
మైసూర్ పట్టణం కర్నాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధాని. ఈ పట్టణం దక్షిణ భారతదేశంలోని ఒక సంపన్న మరియు రాచరిక ప్రాధాన్యతలుకల ఒక పట్టణం. సందర్శకులకు ఈ పట్టణం అనేక తొటలు, వారసత్వ భవనాలు, మరియు చల్లని నీడనిచ్చే రోడ్లతో ఎప్పటికి మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది. గంధపు చెక్కల సువాసనలు, గులాబీల గుబాళింపులు మైసూర్ పట్టణానికి గంధపు నగరం లేదా శాండల్ వుడ్ సిటీ అనే పేరు తెచ్చిపెట్టాయి. దీనినే ఐవరీ సిటీ అని, లేదా రాజప్రాసాదాల నగరం అని కూడా సాధారణ ప్రజలు అంటారు.మైసూర్ లో యోగా కేంద్రాలు అధికంగా కనపడే కారణంగా దీనిని యోగా సిటీ అని కూడా పిలుస్తారు. మైసూర్ లో నిర్వహించే అష్టాంగ యోగ కార్యక్రమాలు దేశ విదేశాలనుండి యోగా ప్రియులను ఎంతో ఆకర్షిస్తాయి. ఇతిహాస, పురాణాల పరిశీలనలో మైసూర్ పట్టణం – దేవీ భాగవతం మేరకు ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించాడు. అతని పేరుతోనే ‘మహిష – ఊరు’ అని నామకరణం చేయబడింది. కాలక్రమేణా అది మహిషూరు లేదా మైసూరుగా రూపొంది ఆంగ్లేయుల రాకతో అది మైసూర్ గా స్ధిరపడింది. ఈ రాక్షసుడు ఆ ప్రాంత ప్రజలు కొలిచే దేవీ మాత చాముండిచే చంపబడతాడు. దేవీ చాముండి దేవాలయం నేటికి మైసూర్ పట్టణానికి తూర్పు దిశగా చాముండి హిల్స్ పై నెలకొని ఉంటుంది. మైసూర్ చరిత్ర నుండి కొన్ని ప్రధాన ఘట్టాలు – అశోక చక్రవర్తి కాలంలో మైసూర్ చాలా ప్రసిద్ధి చెందినట్లు క్రీ.పూ.245 సంవత్సరాలనాటి చరిత్ర చెపుతోంది. అయితే, క్రీ.శ. 10 వ శతాబ్దంనుండి ఖచ్చితమైన చారిత్రాత్మక రుజువులు ఈ నగరంపై లభ్యమవుతున్నాయి. ఈ చరిత్ర సాక్ష్యాల మేరకు, మైసూర్ రాజ్యాన్ని గంగ వంశం వారు 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 1004 వరకు పరిపాలించారు. వారి తర్వాత చోళులు ఈ ప్రాంతాన్ని షుమారు ఒక శతాబ్దం పాలించారు. 10 వ శతాబ్దం వరకు ఈప్రాంతాన్ని పాలించిన చాళుక్య వంశీకుల పాలన క్రింద మైసూర్ ఉండేది. చోళులు 10వ శతాబ్దంలో మరోమారు అధికారానికి వచ్చారు. అయితే, వారు 12వ శతాబ్దంలో హొయసల రాజులచే ఓడించబడ్డారు. హొయసల రాజులు మైసూర్ లో అనేక దేవాలయాలు నిర్మించారు. మరి కొన్నింటిని పునరుద్ధరించారు. మైసూరు యదు వంశస్ధులు గొప్ప భూస్వాములు వారు విజయనగర మహా సామ్రాజ్యనికి కప్పం కడుతూ మైసూర్ పాలకులుగా 1399 వరకు పాలించారు. యాదవ వంశస్దులకు చెందిన వారే యదు వంశస్ధులని కూడా విశ్వసించబడుతోంది. వీరే తర్వాతికాలంలో ఒడయార్ వంశస్ధులుగా కూడా పిలువబడ్డారు. బెట్టడ చామరాజ ఒడయార్ మైసూర్ కోటను 1584 లో నిర్మించి దానిని తన పాలనకు ప్రధాన నగరంగా చేసుకున్నాడు. తర్వాత అతడు తన రాజధానిని మైసూర్ నుండి శ్రీరంగ పట్టణానికి 1610వ సంవత్సరంలో బదలాయించాడు. మైసూర్ పట్టణం హైదర్ ఆలీ మరియు టిప్పు సుల్తానులచే 1761 నుండి 1799 వరకు పాలించబడింది. 1799 లో టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత మైసూర్ మరోమారు ఒడయార్లకు రాజధానిగా మారింది. మైసూర్ పట్టణాన్ని విశాలమైన రోడ్లు, అతి పెద్ద రాజ భవనాలు, తోటలు మరియు సరస్సుల ఏర్పాటుతో ఒక ప్రత్యేక నగరంగా చక్కటి ప్రణాళిక మేరకు రూపొందించిన ఘనత క్రిష్ణరాజ ఒడయార్ IV (1895-1940)కు దక్కుతుంది. స్ధానిక సంక్కృతి మరియు ఆకర్షణలు – మైసూర్ పట్టణాన్ని సందర్శించే పర్యాటకులు విభిన్నమైన మైసూర్ సంక్కృతికి అబ్బుర పడతారు. ఈప్రాంత సంప్రదాయాలు, కళలు, చేతిపనులు, ఆహారాలు, జీవనవిధానం ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. ఈనగరం విభిన్న మతాల, విభిన్న ప్రాంతాల, విభిన్న రంగాల ప్రజలతో కాస్మోపాలిటన్ నగరంగా ప్రసిద్ధి చెందింది.
మైసూర్ జిల్లాకు మైసూర్ పట్టణం ప్రధాన కార్యాలయంగా ఉండి సందర్శకులకు వివిధఆకర్షణలు కలిగిస్తోంది. వారసత్వపు భవనాలు, చారిత్రక చిహ్నాలు, ప్రాచీన దేవాలయాలు, మ్యూజియములు, సరస్సులు, గార్డెన్లు వంటివాటితో ఈనగరం రాజ భవనాల నగరంగా ప్రసిద్ధి చెందింది. మైసూర్ ప్యాలెస్ లేదా అంబా ప్యాలెస్ అనేది నగరంలో ఎంతో ప్రధానమైన ప్యాలెస్ గా చెపుతారు. దేశంలోనే ఈప్యాలెస్ అత్యధిక సందర్శకులను నమోదు చేసుకొంది.
మైసూర్ జంతు ప్రదర్శనశాల లేదా… జూ, చాముండేశ్వరి దేవాలయం, మహాబలేశ్వర దేవాలయం, సెయింట్ ఫిలోమినా చర్చి, బృందావన గార్డెన్స్, జగన్మోహన ప్యాలెస్ ఆర్ట్ గ్యాలరీ, లలితా మహల్ ప్యాలెస్, జయలక్ష్మీ విలాస్ భవనం, రైల్వే మ్యూజియం, కారంజి లేక్, మరియు కుక్కర హళ్ళి సరస్సు వంటి ప్రదేశాలు మైసూర్ నగరంలో ప్రధాన ఆకర్షణలు. మైసూర్ పట్టణానికిచుట్టు పక్కల ఉన్న శ్రీరంగపట్న, నంజన్ గూడ్, శివసముద్ర జలపాతాలు, తలకాడు, మేల్ కోటే, సోమనాధపుర, హళీబీడు, బేలూరు, బండిపుర నేషనల్ పార్క్, శ్రావణబెళగొళ మరియు కూర్గ్ లేదా కొడగు వంటి ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు మైసూర్ కు వస్తారు.
మైసూర్ పట్టణంలోని మైసూర్ ప్యాలెస్ ను అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. మైసూర్ సందర్శించే పర్యాటకులు దీనిని తప్పక చూడవలసిందే. ప్యాలెస్ నిర్మాణంలో ఇండో సార్సెనిక్, ద్రవిడ, రోమన్, మరియు ప్రాచ్య దేశాల శైలి శిల్పకళా చాతుర్యాలు కనపడతాయి. మూడు అంతస్తులుకల ఈ ప్యాలెస్ నిర్మాణంలో మూడు మార్బుల్ గోపురాలకు గ్రే గ్రానైట్ ఉపయోగించారు. ప్యాలెస్ తో బాటుగా 44.2 మీటర్ల ఎత్తుగల అయిదు అంతస్తుల టవర్ కూడా నిర్మించారు. దీని గోపురాలు బంగారంతో తాపడం చేయబడ్డాయి. ఈ నిర్మాణం ప్రపంచంలోనే అత్యధిక సందర్శకులు వచ్చే ప్రదేశంగా చెప్పబడుతోంది. ప్రతిష్టాత్మక ఈ నిర్మాణాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ భూమి పై గల 31 తప్పక చూడవలసిన ప్రదేశాల జాబితాలో చేర్చింది. పర్యాటకులు ప్యాలెస్ లోకి అతి పురాతన అంటే 19వ మరియు 20వ శతాబ్దాల నాటి బొమ్మలు ఉన్నగొంబె తొట్టి అని పిలువబడే భవన సముదాయం ద్వారా ప్రవేశించాలి. ఇదే కాక, అక్కడ 81 కిలో గ్రాముల బంగారంతో అలంకరించబడిన ఒక చెక్క ఏనుగు అంబారి కూడా ఉంటుంది. గోంబె తొట్టి ముందర, ఏడు ఫిరంగులుంటాయి. ఈ ఫిరంగులను దసరా పండుగ వేడుకల ప్రారంభ మహోత్సవానికి పేలుస్తారు. ఈ పండుగలో 200 కిలోల బంగారు సింహాసనాన్ని ప్రజలకు ప్రదర్శిస్తారు. మైసూర్ మహారాజుల కుటుంబ సభ్యుల దుస్తుల గదులు, చిత్రపటాల గ్యాలరీ, ఆభరణాలు వంటివి కూడా చూడవచ్చు. ఈ రాజ భవనంలోని గోడలు సుమారు 14వ మరియు 20వ శతాబ్దాల మధ్య ప్రఖ్యాత చిత్రకారులు సిద్దలింగ స్వామి, రాజా రవివర్మ మరియు కె. వెంకటప్పలు రూపొందించిన పెయింటింగ్ ల చే అలంకరించబడ్డాయి.
మైసూర్ ప్యాలెస్
మైసూర్‌లో ఏడు ప్యాలెస్‌లు ఉన్నాయి. 1. అంబా విలాస్ ప్యాలెస్ (మైసూర్ ప్యాలెస్) ఈ ప్యాలెస్‌లో వోడయార్ రాజ కుటుంబం ఉండేది. ఒక సంవత్సరం కన్నా పాతది. దసరా పండుగ దీనికి ముందు జరగుతుంది. భారతదేశంలో తాజ్ మహల్ తర్వాత ఎక్కువగా సందర్శించే పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి.

Mysore Palace: India’s Only Illuminated Royal Structure
Located in Mysuru, Karnataka, the grand Mysore Palace was built by Krishnarajendra Wadiyar IV of the Wadiyar Dynasty between 1897-1912. Known for its Indo-Saracenic architecture blending Hindu,Rajput, and Gothic styles, it stands as a stunning three-storied structure with marble domes and a 145ft tower, surrounded by lush gardens.
The palace is famous for its music and light shows, especially during the vibrant Dasara festival. Nearly 100,000 incandescent lamps illuminate the palace, dazzling visitors on Sundays, holidays, and during Dasara.
2. లలిత్ మహల్ ప్యాలెస్. నాల్వడి కృష్ణరాజ వడయార్ ఆదేశాల మేరకు దీనిని నిర్మించారు.
3. జగన్మోహన్ ప్యాలెస్ ఇది 1861 లో నిర్మించబడింది. కొత్త ప్యాలెస్ నిర్మిస్తున్నప్పుడు రాజ కుటుంబం ఇక్కడ నివసించింది.
4. చేలువాంబ ప్యాలెస్ దీనిని నాల్వడి కృష్ణరాజ వడయార్ తన పుత్రి చేలువాజమ్మన్ని కోసం నిర్మించారు. నేడు ఇది సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) గా పనిచేస్తోంది.
5. జయలక్ష్మి విలాస్ ప్యాలెస్ దీనిని నాల్వడి కృష్ణరాజ వడయార్ తన పుత్రి జయలక్ష్మి అమ్మన్ని కోసం నిర్మించారు.
