2026
The annular solar eclipse on February 17, 2026, creates a stunning “ring of fire” effect as the Moon partially covers the Sun. This rare event holds astrological and spiritual significance, especially coinciding with Phalguna Amavasya, influencing rituals in India.
సూర్య గ్రహణం 2026 ప్రాముఖ్యత (Significance of Solar Eclipse 2026)
In Hindu tradition, Surya Grahan marks a powerful time for prayers, fasting, and remedies against planetary doshas like those from Rahu. Devotees perform Surya Puja to mitigate negative energies, seeking health, prosperity, and ancestral blessings during this Aquarius eclipse.
Astrologically, it signals transformation for zodiac signs like Taurus, Leo, Scorpio, and Aquarius, urging introspection and new beginnings. Scientifically, the eclipse’s path highlights celestial mechanics, drawing global astronomy enthusiasts.
| Phase | Universal Time (UT) | IST Approx. | Visibility Notes |
|---|---|---|---|
| Begins | 10:09 UT | 3:39 PM | Partial in South Africa |
| Peak | 12:11 UT | 5:41 PM | Antarctica Ring of Fire |
| Ends | 14:13 UT | 7:43 PM | Not visible in India |
Sutak Kaal (inauspicious period) starts 12 hours prior for householders, advising avoidance of new tasks.
పూజా విధానం మరియు ఆచరణలు (Puja Procedure and Observances)
Take a purifying bath before Sutak begins. Chant Aditya Hridaya Stotra or Surya mantras facing east; offer water (Arghya) to the Sun at sunrise if visible. Donate wheat, jaggery, or copper; avoid cooking or eating during eclipse hours. Post-eclipse, perform Ganga Snan and charity.
సూతక్ ముందు స్నానం చేయండి. తూర్పు ముఖం చేసి ఆదిత్య హృదయ స్తోత్రం లేదా సూర్య మంత్రాలు జపించండి; సూర్యునికి అర్ఘ్యం అర్పించండి. గోధుమ, బెల్లం, తామ్రం దానం చేయండి; గ్రహణ సమయంలో భోజనం మానండి. తర్వాత గంగా స్నానం, దానాలు.
Dos:
- Chant mantras, meditate.
- Stay indoors, donate essentials.
Don’ts:
- Touch puja items, eat/touch water.
- Start auspicious work.
2020
ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ఆదివారం భారత్‌లో కనిపించి కనువిందు చేయనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సుదూరంగా వెళ్లడంతో పూర్తిగా సూర్యుడ్ని కప్పి ఉంచలేడు. 70శాతం మాత్రమే కప్పివేయడంతో ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుంది.
► 2020లో సంభవించే రెండు సూర్యగ్రహణాల్లో ఇది మొదటిది. ఇది పాక్షిక సూర్య గ్రహణమే. డిసెంబర్ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం.
► దేశంలో గుజరాత్‌లోని భుజ్‌లో మొదట కనిపిస్తుందని, అస్సాంలోని దిబ్రూగఢ్‌లో చివరిగా మధ్యాహ్నం 2:29 గంటలకు పూర్తవుతుందని నెహ్రూ ప్లానెటోరియంలోని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
► ఇవాళ్టి వార్షిక సూర్యగ్రహణంలో ఆకాశంలో అద్భుత దృశ్యమైన రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు దీనిని వీక్షించవచ్చును.
ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్, డెహ్రాడూన్ తదితర ప్రాంతాల్లో సూర్యగ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుందని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ డా.బి.జి.సిద్ధార్థ్ చెప్పారు. హైదరాబాద్‌తోపాటు మిగతా చోట్ల పాక్షికంగానే కనిపిస్తుందన్నారు. సూర్యగ్రహణాన్ని నేరుగా, ఎక్స్‌రే ఫిలిం, నల్లని గాజు ముక్కల ద్వారా చూడడం ప్రమాదకరమని తెలిపారు. వైద్యులు సూచించిన ఎక్లిప్స్ అద్దాలతోనే గ్రహణాన్ని చూడాలని సూచించారు. వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని ‘జ్వాలా వలయం’గా పిలుస్తారు. ఒక్కోసారి ఒక సెకను కంటే తక్కువ కాలంలోనే జ్వాలా వలయం మాయమవుతుంది. కొన్నిసార్లు 12 నిమిషాలకుపైగా కనిపిస్తుంది.
► సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే మనిషి కంటిలో రెటీనా దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తగినన్ని రక్షణ జాగ్రత్తలతో ఫిల్టర్ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్ ఆఫ్ ఫైర్ దృశ్యాన్ని చూడొచ్చు.