Logo Raju's Resource Hub

ఆలోచనల లోను పని లోను భక్తి అనేది ఒక ప్రేరణ శక్తి గా ఉంటుంది

Google ad

సహజ మార్గ విధానం లో భక్తి భావం నిరంతర స్మరణ ద్వారా కలుగుతుంది. నిరంతర స్మరణ వలన ప్రాణాహుతి ప్రసారం జరిగి ఎప్పుడూ ధ్యాన స్థితి లో నే ఉండటం జరుగుతుంది. దీని వలన నిర్మిలీకరణ జరిగి సంస్కారాలు తొలగింపబడతాయి. అభ్యాసి అతి తక్కువ సమయంలో నే దివ్వియి కరణ చెంది  ఆధ్యాత్మిక యాత్రను మొదలు పెట్టడానికి అవకాశం కలుగుతుంది. గురుదేవుల మీద భక్తి అభ్యాసిని పురోగతి కి చేరుస్తుంది.

            బాబూజీ గారు లాలాజీ గారి మీద భక్తి భావం ఎంత గొప్పది అంటే తాను త్రాగే నీరు కూడా గురువు అనుమతి తో జరుగుతుందని చదివాను. తండ్రి ఎంత నిర్బంధించిన పట్టువదలని విక్రమార్కుడి లా బాబూజీ స్పెషల్ పర్సనాలిటీ అయ్యారు.

            మన పురాణాలలో చిన్న చిన్న కథలు చదువుతాము. భక్త ప్రహ్లాద, మార్కండేయుడు, ధ్రువుడు మొదలైన వారు చాల చిన్నవయసు లోనే భగవంతుని మీద భక్తి భావాన్ని పెంచుకొని, ఎన్నో కష్ఠాలను ఎదుర్కొని చిరస్థాయి గా నిలిచారు. మీరా భాయి, సక్కు భాయి మొదలైన స్త్రీ మూర్తుల కథలు మనము వినే ఉంటాము. వీళ్ళందరూ దేవుని పొందడానికి పడరాని కష్టాలు అన్నీ పడ్డారు. వీళ్ళందరూ చిరస్మరణీయులు.

            సహజ మార్గ విధానం లో అభ్యాసి కి జారుడు జరుగుతూ ఉంటుంది.  వైకుంఠపాళీ ఆటలా. అభ్యాసి ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా అలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి.

Google ad

            ఒక సారి నేను సిట్టింగ్ కోసం ప్రక్కన ఉన్న ఉరికి బస్సు లో వెళుతున్నాను. సగం దూరం వెళ్ళాక బస్సు ఆక్సిడెంట్ జరిగింది. బస్సులో ఉన్న వారికి దెబ్బలు తగిలి రక్తం వస్తుంది. బస్సు డ్రైవర్ బస్సు ఆపి అందరినీ దించి, వేరే బస్సులలో వెళ్ళమని మీ ఇంటికి గాని. లేకపోతే చేరవలసిన ఉరికి గాని మీరే నిర్ణయించుకోండి అని చెప్పాడు. నేను నా దగ్గర ఉన్న మంచి నీటి బాటిల్ నీటి తో రక్తం  కడిగి జేబురు మాలు తో ముక్కు దగ్గర పెట్టుకొని, నేను సిట్టింగ్ తీసుకోవడానికే నిర్ణయించుకొని అక్కడికి వెళ్లి సిట్టింగ్ తీసుకున్నాను. నాకు తర్వాత అర్థం అయ్యింది. ఇది నాకు పెట్టిన పరీక్ష అని. భక్తి భావం వల్లనే ఆ రోజు నేను ఆ నిర్ణయాన్ని తీసుకొన్నాను.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading