Logo Raju's Resource Hub

సంతృప్తికరమైన జీవితం vs విజయవంతమైన జీవితం

Google ad

అత్యంత జనసాంద్రత కలిగిన దేశంలో పుట్టి ఏ ఇబ్బందిలేకుండా బ్రతకటమే పెద్ద పోరాటం. మన దేశంలో ఉదయాన్నే లేచి పాల ప్యాకెట్ కోసం కూడా క్యూలో నిల్చోవాలి. పోనీ పరిస్థితులు మారి అంతా ఫోన్‌లోనే అయిపోతుంది అనుకున్నా, సంక్రాంతికి ఇంటికి వెళ్ళటానికి ట్రైన్ టికెట్ నుండి తిరుమల దర్శనం టికెట్ వరకూ అన్నీ నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ దొరకని పరిస్థితి. అలాంటిది జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం దొరకటం ఎంత కష్టమో చెప్పేపని లేదు.

అవకాశాలు, అదృష్టాలు సంగతి పక్కన పెట్టినా, జీవితంలో మనం తీసుకునే డెసిషన్స్ మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. మనం బ్రతికున్నంత కాలం నిరంతరం డెసిషన్స్ తీసుకుంటూనే ఉండాలి. ఉదయాన్నే ఎన్నింటికి లేవాలి, ఏం వర్క్ అవుట్ చెయ్యాలి, ఏం బ్రేక్‌ఫాస్ట్ తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి తో మొదలు పెట్టి కెరీర్ డెసిషన్స్, రిలేషన్‌షిప్ డెసిషన్స్, ఫైనాన్షియల్ డెసిషన్స్.

These decissions make our life.

కానీ దురదృష్టం ఏంటంటే ఆ నిర్ణయాలు తీసుకోవటంలో మనకి పూర్తి స్వేచ్ఛ ఉండదు. మన మీద ఆధారపడిన లేదా ఆశలు పెట్టుకున్న కుటుంబం, తేడా కొడితే ఏమయిపోతామో అన్న స్వంత భయాలు మనల్ని లిమిట్ చేసేస్తాయి. పీర్ ప్రెషర్ – పక్కవాడు బానే ఉన్నాడు అలానే ఉంటే పోతుందేమో, ఇప్పుడు కొత్తగా ఏదో చెయ్యటం ఎందుకూ, నలుగురూ వెళ్ళే దారి మనది కాని దారైనా అదే సేఫ్ అనే ఆలోచనలు మనల్ని దారి మళ్ళిస్తాయి.

Google ad

ఒకసారి రోడ్డు మారాక డెస్టినేషన్ కూడా మారిపోతుంది. లేదా అదే డెస్టినేషన్‌కి చేరినా కాలాతీతమయిపోతుంది. ఒక డెసిషన్ తీసుకునేప్పుడు భవిష్యత్తు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి, ఈ పరిస్థితిని మనం తప్పించుకోలేం.

తీసుకున్న ప్రతి నిర్ణయం కలిసొచ్చినవాడిని విజేతగా చెప్పుకుంటాం. విజేతల కథలే సెలిబ్రేట్ చేసుకుంటాం.

Talent or harwork alone doesn’t make us successful. You have to be at the right place at the right time.

విజేత కాలేకపోయిన వాడి కథలు కూడా జనాలు తెలుసుకోవాలి. వాటిని కూడా సెలెబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి జీవితాలు కాబట్టి. మనలాంటి మనుషుల జీవితాలు కాబట్టి.

జీవితం programmed గా నడవదు. unpredictable గానే ఉంటుంది. కాబట్టి మనం విజేతలుగానే బ్రతకాలి అనే ఒత్తిడి పెంచుకోవటం అనవసరం. ఏ regret లేకుండా బ్రతకటం నేర్చుకోవాలి. నిజానికి అపజయాలు కాదు మనల్ని బాధపెట్టేవి. అసంతృప్తి, విచారం మన జీవితాల్ని దుఃఖమయం చేస్తాయి. ఫిలసాఫికల్‌గా అనిపించినా మనం నేర్చుకోవాల్సిన నిజం “ఫలితాన్ని కాదు ప్రయత్నాన్ని, ప్రయాణాన్ని ప్రేమించాలి, ఆస్వాదించాలి”.

కానీ మన జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించటం మన చేతిలోనే ఉంటుంది. Regrets ని పక్కన పెట్టి జీవితాన్ని ఆస్వాదించటానికి ప్రయత్నిద్దాం.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading