📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Water Sports, Goa

Google ad

వాటర్ స్పోర్ట్స్-పారా సైలింగ్, వాటర్ బైక్, బనానా బోట్, క్యాసినోలు ప్యారా సైక్లింగ్ :
ఓ పడవ మీద సముద్రంలోకి తీసుకు వెళ్ళి అక్కడ మరో పడవ ఎక్కిస్తారు. అక్కడ నుండి ప్యారాచూట్ లో ఎక్కించి గాల్లోకి వదిలి వేస్తారు. పైకి వెళ్ళాక ఆ అనుభూతి వేరు.
వాటర్ బైక్ :
నీళ్ళ మీద నడిచే బైక్ ఇది. వేగంగా అలలను చీల్చుకుంటూ ముందుకు వెళుతుంది ఈ బైక్.
బనానా :
గాలితో నిండిన అరటిపండు ఆకారంలో ఉన్న ఓ పడవ మీద సముద్రంలోకి తీసుకు వెళ్ళి అక్కడ వదులుతారు. లైఫ్ జాకెట్లు ఉంటాయి కాబట్టి ప్రమాదం ఉండదు.
ప్యారా గైడింగ్ :
ఓ కొండ మీద నుండి మరో కొండ మీదకు ప్యారాచూట్ ద్వారా పంపిస్తారు.

క్యాసినోలు :
గోవాలోని క్యాసినోలు బాగా ఫేమస్. నీటి మధ్యలో పెద్ద పెద్ద క్రూయిజ్ లైనర్ల లో క్యాసినో లు నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న తరువాత పడవలలో తీసుకు వెళ్ళి క్రూయిజ్ లలో దింపుతారు. ఈ క్రూయిజ్ లలో రెస్టారెంట్లు, గేమ్స్, దుకాణాలు అన్నీ ఉంటాయి. నైట్ రివర్ క్రూయజర్ మీద మండోవి నదిలో వెన్నుల విహారం ఓ అద్భుతమైన అనుభూతి. షిప్ డెక్ మీద డ్యాన్సులు, గానా బజానాలు, పెద్దలు, పిల్లలు, జంటలు అందరూ కలిసి నందడిగా గడుపుతుంటారు. సముద్రం ప్రక్కన కొండపై నిర్మించిన చపోరా కోట చూడదగ్గది.

Google ad
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading