Logo Raju's Resource Hub

గ్లోబల్ వార్మింగ్

Google ad

సూర్యుడు, నేల, సాగరం, అగ్ని పర్వతాలు, నేల యొక్క స్థితి (వ్యవసాయమా, నగరాలు, పారిశ్రామిక వాడా), మనుషులు, చెట్లు, కార్బన్ డైఆక్సైడ్ (CO2), ఆక్సిజన్(O2) మొదలగు వాయువులు, కాలుష్యం ద్వారా గాలిలో ఉన్న చిన్న కణాలు (ఏరోసోల్స్, మసి), మన వాతావరనాన్ని (climate) ఎక్కువ ప్రభావం చేస్తాయి. వీటి స్థితి (state or quantity) మారితే మనము నివసించే వాతావరణo మార్పుచెందుతుంది.

వాతావరణo (climate ) అంటే:

మనకు వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఎప్పుడు వస్తాయో మన అనుభవం ద్వారా తెలుసు కదా! సైంటిఫిక్ గా, ఒక 30 సంవత్సరాలనుండి ప్రతి నెల మనం ఉష్ణోగ్రతను మరియు వర్షపాతమును నమోదు చేసి, ఆ డేటాను (data) సగటు కట్టాం అనుకోండి , దాన్నే సైంటిఫిక్ గా వాతావరణం అని అంటాము (climate is an average weather of last 30 years). ఉదాహరణకు, Slide 2, చెన్నై లోని ప్రతీ నెల ఉష్ణోగ్రత మరియు వర్షపాతము యొక్క 30 సంవత్సరాల సగటు మీకు చూపిస్తుంది. మీరు బాగా గమనిస్తే, జూన్ నెలలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువ, డిసెంబర్లో ఉష్ణోగ్రతలు బాగా తక్కువ వుంటాయని మీకు అర్ధమవుతుంది. అలాగే, నవంబర్ నెలలో ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. ఐపీల్ (IPL) గనక మనం నవంబర్లో పెట్టుకుంటే, మన టీవీ కట్టేసి, ధోనీని మన ఇంటికి పిలిచి, తనతో కలిసి మన౦ ఇంట్లో క్రికెట్ ఆడుకోవాలి!

గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ (Green house effect) :

Google ad

సూర్యుడి నుండి వచ్చిన electromagnetic energy (short wave radiation) , మన భూమి గ్రహించి (absorb), థర్మల్ రేడియేషన్ (thermal radiation) ను తిరిగి గాలిలోకి విడుదల చేస్తుంది. ఈ థర్మల్ రేడియేషన్ ను గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ (CO2) గ్రహించి, మన వాతావరన్నాని వేడిగా ఉంచుతుంది (ఉదారణకు మనకు చలిలో వేడికి దుప్పటి ఏలాగో , మన వాతావరణం లో వేడికి కార్బన్ డైఆక్సైడ్ (CO2) అలాగ అనమాట). ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ (CO2) మన గాలిలో లేకపోతే మన వాతావరణం వేడి ఎక్కదు. కార్బన్ డైఆక్సైడ్(CO2) లాగా ఇంకా కొన్ని వాయువులు మన వాతావరణం ని వేడిగా ఉంచుతాయి . ఉదారణకు గాలిలో తేమ వాతావరణం ని వేడిగా ఉంచుతుంది. కార్బన్ డైఆక్సైడ్ (CO2) వాతావరణం ని వేడిగా ఉంచే వాయువులలో అతి ముఖ్యమయినది. దీనే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ (green house effect) అని అంటాం! Slide 3 లో, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎలా జరుగుతుందో మీరు చిత్రపటము ద్వారా చూడవొచ్చు!

వాతావరణ మార్పును మీకు వివరించే కంటే ముందు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు బాగా చలి వేస్తుంది అనుకుందాం, అప్పుడు మీరు ఒక దుప్పటి కప్పుకున్నారు అనుకుందాం. దురదృష్టవశాత్తు ఇంకా మీకు చలి తగ్గలేదు. ఇప్పుడు మీరు మరో దుప్పటి మీద వేసుకున్నారు, అయినా చలి తగ్గలేదు. ఈసారి అత్యుత్సాహంలో 10 దుప్పట్లు తెచ్చి మీ మీద వేసుకున్నారు అనుకుందాం. ఒక్కసారిగా మీ శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి! సరిగ్గా ఇలాగే, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ (CO2) విపరీతంగా పెరిగిపోవటం వలన, మన వాతావరణం వేడి ఎక్కుతుంది అనమాట.

వాతావరణ మార్పునకు ఆధారం:

Slide 4, ఎడమచేతి చిత్రపటం లో కొన్ని వేల సంవత్సరాలనుండి కార్బన్ డైఆక్సైడ్ (CO2) మోతాదు మన గాలిలో ఎలా పెరుగుతూ వున్నదో చూడవచ్చు. వేల సంవత్సరాల క్రితం 280–300 PPM (parts per million మిలియన్ ) ఉన్న కార్బన్ డైఆక్సైడ్ (CO2) మోతాదు, ఇప్పుడు 420–440 PPM చేరుకుంది. ముక్యంగా పారిశ్రామిక విప్లవం (1800-ప్రస్తుతం ) తరువాత కార్బన్ డైఆక్సైడ్ (CO2) మోతాదు ఎక్కువగా పెరిగిపోయింది. ఇందుకు ముఖ్యకారణం, శిలాజ ఇంధన వినియోగ౦, ఫ్యాక్టరీ కాలుష్యం, వాహనాలు, మొదలుఅయినవి మనుషులు ఎక్కువగా ఉపయోగించడం వల్లనే. దీన్నే హ్యూమన్ ఇండుస్డ్ గ్లోబల్ వార్మింగ్ (human induced global warming) అని అంటాం.

కార్బన్ డైఆక్సైడ్ (CO2) మోతాదు పెరగటం వలన, మన వాతావరణ ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. Slide 4 కుడివైపు వున్నా చిత్రపటం 1880 ల చివరి నుండి భూమి ఉపరితలం వద్ద సగటు వార్షిక ఉష్ణోగ్రత ఎలా పెరిగింధో చూపుతుంది. దాదాపు భూమి ఉపరితలం వద్ద సగటు 1 డిగ్రీ పెరిగినట్టు మనం గణమించవచ్చు. ఇది వాతావరణం మార్పుకు స్పష్టమైన సంకేతం.

భవిషత్తులో :

భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం వుపయోగించి నిర్మించిన, క్లైమేట్ మోడల్స్ (Climate Models) భవిషత్తులో వాతావరణ మార్పు ఎలా ఉండబోతోందో చుపుతాయి. Slide 5 లో ఎడమ చిత్రపటం మీరు గమనిస్తే దాదాపు భూమి ఉపరితలం వద్ద సగటు 4 డిగ్రీలు పెరిగవచ్చని మనం గణమించవచ్చు. మనం ఇప్పటిలా కార్బన్ డైఆక్సైడ్ (CO2)(RCP 8.5, red line) మోతాదు గాలిలోకి విడుదల చేస్తూపోతే, భూమి ఉపరితలం వద్ద సగటు 4 డిగ్రీలు పెరగవచ్చు. కొంచెం తగ్గిస్తే (RCP 2.6), 2 డిగ్రీలు పెరగవచ్చు.

వాతావరణ మార్పు వలన:

భవిషత్తు వాతావరణ మార్పుతో సముద్ర మట్టాలు పెరగడం, అవపాతంలో ప్రాంతీయ మార్పులు, వేడి తరంగాల, వరదలు, అడవి మంటలు వంటి తీవ్ర సంఘటనలు, ఎడారుల విస్తరణ జరుగగలవు.

మనం మన భాద్యత తెలుసుకుని, భవిషత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని, ఇకనైనా కార్బన్ డైఆక్సైడ్ (CO2) గాలిలోకి విడుదలచేసే మోతాదును తాగిస్తే, మానవ జాతికి, మిగిలిన జీవాలకు భవిషత్తులో మన భూమి మీద మనుగడ ఉంటుంది.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading