Logo Raju's Resource Hub

హబుల్ టెలిస్కోప్

Google ad

విశ్వంలో అంతుబట్టని రహస్యాలెన్నో ఉన్నాయి. మనిషి చూడని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చూడాలంటే మనిషి కన్ను సరిపోదు. అందుకే శక్తిమంతమైన టెలిస్కో్‌పను తయారుచేసి విశ్వంలోకి అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. హబుల్‌ టెలిస్కో్‌పకన్నా ఎంతో శక్తిమంతమైన టెలిస్కోప్‌ విశేషాలు తెలుసుకుందామా!

  •  400 ఏళ్ల క్రితం గెలిలియో మొట్టమొదటిసారి టెలిస్కో్‌పను తయారు చేశారు. ఇటలీకి చెందిన ఈ శాస్త్రవేత్త అంతరిక్ష అధ్యయనం కోసం టెలిస్కో్‌పను తయారుచేశాడు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు టెలిస్కో్‌పలు వాడుతూనే ఉన్నారు.
  •  1990లో హబుల్‌ స్పేస్‌ టెలిస్కో్‌పను అంతరిక్షంలోకి పంపించారు. ఇది ఇప్పటివరకు పదిలక్షలకు పైగా చిత్రాలను పంపించింది. ఈ టెలిస్కోప్‌ జీవితకాలం మరో పదేళ్లు మాత్రమే ఉంది.
  •  తాజాగా హబుల్‌ టెలిస్కోప్‌ కన్నా కొన్ని వందలరెట్లు శక్తిమంతమైన టెలిస్కో్‌పను అంతరిక్షంలోకి పంపాలని ప్రయత్నం చేస్తున్నారు. దానిపేరు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌.
  •  ఈ ఏడాది అక్టోబర్‌లో ఫ్రెంచ్‌ గయానాలోని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ నుంచి ఎరైన్‌ 5 అనే రాకెట్‌ ద్వారా జేమ్స్‌ వెబ్‌ టెలిస్కో్‌పను అంతరిక్షంలోకి పంపాలని చూస్తున్నారు. ఒకవేళ వీలుకాకపోతే 2019 మార్చి నుంచి జూన్‌ మధ్య కాలంలో తప్పనిసరిగా ప్రయోగించనున్నారు. ఈ టెలిస్కోప్‌ ద్వారా విశ్వానికి సంబంధించిన మరిన్ని అంశాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
  •  భూమి వంటి గ్రహాలు మరేమైనా ఉన్నాయో వెతికే పని చేస్తుందీ టెలిస్కోప్‌. ఈ టెలిస్కో్‌పకు ప్రత్యేక కెమెరాను, టూల్స్‌ను అమర్చారు. మనిషి కన్ను చూడలేని వాటిని సైతం

ఈ కెమెరా చూస్తుంది.

  •  ఈ టెలిస్కోప్‌ పనితీరుకు సంబంధించిన పరీక్షలన్నింటిని నాసా పూర్తి చేసింది.
  •  జేమ్స్‌ టెలిస్కో్‌పను 9,30,000 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌2 అనే పాయింట్‌లో ప్రవేశపెట్టనున్నారు. టెలిస్కోప్‌ ఇక్కడికి చేరుకోవడానికి నెల రోజుల సమయం పట్టనుంది.
  •  జేమ్స్‌ ఎడ్విన్‌ వెబ్‌ అనే వ్యక్తి 1961 నుంచి 68 మధ్య కాలంలో నాసా సెకండ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఆయన పేరును టెలిస్కో్‌పకు పెట్టారు.
  •  సోలార్‌ ప్యానెల్స్‌ టెలిస్కో్‌పకు అవసరమైన పవర్‌ను అందిస్తాయి.

ఖగోళ వస్తువులు(సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్) నుంచి వచ్చే ఐఆర్(IR),విజిబిల్(visible) మరియు యూవీ(UV) రేస్ ని సోర్స్ గా చేసుకొని పరిశీలన చేస్తుంది.

ఖగోళ వస్తువుల నుంచి వచ్చే కాంతి హబుల్ ట్యూబ్ గుండా వచ్చి,ప్రైమరీ మిర్రర్(primary mirror) మీద పడుతుంది .ఆ ప్రైమరీ మిర్రర్ దాని మీద పడే కాంతిని సెకండరీ మిర్రర్(Secondary mirror) మీదకి కేంద్రీకరిస్తుంది.సెకండరీ మిర్రర్ మీద నుంచి కాంతి బౌన్స్ అయ్యి ప్రైమరీ మిర్రర్ మధ్యలో ఉండే రంధ్రం గుండా వెళ్ళి ఫోకల్ ప్లేన్ మీద పడుతుంది.ఈ ఫోకల్ ప్లేన్ ఆ కాంతిని‌ మ్యాగ్నిఫై (పరిమాణం పెంచడం) చేస్తుంది.మ్యాగ్నిఫై అయిన తరువాత ఆ కాంతి హబుల్లో ఉండే వివిధ సాంకేతిక సాధనాల ద్వారా ప్రయాణిస్తుంది.

Google ad

ఇక్కడ ప్రైమరీ మరియు సెకండరీ మిర్రర్ అంటే గిన్న ఆకారం లాగా లోపలికి వంగి ఉండే అద్దం.పైమరీ మిర్రర్ వ్యాసం 7.8 అడుగులు ఉంటే సెకండరీ మిర్రర్ వ్యాసం 30.5 సెంటీమీటర్లు ఉంటుంది.

హబుల్ సాంకేతిక సాధనాలలో ముఖ్యమైనవి రెండు రకాలు

1)కెమెరాలు(camera):-వీటిని టెలిస్కోపులో కనపడే ఖగోళ వస్తువులని ఫోటోలు తీయడానికి వాడతారు.

2)స్పెక్ట్రోగ్రాఫ్స్(spectrographs):-ఇవి కాంతిని విశ్లేషన కోసం, వివిధ రంగులలోకి విడగొడతాయి.

హబుల్ సాంకేతిక సాధనాలు:-

హబుల్లో ఉండే ఒక్కో సాధనం ఒక నిర్ధిష్ట వేవ్లెంత్ పరిధిలో పవిచేయడానికి నిర్మించబడినవి.అందులో కొన్ని కెమరాలుగా,కొన్ని స్పెక్ట్రోమీటర్లుగా ,మరియు కొన్ని రెండు విధాలుగా పనిచేస్తాయి.

విశ్వంని వివిధ రకాలుగా విశ్లేషించడానికి,హబుల్లో మొత్తంగా 6 ముఖ్యమైన సాధనాలు ఉంటాయి.

1)వైడ్ పీల్డ్ కెమెరా 3(wide field camera 3(WFC3)):-

ఇది అల్ట్రావైలట్(UV),విజిబిల్(visible) మరియు ఐఆర్(IR)వేవ్ లెంత్స్ ఉండే కాంతిని సంగ్రహిస్తుంది.దీనికి ఎక్కువ స్పష్టత(Resolution) మరియు విస్తృత క్షేత్ర వీక్షణ(wide filed view) ఉంటాయి.

2)కాస్మిక్ ఓరిజిన్ స్పెక్ట్రోగ్రాఫ్(cosmic origin spectrograph):-

ఈ సాధనం యూవీ(UV) రేడియేషన్స్ వి విశ్లేషించడానికి దానిని భాగాలుగా విభజిస్తుంది.ఇది చాలా దురంలో ఉండే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి అత్యుత్తమ పరికరం.దీనిని గెలాక్సీ ఎవల్యూషన్ ,గ్రహాల‌ అవిర్భావం ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి వాడతారు.

3)అడ్వాన్సడ్ కెమెరా ఫర్ సర్వే(Advanced camera for survey(ACS)):-

ఇది డీప్ స్పేస్ నుంచి వచ్చే విజిబిల్(Visible) రీజియన్ లో ఉండే కాంతిని సంగ్రహించటానికి బాధ్యత వహిస్తుంది.దీనికి ఉండే విస్తృత క్షేత్ర వీక్షణ(wide filed view) ,అధిక సెన్సిటివిటీ(sensitivity) కారణంగా దీనిని డార్క్ మ్యాటర్ వ్యాప్తి గురించి,పెద్ద పెద్ద గ్రహాల గురించి,గలాక్సీ క్లస్టర్స్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.

4)స్పేస్ టెలిస్కోప్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్(space telescope imaging spectrograph(STIS)):-

ఇది కెమెరాలాగా మరియు స్పెక్ట్రోగ్రాఫ్ లాగా రెండు పనులు చేస్తుంది.దీని ద్వారా సెలెస్టియల్ ఆబ్జెక్ట్ యొక్క ఉష్ణోగ్రత,రసాయన కూర్పు(chemical composition),సాంధ్రత మరియు కదలికిల గురించి తెలుసుకుంటారు.దీనిని క్రిష్ణబిలాలు(black holes) గురించి,నక్షత్రాల చుట్టూ ఉండే వాతావరణం గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.

5)నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఆండ్ మల్టీ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోమీటర్(Near infrared camera and Multi-object spectrometer(NICMOS)):-

ఇది IR వేవ్ లెంత్ రీజియన్(ప్రాంతం) లో ఉండే కాంతిని సంగ్రహిస్తుంది.దీని ద్వారా ఇన్టర్ స్టెల్లార్ దూలిలో కప్పబడి ఉన్న వస్తువుల గురించి తెలుసుకుంటారు.ఇవి మొత్తం మూడు ఉంటాయి.

6)పైన్ గైడెన్స్ సెన్సార్స్(Fine guidence sensors):-

ఇవి హబుల్లో మొత్తం మూడు ఉంటాయి.ఇందులో రెండు సెన్సార్స్, హబుల్ ఏ వస్తువునైతే పరిశీలించాలో,ఆ వస్తువు ఉండే దిశగా హబుల్ ని పాయిన్ట్ చేసి హోల్డ్ చేస్తాయి.మూడో సెన్సార్ ఆ వస్తువును పరిశీలించి అది ఎంత దూరంలో ఉంది,దాని కదలికల గురించి విశ్లేషిస్తుంది.

విశ్వ పరిణామక్రమాన్ని తెలుసుకునే దిశగా నాసాకు చెందిన హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ కొత్త తలుపులు తెరిచింది. ఈ టెలిస్కోప్‌ విశ్వంలో సుదూరంలో ఉన్న 15 వేల గెలాక్సీల్లో ఉన్న 12 వేల నక్షత్రాల ఆవిర్భావానికి సంబంధించి సంపూర్ణ ఛాయా చిత్రాలను తీసి పంపింది. నక్షత్రాల పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునేందుకు ఇవి సహాయపడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బిగ్‌బ్యాంగ్‌ విస్ఫోటనం తర్వాత 300 కోట్ల ఏళ్ల కింద, అంటే ఇప్పటికి 11 వందల కోట్ల ఏళ్ల కిందట నక్షత్రాలు ఆవిర్భవించిన తీరును ఈ చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చట! హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌లో వాడుతున్న అతినీలలోహిత కిరణాల సహాయంతో విశ్వం గుట్టు విప్పడం సాధ్యం కాకపోవడంతో పరారుణ, గోచర కిరణాల పరిజ్ఞానం కలిగిన ఇతర టెలిస్కోప్‌ల సాంకేతికతను దానికి జోడించారు. అనంతరం ఈ కిరణాలను విశ్వంతరాల్లోకి పంపి నక్షత్రాల సంపూర్ణ ఛాయా చిత్రాలను తీశారు.  

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading