Google ad
టెడ్ (TED) అనగా టెక్నోలజీ, ఎంటర్ టైన్మెంట్, డిజైన్ అనమాట. దీనికి కాప్షను ideas worth spreading. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఆ పైన చెప్పిన రంగాలలో స్పీకర్లు వాళ్ళ ఆలోచనలను పంచుకోవచ్చు అనమాట. ఇది 1984 లో ఒక కాన్ఫరెన్స్ రూపంలో మొదలైంది. ఇక్కడ స్పీకరుకు 18 నిమిషాలలో తన చెప్పాలనుకున్న విషయాన్ని/ తన వినూత్న ఆలోచనల గురించి మాట్లాడచ్చు. అందరిలో ఎవరి ఐడియా అయితే బాగుంటుందో వారికి 1 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ కాన్ఫరెన్స్ లో మనం కూడా ప్రేక్షకుడిగా పాల్గొనాలంటే అక్షరాలా 8500 డాలర్లు చెల్లించవలసి వుంటుందట. ఇది సంవత్సరానికి ఒక సారి వాంకోవర్, బ్రిటీష్ కొలంబియా, కెనడాలో జరుగుతుంది. 2006 వ సంవత్సరం నుండీ ఆ వీడియోలను అందరికీ అందుబాటులో టెడ్.కామ్ లో చేర్చారు. ఇప్పుడు ఎవరైనా వాటిని ఉచ్చితంగా ఆ వెబ్సైటులో చూడచ్చు. దీనికి ప్రస్తుత ఓనరు క్రిస్ ఏండర్సన్.


మీరందరు “ఇదేంటీ మనం యూట్యూబ్ లో చూసిన వీడియోలలో ఇలా ఏమీ లేదే, 18 నిమిషాలు టైమ్ లిమిట్ అసలు లేదు, ఇంకా వచ్చిన వారంతా వాళ్ళ జీవితం గురించి వాళ్ళు సాధించనవి కదా చెప్పేది ” అని అనుకుంటున్నారు కదూ. అవును అదే టెడ్ ఎక్స్.
అంటే రెండూ వేరువేరా? మరి టెడ్ ఎక్స్ ఏంటీ?
వేరు వేరా అంటే అవును , అది కేవలం దాన్ని నిర్వాహకులు వేరు . “ఎక్స్” అంటే ఇండిపెండెంట్లీ ఆర్గనైజుడ్ టెడ్ ఈవెంటు. అర్థమయ్యేలా చెబుతాను. టెడ్ కు ప్రపంచంలో చాలా ఆదరణ లభించింది, చాలా మంది దీనిలో ఆసక్తి చూపించారు , వాళ్ళ దేశంలో /వాళ్ళ ప్రాంతంలో దీన్ని నిర్వైహించాలనుకున్నారు. అదే టెడ్ ఎక్స్. టెడ్ వారి దగ్గర కొంత డబ్బు చెల్లించి వారి దగ్గర నుండి లైసెన్సు తీసుకోవాలి. దానితో పాటు దానికి కొన్ని రూల్సు, పోలసీలు వుంటాయి , అవి పాటించాలి ఎలాంటివి అంటే పాలిటిక్స్ , మతం ఇలాంటి వాటి గురించి మాట్లాడకూడదూ అని, ఇంకా దీనితో డబ్బు సంపాదన చేయకూడదు మొదలైనవి. ఆ లైసెన్సు కేవలం ఒక ఈవెంటుకు మాత్రమే అది కూడా కొనుక్కున ఒక సంవత్సరం లోపే అనుమతి , ఆ తర్వాత మళ్ళీ కొత్తగా కొనుక్కోవాలి. ఇంకా ఒక టెడ్ ఎక్స్ వేదికపై మాట్లాడిన అదే వ్యక్తిని ఆ సంవత్సరంలో మళ్ళీ వేరే టెడ్ ఎక్స్ వేదిక పై పిలవకూడదట (దీని పై పూర్తిగా అవగాహన లేదు నాకు) . ఇలా నిర్వహించబడేదే టెడ్ ఎక్స్, ఇప్పుడు చాలా కళాశాలలో నిర్వహింపబడుతున్నది.
1. How “she” became an IAS officer => TEDx talk by Surabhi Gautam
2. A story of struggle & grit => TEDx talk by Naveen Polishetty
Google ad
Raju's Resource Hub