Logo Raju's Resource Hub

సహజమైన మరియు ఆయుర్వేద పద్ధతుల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచడం

Google ad
నిమ్మ జాతి పండ్లు :
నిమ్మ , బత్తాయి , సంత్ర , దూది నిమ్మ , ఉసిరికాయలు
ఈ పండ్లలో విటమిన్ సి ఉంటుంది , విటమిన్ సి తెల్ల రక్త కణాలను ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది ,ఈ తెల్ల రక్త కణాలు వ్యాధులు రాకుండా ఇన్ఫెక్షన్స్ సోకకుండా కాపాడుతాయి.
అందుకే ప్రతి రోజు మన శరీరానికి మహిళలకు 75 మిల్లి గ్రాములు , పురుషులకి 90 మిల్లి గ్రాముల విటమిన్ సి అవసరం .
తప్పకుండ విటమిన్ సి ఆహారం లో ఉండేటట్టు చూసుకోండి
పసుపు
పసుపు లో ఉండే కుర్కుమిన్ అనే పదార్థం మన కు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది .
మన భారతీయ వంటకాలలో పసుపును వాడటం అనేది అందరికి అలవాటే .
పసుపును వేడి పాలలో వేసుకుని తాగడం ఎంతో మేలు చేస్తుంది దీన్ని బంగారు పాలు అని కూడా అంటారు.
అల్లం
అల్లాన్ని మనం ప్రతిరోజూ వంటలలో , టీ లో వేసుకుంటాం ఇది మనకు ఉన్న ఒక గొప్ప అలవాటు.
అల్లం జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది , నొప్పులను వాపులను తగ్గిస్తుంది , చెడు క్రొవ్వులను లేకుండా చేస్తుంది , రక్తాన్ని శుభ్రపరుస్తుంది , దగ్గు జలుబు రాకుండా కాపాడుతుంది .
శ్వాశ ప్రక్రియను మెరుగుపరుస్తుంది
అల్లం ను పొడి లాగా కూడా వాడుకోవచ్చు మనం దీన్నే శొంఠి పొడి అంటాము
శొంఠి అన్ని పచారీ షాపులలో దొరుకుతుంది
బాదాం :
బాదాం లో విటమిన్ ఈ , విటమిన్ ఏ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి .
యాంటీఆక్సిడెంట్స్ మన కణాలు దెబ్బ తినకుండా కాపాడుతాయి.
రోజు కనీసం 4 బాదాం పలుకులు అయినా తినాలి
క్యారెట్ , టొమాటోలు లలో కూడా యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి .
గ్రీన్ టీ:
గ్రీన్ టీ లో ఆమినో ఆసిడ్స్ మరియు ఎల్ థయామిన్ ఉంటాయి .
ఎల్ థయామిన్ రక్తపోటు ను నియంత్రిస్తుంది .
గ్రీన్ టీ హృదయపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
దీంట్లో ఇంకా విటమిన్ ఈ, సి ,బి 2 మరియు ఫోలిక్ ఆసిడ్ ఉంటాయి.
కావున ఎన్నో వ్యాధులు రాకుండా చూస్తుంది.
వెల్లుల్లి :
దీంట్లో బాక్టీరియా మరియు వైరస్ లను పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది.
వెల్లుల్లి అద్భుతమయిన సహజమైన ఔషధం .
రక్త నాళాలు గట్టి పడటాన్ని ఆడుకుంటుంది మరియు రక్తాన్ని పలుచన చేస్తుంది
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading