలే అందం చూడవలసిందే. డెనిజిల్ సిటీ నుంచి పముక్కలేకు బస్సు ద్వారా చేరుకోవచ్చు. పురాతన సమాధి నిర్మాణాలు, మ్యూజియం ప్రధాన ఆకర్షణలు.
భారతదేశంలోని టైమ్ కంటే రెండు గంటల పాటు వెనుక ఉంటుంది. పముక్కలేలో వేసవి కాలం ఉదయం ఐదున్నరకే ప్రారంభమవుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు సూర్యాస్తమయం. శీతాకాలంలో మాత్రం పగటి సమయం తక్కువగా ఉంటుంది.
సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో కాంతి పరావర్తనంతో మంచు విభిన్న రంగుల్లో మెరుస్తూ ఆకర్షిస్తుంది.
పముక్కలేని 1988 సంవత్సరంలో ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా ప్రకటించబడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సంరక్షించడం మొదలుపెట్టారు.
పముక్కలేకు వెళ్లాలంటే టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంకు వెళ్లవలసి ఉంటుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన దేశాల్లోని విమానాశ్రయాల నుండి ఇస్తాంబుల్ విమాన ప్రయాణ సౌకర్యం ఉంది. ఇస్తాంబుల్ నుంచి డెనిజిల్ ఎయిర్పోర్ట్కు వెళ్లాలి. అక్కడనుండి పముక్కలేకు కారు ప్రయాణం 45 నిమిషాలు పడుతుంది.
ఇస్తాంబుల్ నుంచే పముక్కలేకు నేరుగా బస్సు లేక కారులోనూ వెళ్లవచ్చు. ప్రయాణంలో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
ఇంకా టర్కీలోని పర్యాటక ప్రాంతాలు
Blue Fag Marinas, Akirgel, Waterfals,Kackar Mountains (ఈ పర్యతాలను హెలికాప్టర్ లో వీక్షించే సౌకర్యం కలదు).
టర్కీలో పర్యాటక పరంగా పేరు పొందిన దీవులు:
Akdamai Islands, Gokceada Islands, Bozcada Islands, Princes Islands, Cumda Islands, Marmar Islands, Foca Islands.
Yatch Marinas (తెరచాపలతో గల చిన్న చిన్న పడవలు), వీటిలో విహారం ఓ ప్రత్యేకం అని చెప్పవచ్చు. ప్రాంతీయ మరియు విదేశీయుల తెరచాప పడవలు ఇక్కడ ఉంటాయి.
టర్కీలోని ప్రసిద్ధి చెందిన సముద్రతీరాలు :
Antalya, Alanya, Kermer, Belek, (ఇవి మెడిటేరియన్ ప్రాంతంలో ఉన్న సముద్రతీరాలు)
Bodrum, Marmaris, Fethiye, Kusadasi, Didim ఈ సముద్రతీరాలు South Aegean Coast ప్రాంతంలో పేరుపొందినవి.
టర్కీ లో క్రూయజర్ లలో విహరిస్తూ ఆనందించవచ్చు. Kusadasi, Istambul, Izmir, Bodrum, Marmaris, Antalya తీరాలలో క్రూయజర్ లలో విహరించవచ్చు.
Raju's Resource Hub