ఇంటర్మీడియట్ బై పీ సీ లో 50 నుండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
ఇమిగ్రేషన్ నిబంధనలకు సరితూగాలి
వీసాకు అవసరమైన డాక్యుమెంట్లు కలిగి ఉండాలి
ఇంకొక ప్రధానమైన అంశం భాష. విదేశాలలో ఎక్కడ చదవాలన్నా ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం తప్పనిసరి. ధారాళంగా మాట్లాడం తప్పనిసరి. ఇంటర్ మీడియట్ నుండే ఇంగ్లీష్ భాషమీద పట్టు సాధించడం మంచిది. అవసరమైతే కోచింగ్ సెంటర్ల నుండి శిక్షణ తీసుకోవచ్చు.
ఎం.సి.ఐ గుర్తింపు
విదేశాలలోఎం.బి.బి.ఎస్ చదవాలనుకునే విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం. తాము చదవదలుచుకున్న ఇన్ స్టిట్యూట్ కు భారత దేశంలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ) గుర్తింపు ఉందో, లేదో తప్పకుండా తెలుసుకోవాలి. దీనికోసం ఎం.సి.ఐ వెబ్ సైట్ ను తప్పకుండా చూడాలి.
విదేశాలలో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసిన భారతీయ విద్యార్ధులు భారతదేశ ఎం.సి.ఎ నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణత సాధిస్తేనే మనదేశంలో పి.జీ కోర్సులు చేసే అవకాశం ఉంటుంది.
Qualifications to Study MBBS in Abroad
Google ad
Google ad
Raju's Resource Hub