Logo Raju's Resource Hub

కొడైకెనాల్

Google ad

దక్షిణ భారతదేశంలో బాగా పేరున్న వేసవి విడుదులు ఒకటి ఊటీ ఇంకొకటి కొడైకెనాల్.
కొడై కెనాల్ తమిళనాడు రాష్ట్రానికి దాదాపు నడిబొడ్డుకు దగ్గరగా ఉన్న అందమైన ఒక హిల్ స్టేషను.

చూడదగ్గ ప్రదేశాలు

కొడై సరస్సు:
కోడైకెనాల్ పట్టణము యొక్క సెంటరుకు దగ్గరగా 1863లో కట్టిన మానవనిర్మిత కొడై సరస్సు వుంది. 60 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ సరస్సు ఒక వైపు అరచెయ్యి మాదిరిగా వెడల్పుగా ఉండి, మరోవైపు చేతి వేళ్ళ మాదిరిగా సన్నని పాయలుగా వుంటుంది. ఈ సరస్సులో బోటు షికారు కూడా ఉంది.

కోకర్స్ వాక్:
ఇది ఒక కొండ అంచునే సన్నగా పొడుగుగా ఉన్న కాలి బాట. ఈ బాట వెంబడే నడుచుకుంటూ వెళితే, చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలు చాలా బాగుంటాయి.

సెయింట్ మేరీ చర్చి :
ఈ చర్చి సుమారు 150 సంవత్సరాలకు పూర్వం కొడైకెనాల్ లో నిర్మించబడిన మొట్ట మొదటి చర్చి. ఈ చర్చిలో నగిషీ పని బాగా ఉంది.

Google ad

పంపార్ జలపాతం:
ఈ జలపాతం కొడైకెనాల్ పట్టణానికి ఒక చివరగా ఉంటుంది. ఎత్తు పల్లాలతో ఉన్న రాతినేల మీద ప్రవహించుకుంటూ వస్తున్న సన్నని వాగు ఇది.

గ్రీన్ వ్యాలీ వ్యూ:
ఒక కొండ అంచున నిలబడి చూడటానికి వీలుగా ఒక ప్లాట్ ఫామ్ నిర్మించారు. ఇక్కడి నుండి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్ల తో కూడిన పర్వతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

గుణ గుహ :
రోడ్డు అంచులో వున్న ఒక బాట వెంట సుమారు 200 గజాలు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుండి కిందకు దిగుతూ వెళితే , ఒక చిన్న కొండ యొక్క అడుగు భాగంలో ఒక గుహ కనిపిస్తుంది. కాని మనం దాని దగ్గరగా వెళ్ళి చూడటం కుదరదు. అక్కడకు వెళ్ళటానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసారు.స్థానికులు దీనిని దయ్యాల గుహ అని పిలుస్తారు.

పైన్ వృక్షాల అరణ్యం:
కేవలం మంచు, చలి ఉండే కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పైన్ వృక్షాలు ఇక్కడ ఒక చోట సుమారు ఒక కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా పెరిగి ఉన్నాయి. ఇక్కడ చాలా సినిమాల షూటింగ్ లు జరిగాయి.

శాంతి లోయ :
ఇది దట్టంగా చెట్లతో నిండి ఉన్న విశాలమైన లోయ.

కురింజి ఆండవర్ ఆలయం
ఈ దేవాలయము కోడైకెనాల్ కు దూరంగా ఉంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై వున్నాడు. 1930 వ సంవత్సర ప్రాంతంలో ఇక్కడ నివసిస్తూ ఉండిన ఒక యూరోపియన్ మహిళకు ఈ స్వామివారు కలలో కనిపించి ఆశీర్వదించాడట. దానికి కృతజ్ఞతగా ఆవిడ ఈ దేవాలయం నిర్మింప చేసిందని స్థానికులంటారు. కొడైకెనాల్ పరిసర ప్రాంతాలలో పుష్కరానికి ఒకసారి మాత్రమే ఊదారంగు పూలు పూచే కురింజి పొదల వలనఈ గుడికి ఆ పేరు వచ్చింది.

వసతి
కొడై కెనాల్ బస్ స్టాండును ఆనుకుని హోటళ్ళు చాలా ఉన్నాయి. అన్ని తరగతుల వారికి అనుకూలంగా హోటళ్ళు ఉన్నాయి. బస్ స్టాండ్ దగ్గరనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సంస్థ వారి కార్యాలయము కలదు. అక్కడ మనకు బస చేయటానికి అనువైన హోటళ్ళ వివరాలు, కొడైకెనాల్లో చూడదగ్గ ప్రదేశాల వివరాలు లభిస్తాయి.

రవాణా విశేషాలు
కొండ ప్రాంతం కనుక ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే మధురై నుండి సుమారు నాలుగు గంటలు, పళని నుండి రెండు గంటలు, దిండిగల్ నుండి మూడున్నర గంటల బస్సు ప్రయాణం ద్వారా కొడైకెనాల్ చేరుకోవచ్చు. విమానం ద్వారా అయితే, మధురై, కోయంబత్తూర్, తిరుచునాపల్లి కి విమానంద్వారా చేరుకుని , అక్కడ నుండి టాక్సీ లో వెళ్ళ వచ్చు. రైలు ద్వారా అయితే, చెన్నైనుండి మధురై వేళ్ళే ఏదైనా రైలు ద్వారా కొడై రోడ్డు స్టేషను కాని, దిండీగల్ కాని చేరుకుని వెళ్ళ వచ్చు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading