|
పదోతరగతి పూర్తయ్యాక.. ఎటువైపు అడుగు వేయాలని ఆలోచించే విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి మార్గం.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు! మూడు మూడున్నరేళ్లకే ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసే అవకాశం ఉండటం పాలిటెక్నిక్ కోర్సుల ప్రత్యేకత. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆర్థిక స్తోమతకు అనుగుణమైన ఫీజులతో తక్కువ వ్యవధిలోనే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. అంతేకాదు చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు.
పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్యకూ అవకాశం ఉన్నా, మూడేళ్లకల్లా ఉపాధి సాధించాలనుకునేవారు ఎక్కువగా పాలిటెక్నిక్ డిప్లొమాపైనే ఆధారపడతారు. పాలిటెక్నిక్‌లో ఏయే బ్రాంచ్‌లు ఉంటాయి? ఏ బ్రాంచ్‌లో చేరితే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేదా ఉన్నత విద్యావకాశాలుంటాయో చూద్దామా . పదోతరగతి పూర్తయ్యాక మూడేళ్లకే ఇంజినీరింగ్ డిప్లొమా పొందాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులు అత్యంత అనువైనవి. డబ్బు, సమయం వృథా కాకుండా సాంకేతిక విద్యార్హత సాధించడానికి ఉపకరిస్తాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తోంది పాలిటెక్నిక్. పదోతరగతి పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీ అందుకోవాలంటే రెండేళ్లు ఇంటర్మీడియట్, నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదవాలి. ఆర్థికంగా స్థోమత లేనివాళ్లు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పదోతరగతి తర్వాత మూడేళ్లకే సాంకేతిక విద్యలో డిప్లొమా పొందడానికి పాలిటెక్నిక్ వైపు మొగ్గు చూపుతారు. మరోవైపు పారిశ్రామిక రంగం ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన విద్యార్థులతో దీటుగా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్థులకూ ప్రాధాన్యం ఉంటుంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్లేస్‌మెంట్ అవకాశాలు పెరుగుతున్నాయి. గ్రామీణ, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు చక్కటి అవగాహనతో పని చేయడం, ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి రావడం లాంటి కారణాలతో పారిశ్రామిక రంగం పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు పెంచింది. సివిల్, మెకానికల్ లాంటి ప్రాథమిక తరహా కోర్సులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చేసిన వారితో పోలిస్తే, పాలిటెక్నిక్ చేసిన వారికి ఉపాధి అవకాశాలూ ఎక్కువే. |
|
చిన్న వయసులోనే సాంకేతిక విద్యను పూర్తిచేసుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చక్కటి మార్గం. సాంకేతిక విద్యపై ఆసక్తి ఉండి, కెరీర్ పరంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఉత్తమమైన మార్గం పాలిటెక్నిక్. వాస్తవానికి ఇంజనీరింగ్ డిగ్రీ(బీఈ/బీటెక్) అందుకోవాలంటే.. పదో తరగతి తర్వాత రెండేళ్ల ఇంటర్మీడియట్, అనంతరం నాలుగేళ్ల ఇంజనీరింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. కానీ పాలిటెక్నిక్తో మూడేళ్లకే ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసుకోవచ్చు. మరోవైపు ప్రాక్టికల్ నాలెడ్జ్ దృష్ట్యా సంస్థలు డిప్లొమా విద్యార్థులకు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ప్రవేశం ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాల నుకునే విద్యార్థులు ఆయా‡రాష్ట్ర ప్రభుత్వం నిర్వ హించే పాలీసెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. పాలీసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. ప్రవేశాలు కల్పిస్తారు. మూడేళ్ల కోర్సులు
సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ), ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్. మూడేన్నరేళ్ల కోర్సులు
మెటలర్జికల్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్, కెమికల్(ఆయిల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), సిరామిక్, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ. స్పెషల్ డిప్లొమా కోర్సులు
స్పెషల్ డిప్లొమా కోర్సులు ఎలక్ట్రానిక్ స్పెషౖలñ జేషన్కు సంబంధించినవి. వీటిలో ముఖ్యంగా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజ నీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ వీడియో ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు
ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్. రాష్ట్రవ్యాప్తంగా 248 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 70620 సీట్లున్నాయి. వీటికోసం ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది పోటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉన్నత విద్య
డిప్లొమా పూర్తిచేసిన తర్వాత విద్యార్థుల ముందు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి,ఉద్యోగంలో చేరడం, కాగా రెండోది ఉన్నత విద్య(బీటెక్). విద్యార్థులు తమ ఆసక్తి, ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ఉద్యోగం లేదా ఉన్నత విద్యలో ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్(ఈసెట్–ఎఫ్డీహెచ్) ద్వారా బీటెక్/ బీఈలో చేరే అవకాశం లభిస్తుంది. లేటరల్ ఎంట్రీ వి«ధానంలో డైరెక్ట్గా ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందవచ్చు. నైపుణ్యాలు ఎక్కువ
పదో తరగతి తర్వాత ఇంటర్ పూర్తి చేసి.. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల కంటే.. ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులయ్యే వారికి ప్రాక్టికల్ నైపుణ్యాలు ఎక్కువగా లభిస్తాయనే అభిప్రాయం ఉంది. కారణం.. డిప్లొమా స్థాయిలో ప్రాక్టికల్కు అధిక ప్రాధాన్యం ఉండటమే. డిప్లొమా చేసిన తరువాత అవకాశాలు
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉండే అవకాశాలను ప్రధానంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి: ఉద్యోగం, ఉన్నత విద్య. ఉద్యోగం: ఇందులోనూ రెండు మార్గాలున్నాయి. ఒకటి స్వయం ఉపాధి; రెండోది ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగం పొందడం. ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలున్నాయి. విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి. బ్రాంచిల ఆధారంగా ఉద్యోగావకాశాలున్న రంగాలు:
డిఫెన్స్ సంస్థల్లో... |
పాలిటెక్నిక్.. ప్రత్యేకతలెన్నో!
Google ad
Google ad