6. చిత్తరంజన్ ప్యాలెస్
7. రాజేంద్ర విలాస్ ప్యాలెస్. ఇది చాముండి కొండపై ఉంది. దీనిని వేసవి రాజభవనంగా రాజులు ఉపయోగించారు.
బృందావన్ గార్డెన్స్

మైసూర్ సందర్శించే యాత్రికులు మైసూర్ కు షుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న బృందావన గార్డెన్స్ తప్పక చూడాల్సిన ప్రదేశమే. దీనిని ఒకప్పుడు క్రిష్ణరాజేంద్ర టెర్రస్ గార్డెన్స్ అనేవారు. బృందావన గార్డెన్స్ క్రిష్ణరాజ సాగర్ డ్యామ్ క్రింది ప్రాంతంలో ఉంది. ఈ డ్యామ్ ను 1924 లో క్రిష్ణరాజ ఒడయార్ IV మహారాజు పేరుపై భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1924 నుండి 1932 సంవత్సరాల మధ్య నిర్మాణం చేశారు.
మైసూర్ నగరం దంతపు పని, పట్టు, గంధపు ఉత్పత్తులు, చెక్క బొమ్మలు, వంటివాటికి ప్రసిద్ధి. మైసూరు దసరా పండుగ మైసూర్ లో పది రోజులపాటు అతివైభవంగా నిర్వహిస్తారు. మైసూర్ ప్రజలే కాక, దేశ వివిధ ప్రాంతాలనుండి ప్రజలు ఈ దసరా పండుగ సమయంలో మైసూర్ కు వచ్చి వేడుకలలో పాల్గొని ఆనందిస్తారు. మైసూర్ పట్టణం కర్నాటక రాష్ట్రానికి దక్షిణ దిశగా సముద్ర మట్టానికి షుమరు 770 మీటర్ల ఎత్తున కావేరి మరియు కాబిని నదుల మధ్య ప్రాంతంగా ఉంది. సందర్శకులకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఈ పట్టణం బెంగుళూరుకు 140 కి.మీ. దూరంలో ఉంది. రోడ్డు, రైలు మార్గాలచే కలుపబడి ఉంది. మైసూర్ విమానాశ్రయం లేదా మందకల్లి విమానాశ్రయం ఒక స్ధానిక విమానాశ్రయంగా ఉండి, దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలను నిర్వహిస్తోంది.
Mysore 3-Day Itinerary

Day 1: Arrival & Exploring Central Mysore
Morning:
– Arrive in Mysore and check in at your hotel.
– Breakfast at the hotel.
Late Morning:
-Spend 1.5-2 hours exploring the Mysore Palace, a stunning architectural landmark. It is at a distance of 1-2 km from the city center.
Afternoon:
– Visit the Jaganmohan Palace Art Gallery for 1 hour, housing a vast collection of art and artifacts. It is located 1 km away from Mysore Palace.
Early evening:
– Visit the Chennakeshava Temple at Somanathapura, a magnificent example of Hoysala architecture. Spend 1-1.5 hours exploring the intricately carved temple. It is 35 km away from Mysore and roughly a 1-hour drive. Return by the temple’s closing (5:30 pm).
Evening:
Return to Mysore for dinner and rest at the hotel.
Day 2: Chamundi Hill, Zoo & Nanjangud
Morning:
– Drive to Chamundi Hill and enjoy panoramic views of the city. Also visit the famous Chamundi temple here. This place is located 12 km away from city center.
Afternoon:
– Spend 2-3 hours at Mysore Zoo, a well-known zoological park with a diverse range of animals and birds. It is approximately 8 km away from Chamundi Hill.
Evening:
– Visit the Nanjundeshwara Temple at Nanjangud, dedicated to Lord Shiva. Spend around 1-1.5 hours exploring this sacred site, also known as the “Kashi of the South.” It is a 25 km drive from city center and is 45 minutes drive.
Late Evening:
– Return to Mysore for dinner and relax at the hotel.
Day 3: Brindavan Gardens and Departure
Morning:
– Spend 2-3 hours exploring the beautiful Brindavan Gardens and Krishnaraja Sagar Dam. The garden is known for its symmetrically designed landscapes and fountains. It is located 20 km away from city center and is a 45 minutes drive.
Afternoon:
– Return to Mysore for hotel checkout and departure.
Raju's Resource Hub