Logo Raju's Resource Hub

వేమన, వేమన శతకం

Google ad
వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1650 – 1750 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి.
వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వాడు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవాడని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని అంటున్నారు. ఇతని జన్మస్థలం పేరు “మూగచింతపల్లె” కావచ్చును. ఇతను యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించాడు. కొంతకాలానికి విరక్తిచెంది, తపస్సు చేసి యోగిగా మారాడు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పాడు. చివరికి కడప దగ్గరి పామూరుకొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామ నవమి నాడు సమాధి చెందాడు.
వేమన సమాధి అని ఇప్పటికీ ప్రసిద్ధమైనది కదిరి తాలూకాలోని కటారుపల్లె. ఇక్కడ వేమన సమాధి ఉంది. వేమన రసవాది అని స్వర్ణవిద్య కోసం గురువులకై వెతికాడని ఐతిహ్యం ఉంది.
వేమన పద్యాలలో అతని జీవితానికి సంబంధించిన క్రింది పద్యాలు ముఖ్యంగా ఉదాహరిస్తారు.
నందన సంవత్సరమున; పొందుగ కార్తీకమందు బున్నమినాడీ
వింధ్యాద్రి సేతువులకును, నందున నొక వీరు డేరుపడెరా వేమా!
ఊరుకొండవీడు వునికి పశ్చిమవీధి; మూగచింతపల్లె మొదటి యిల్లు
ఎడ్డిరెడ్డికులము యేమని చెప్పుదు; విశ్వదాభిరామ వినురవేమ
వేమన జీవితం గురించి (పెద్దగా పరిశోధన జరుగక ముందు) ఈ క్రింది కధ ప్రచారంలో ఉంది. (నేదునూరి గంగాధరం సంకలం చేసిన “5000 వేమన పద్యాలు” పుస్తకం ఆరంభంలో ఇచ్చిన కధ).

కొండవీడు పాలించిన కుమారగిరి వేమారెడ్డి కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు భిల్లకన్యను వివాహమాడి అడవిలోని పరుసవేది జలాన్ని సంగ్రహించాడు. ఒక కోమటి మిత్రుడు ఆ బ్రాహ్మణునినుండి పరుసవేదిని కుయుక్తితో తీసుకొని ఆ బ్రాహ్మణుని మరణానికి కారకుడయ్యాడు. ఇది తెలిసి రాజు కుమారగిరి వేమారెడ్డి కోమటి సంపదను స్వాధీనం చేసుకొన్నాడు. కోమటి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ హత్యాపాతకం పోవడానికి కోమటి వేమారెడ్డి పలు ధర్మకార్యాలు చేయడమే కాకుండా తన పిల్లలకు ఆ బ్రాహ్మడి పేరూ, కోమటి పేరూ పెట్టాడు. అలా అతని కొడుకులు పెదకోమటి వెంకారెడ్డి, రాచవేమారెడ్డి, వేమారెడ్డి. ఈ మూడవ కొడుకే వేమన కవి అయ్యాడు.

యవ్వనంలో వేమన వేశ్యాలోలుడై తిరిగేవాడు. బంధువులు అతన్ని అసహ్యించుకొనేవారు కాని వదిన మాత్రం చిన్నపిల్లవాడిని వలె ఆభిమానించేది. ఒక వేశ్య అతనిని వలలో వేసుకొని, అన్ని నగలు సాధించుకొని, తుదకు అతని వదినగారి ముక్కు బులాకీ తెమ్మని అడిగింది. మంగళసూత్రం వలె ముత్తయిదు చిహ్నమైన బులాకీ ఇవ్వడానికి ముందు వదిన పెట్టిన నియమం వల్ల వేమన తాను తుచ్ఛమైన శారీరిక సౌఖ్యాలకోసం వెంపర్లాడుతున్నానని గ్రహించాడు. జ్ఞానాన్ని ప్రసాదించిన వదినకు ప్రణమిల్లాడు. తరువాత వ్యవసాయం చేయసాగాడు. ఎవరికీ పనికిమాలిన వెర్రిపుచ్చకాయలు సాగుచేసి కూలిగా ఆ పుచ్చకాయలే ఇస్తానన్నాడు. అతిపేదరికంతో బాధపడుతున్న ఒక కుటుంబం అలా పుచ్చకాయలు తీసికెళ్ళి వాటిని తెరచి చూస్తే అందులో మణులున్నాయట. తరువాత ఆ సంపదతో వేమన అన్న భాగ్యవంతుడయ్యాడు.వేమన వదిన నగలను అభిరాముడనే సువర్ణకారుడు చేసేవాడు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి ఆతని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అయితే చివరి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, ఆ యోగి అవసాన సమయంలో తాను వెళ్ళి బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకొన్నాడు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకొన్నాడు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పాడు. ఆ తరువాత వేమన దేశమంతటా తిరిగి మఠాలు కట్టించాడు. తత్వాన్ని బోధించాడు. అందరి యెదుటా యోగి సంప్రదాయంలో మహాసమాధి చెందాడు.

Vemana Satakamu - వేమన శతకము by Vemana - Vemana Satakamu

                      Read Here
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading