Logo Raju's Resource Hub

గంగోత్రి

Google ad
kedaranath temple

గంగోత్రి గంగా నది పుట్టిన ప్రదేశం. గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం. హిమాలయాలలోని చార్‌ధామ్‌లలో ఒకటి. ఇక్కడ గంగానది భాగీరధి పేరుతో పిలవబడుతుంది. గంగా నదినిభూమికి తీసుకు రావడానికి భాగీరధుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది. దేవ ప్రయాగనుండి గంగానదిలోఅలకనందా నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గోముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిలోమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది. హరిద్వార్, రిషికేశ్ మరియు డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు. యమునోత్రి నుండి రెండురోజుల ప్రయాణం చేసి చేరుకోవచ్చు. యమునోత్రి కంటే గంగోత్రికి వచ్చే సందర్శకుల సంఖ్య అధికం. గంగోత్రిని బస్సు లేక కారులో ప్రయాణించి చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగాదేవాలయం ముఖ్యమైన ప్రదేశం. గంగాదేవాలయంలో ఉన్న గంగాదేవి దీపావళి నుండి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ మిగిలిన సమయంలో హార్సిల్ సమీపంలోని ముఖ్బ లోనూ ఉంటుంది. 18వ శతాబ్దపు ఆఖరి భాగం లేక 19వ శతాబ్దపు ఆరంభంలో గంగాదేవి ఆలయం గుర్కా జనరల్ అమర్‌సింఘ్ థాపాచే నిర్మించబడి నట్లు అంచనా. ఇక్కడి సంప్రదాయక పూజలు సెమ్వాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారు. గంగానది ఉదృతంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి ఆరతి ఇచ్చే దృశ్యం భక్తులకు మనోహర దృశ్యం. పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గోముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.

Visiting Season : Akshaya Tritiya (April or May).- Deepavali
How to go : Gangotri Temple is in Gangotri Town, Uttarkashi district of Uttarakhand. Rishikesh is the nearest Railway station – from Rishikesh to Gangotri busses and taxies are available

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading