Logo Raju's Resource Hub

యూట్యూబ్ ఛానల్

Google ad

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి కావాల్సిన టూల్స్

Essential Equipment to start a new YouTube Channel

Camera

మంచి కెమెరా అంటే మన దగ్గర ఉన్న కెమెరానే మంచి కెమెరా. అది మొబైల్ కెమెరా అయినా సరే. ఒకవేళ మీరు మంచి కెమెరా కొనాలి అనుకుంటే మీరు తీసే వీడియోలను బట్టి ప్రొఫెషనల్ కెమెరామెన్ ని సంప్రదించి కెమెరా ని కొనండి. ప్రస్తుతం వస్తున్నా  స్మార్ట్ ఫోన్లకు కెమెరా బాగానే ఉంటుంది. ప్రారంభంలో మనం మన దగ్గర ఉన్న మొబైల్ కెమెరా తో వీడియోలను షూట్ చేయొచ్చు.

Tripod

Tripod ఉంటేనే వీడియోని బాగా షూట్ చేయడానికి వీలు అవుతుంది. కెమెరా ని ఒక frame లో సెట్ చేసుకొని మనం షూట్ చేసుకోవొచ్చు. నేను ప్రస్తుతం Amazon Basics Tripod ని వాడుతున్నాను. యీ tripod ని మనం ప్యాక్ చేసుకొని మన బ్యాగ్ లో తీసుకెళ్లవచ్చు. ఇది వాడిన తరువాత కూడా అంతే జాగ్రత్తగా ప్యాక్ చేసి బ్యాగ్ లో పెట్టుకోవాలి. outdoor షూటింగ్స్ లో కూడా యీ tripod ని వాడుకోవొచ్చు.
Mobile Tripod

Mic

ఒక వీడియో లో వీడియో కి మనం ఎంత ప్రాధాన్యతని ఇస్తామో, అంతే ప్రాధాన్యతని మనం ఆడియో కి కూడా ఇవ్వాలి. మనం వాడే మొబైల్ కెమెరాలో కూడా మైక్ ఉంటుంది కానీ ఆ mic అంత క్లియర్ గ ఉండదు. పైగా కెమెరా మనకు దూరంగా ఉండి షూట్ చేయాల్సి వచ్చినప్పుడు mic కూడా దూరంగా ఉంటుంది. అటువంటి సమయాల్లో  ఆడియో సరిగ్గ రికార్డు అవ్వదు. ఇటువంటి సమస్యని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా mic ఉండాల్సిందే. ప్రారంభంలో మనం బోయా mic తో స్టార్ట్ చేయొచ్చు. నేను ప్రస్తుతం బోయా mic నే వాడుతున్నాను యూట్యూబ్ వీడియోస్ కోసం.
Boya BYM1 Omnidirectional Lavalier Condenser Microphone with 20ft Audio Cable (Black)

Lighting

రాత్రి రికార్డు చేస్తున్న సమయాల్లో కానీ, వెలుతురు సరిగ్గా లేని స్థలాల్లో వీడియో ని క్లియర్ గ రికార్డు చేయాలంటే మంచి లైటింగ్ ఉండాల్సిందే. నేను ప్రస్తుతం LED Ring Light వాడుతున్నాను. Yellow, White, Yellow + White లో లైటింగ్ సెట్ చేసుకోవొచ్చు. యీ light స్టాండ్ కె మన మొబైల్ పెట్టుకొనే హోల్డర్ ఉంటుంది కానీ అది indoor షూటింగ్స్ లో మాత్రమే వాడుకోవొచ్చు. outdoor షూట్ కి అనుకుంటే మీరు tripod కొనాల్సిందే.
mobicell 10 Inches Big LED Ring Light for Camera Smartphone to Capture Your Photo and Video at Tiktok, Musically and Other Phone's App with Tripod

Video Editing Apps

  1. InShot
  2. Premiere Rush (if your mobile supports)
  3. Kinemaster
మీరు మీ laptop గాని desktop లో గాని వీడియో ఎడిటింగ్ చేయాలి అనుకుంటే davinci resolve అనే ఫ్రీ వీడియో ఎడిటింగ్ టూల్ ని download చేసుకొని ఎడిటింగ్ చేయండి. ఫ్రీ వెర్షన్ ని మాత్రమే డౌన్లోడ్ చేయండి.

other resources

మీకు అవసరం అవ్వొచ్చు అనుకొని ఇస్తున్న వీడియో లింక్స్
How to Create YouTube Channel? (PART-1)
How to Create YouTube Channel? (PART-2)
How to Design YouTube Thumbnails?
Canva Tutorial in Telugu – Digital John

యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించటం ఎలా?


యూట్యూబ్ అనేది వీడియో సెర్చ్ ఇంజిన్
యూట్యూబ్ లో డబ్బు సంపాందించాలి అంటే మనకి కచ్చితంగా ఎదో ఒక స్కిల్ అనేది ఉండాలి.
1. మీకు గేమ్స్ అంటే ఇష్టం ఐయితే ఆ గేమ్స్ మీద వీడియోస్ చేయండి.
2. మీకు మూవీస్ అంటే ఇష్టం ఐయితే మూవీస్ మీద వీడియోస్ చేయండి.
3. మీకు వైల్డ్ లైఫ్ ఇష్టం ఐయితే వైల్డ్ లైఫ్ మీద చేయండి.
4. మీకు హెల్త్ టిప్స్ బాగా తెలుసు అనుకుంటే వాటిమీద చేయండి.
5. మీకు వంటలు చేయడం ఇష్టం ఐయితే వంటలు మీద చేయండి.
6. గాడ్జెట్స్ మీద రివ్యూస్.
ఇలా మనము చెప్పుకుంటే పొతే చాల ఉంటాయి ఎందుకంటే ఒక్కొరికి ఒక్కోటి ఇష్టం.
మీరు వీడియోస్ పెట్టగానే డబ్బులు రావు
మీ ఛానల్ కి కచ్చితంగా 1000 మంది Subscribers ఉండాలి అలాగే 4000 గంటలు మీ వీడియోస్ చూసి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు గూగుల్ యాడ్స్ కి అనుమతి లభిస్తుంది .
టిప్స్
1. ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే మీకు వ్యూస్ అండ్ డబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది .
2. టైటిల్స్ కరెక్ట్ గ పెట్టాలి.
3. వీడియో కి సంబందిచిన టాగ్స్ కచ్చితంగా ప్రతి వీడియోకి యాడ్ చేయాలి.
4. యూజర్స్ సెర్చ్ చేసే దానిమీద వీడియోస్ చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాసం ఉంటాది.
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading