కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌

కంప్యూటర్‌ డిజైన్, మెయింటెనెన్స్‌ అధ్యయనాన్ని కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌గా చెప్పొచ్చు. ఇందులో నైపుణ్యం సాధించాలంటే ఆపరేటింగ్‌ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్, పీసీల కాన్ఫిగరేషన్, కంప్యూటర్‌ అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్, ట్రబుల్‌ షూటింగ్‌ టెక్నిక్‌లపై పూర్తి అవగాహన అవసరం. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు ఆఫర్‌ చేస్తున్న సంస్థలు.. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది. గేట్‌/పీజీసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. గేట్‌/పీజీసెట్‌ ద్వారా 72 శాతం విద్యార్థులను, స్పాన్సర్డ్‌ కేటగిరీ కింద 28 శాతం మంది విద్యార్థులను తీసుకుంటారు. వెబ్‌సైట్‌: https://sit.jntuh.ac.in/   విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది. గేట్‌/ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్‌సైట్‌: www.andhrauniversity.info తమిళనాడులోని కలసలింగం యూనివర్సిటీ.. నెట్‌వర్క్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ అస్యూరెన్స్‌ అండ్‌…

Read More

రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులు

ప్రస్తుతం ఒకవైపు ఇంధన అవసరాలు పెరుగుతున్నాయి. మరోవైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ)పై అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, విండ్ ఎనర్జీ, టైడ్ అండ్ వేవ్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్‌మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ పాలసీస్ తదితర అంశాలు బోధిస్తారు. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు సోలార్-విండ్-న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫర్మ్స్, ఎన్‌జీవో, ఇంధనానికి సంబంధించిన…

Read More

ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్

ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ నిపుణులు భూకంపాలపై అధ్యయనం చేస్తారు. భూకంపాలను తట్టుకునే భవనాలు, వంతెనలు, అణు విద్యుత్ కేంద్రాలు, ప్రాజెక్టులు; పెట్రోకెమికల్, ఇతర పారిశ్రామిక ప్రాంగణాలు, బహుళ అంతస్తు భవనాలు తదితర నిర్మాణాలను డిజైన్ చేస్తారు. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు ఉపందుకోవడంతో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులో భాగంగా సెస్మిక్ హజార్డ్ అసెస్‌మెంట్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్ట్రక్చరల్ డైనమిక్స్, ఎర్త్‌కేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ తదితర అంశాలను బోధిస్తారు. కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు… రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రత్యేకంగా ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ విభాగం ఉంది. ఇది సిస్మిక్ వల్నరబిలిటీ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్; సాయిల్ డైనమిక్స్; స్ట్రక్చరల్ డైనమిక్స్ స్పెషలైజేషన్లలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: సివిల్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన బ్రాంచ్‌లో…

Read More

మిసైల్ సైంటిస్ట్

మిసైల్ సైంటిస్ట్ ప్రధా నంగా మిసైల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్య కలాపాల్లో పాల్గొంటాడు. మిసైల్ సైంటిస్ట్‌గా స్థిరప డేందుకు అవసరమైన ప్రా థమిక అర్హత…ఇంజనీరింగ్ డిగ్రీ. ఏరోస్పేస్/ఎలక్ట్రికల్/మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ /మెటలర్జికల్ తదితర బ్రాంచ్‌ల్లో ప్రథమ శ్రేణిలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మిసైల్ వంటి విభాగాల్లో సైంటిస్ట్‌గా స్థిరపడొచ్చు. దేశంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో).. ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన రక్షణ వ్యవస్థలు, పరికరాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా డీఆర్‌డీవో వివిధ మార్గాల్లో సైంటిస్ట్‌ల రిక్రూ ట్‌మెంట్ చేపడుతుంది. వీటిద్వారా నచ్చిన విభాగంలో సైంటిస్ట్‌గా అడుగుపెట్టొచ్చు.నియామక విధానం :డెరైక్ట్ ఎంట్రీ: సైంటిస్ట్ ఎంట్రీ టెస్ట్ (సెట్) ద్వారా క్లాస్‌వన్ ఆఫీసర్ పోస్టుల (గ్రూప్ ఏ)ను భర్తీ చేస్తోంది.అర్హత: కెమికల్/కంప్యూటర్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/మెకాని కల్ స్పెషలైజేషన్లతో బీఈ/బీటెక్ ప్రథమ శ్రేణిలో…

Read More

మెషీన్ లెర్నింగ్

అల్గారిథమ్స్, స్టాటిస్టికల్ మోడళ్ల శాస్త్రీయ అధ్యయనమే మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్). దీన్ని కృత్రిమ మేధ (ఏఐ)కు ఉప విభాగంగా చెప్పొచ్చు. ప్రతిదానికీ ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరంలేకుండా.. కంప్యూటర్లు అంతకుముందు నిక్షిప్తమైన డేటా ఆధారంగా వాటంతటవే నిర్ణయాలు తీసుకునేలా చేయడమే మెషీన్ లెర్నింగ్. డేటాసైన్స్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ సమ్మిళితంగా మెిషీన్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉంటాయి. నైపుణ్యాలు: మెషీన్ లెర్నింగ్ కెరీర్ దిశగా వెళ్లాలనుకునేవారు కంప్యూటర్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ స్కిల్స్, డేటా మోడలింగ్, సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్ తదితర అంశాల బేసిక్స్‌పై పట్టుసాధిస్తే మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్ పరంగా మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది. ఎంఎల్ ఔత్సాహికులు పైథాన్, జావా, స్కాలా, సీ++, జావాస్క్రిప్ట్ నైపుణ్యాలపైనా దృష్టిసారించాల్సి ఉంటుంది. కోర్సులు: ఐబీఎం, సిస్కో, అమెజాన్,…

Read More

ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌

ఏరోస్పేస్ ఇంజనీర్లు ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ల డిజైన్, డెవలప్‌మెంట్, కన్‌స్ట్రక్షన్, టెస్టింగ్, రీసెర్చ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్.. ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌ల కలయిగా ఉంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ భూ వాతావరణంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన అంశాల గురించి పేర్కొంటే.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ భూ వాతావరణానికి వెలుపల ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన విషయాలను వివరిస్తుంది.అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఐఐటీలు జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తుంటే… ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు స్వీయ ప్రవేశ విధానాన్ని అమలుచేస్తున్నాయి.గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సు: బీటెక్.. డ్యూయల్ డిగ్రీ (బ్యాచిలర్+మాస్టర్స్)ఉన్నత విద్య :ఎంటెక్ (స్పెషలైజేషన్ కోర్సులు), పీహెచ్‌డీ పోగ్రామ్స్.ఇన్‌స్టిట్యూట్స్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఖరగ్‌పూర్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, షిబ్‌పూర్, పశ్చిమ బెంగాల్.

Read More

ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌

నిర్మాణాల ప్లానింగ్, డిజైనింగ్‌ల అధ్యయనమే.. ఆర్కిటెక్చర్. అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, ఎయిర్‌పోర్టులు, స్టేడియాలు, స్కూళ్ల నిర్మాణంలో ఆర్కిటెక్చర్‌ల పాత్ర ఎంతో కీలకం. దీంతో ఆర్కిటెక్చర్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇంటర్ ఎంపీసీ అర్హతతో ఆర్కిటెక్చర్ కోర్సులో ఆరంగేట్రం చేయొచ్చు.కోర్సు పేరు: బీఆర్క్/బీప్లానింగ్ కోర్సు కాలవ్యవధి: ఐదేళ్లు అర్హత: అకడెమిక్ స్థాయిలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టడానికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూపుతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైతే బీఆర్క్‌కు అర్హత ఉన్నట్లే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ కోర్సును అందిస్తున్నాయి. అవి నిర్వహించే ప్రవేశ పరీక్షల ఆధారంగా సీటు సొంతం చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలు:నాటా: ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో ప్రవేశం కల్పించే అన్ని ఎంట్రెన్స్‌ల్లో ‘నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా)’ అత్యంత ప్రముఖమని చెప్పొచ్చు. దీన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఆర్కిటెక్చర్, అకాడమిక్ కౌన్సెల్…

Read More

ఎంఎస్

ఎంఎస్(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) యూకేలో ఎంఎస్ కోర్సుల్లో ఏ స్పెషలైజేషన్ అయినా.. 16 నెలల నుంచి రెండేళ్ల వ్యవధిలో ఉంటుంది. టాప్ యూనివర్సిటీల్లో మాత్రం రెండేళ్ల వ్యవధిలోనే కోర్సుల బోధన సాగుతుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌కి సంబంధించి దాదాపు నలభైకి పైగా స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో.. ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రో ఆప్టికల్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ లైటింగ్ సిస్టమ్స్, లైటింగ్ డిజైన్ స్పెషలైజేషన్స్‌కు మంచి పేరుంది. వీటితోపాటు ఇటీవల కాలంలో పవర్ జనరేషన్ అండ్ సప్లయ్, రోబోటిక్ సిస్టమ్స్ వంటి ఆధునిక స్పెషలైజేషన్స్‌ను కూడా యూనివర్సిటీలు అందిస్తున్నాయి. కెరీర్ అవకాశాల కోణంలో ఇప్పుడు యూకేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పీజీ ఉత్తీర్ణులకు డిమాండ్ నెలకొంది. ఈ విభాగంలో మానవ వనరుల డిమాండ్‌కు సరిపడే రీతిలో నైపుణ్యాలున్న అభ్యర్థులు లభించకపోవడమే…

Read More

మొబైల్ యాప్ డెవలప్‌మెంట్

ప్రస్తుతం చదివిన డొమైన్‌తో సంబంధం లేకుండా.. అన్ని రకాల కోర్సులు పూర్తిచేసిన వారికి చక్కటి ఉపాధి కల్పిస్తున్న విభాగం.. మొబైల్ యాప్ డెవలప్‌మెంట్. పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్స్ వినియోగం.. మొబైల్ గేమ్స్‌కు యువత ఆదరణతోపాటు.. యాప్ ఆధారిత సేవలవైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న నేపథ్యంలో యాప్ డెవలపర్స్‌కు మంచి డిమాండ్ నెలకొంది. దీనికి సంబంధించి ప్రత్యేక కోర్సులు, శిక్షణ ద్వారానే యాప్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలు సొంతమవుతాయి. ముఖ్యంగా యాప్ డెవలప్‌మెంట్ విభాగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటే.. సీ, సీ++, ఆబ్జెక్టివ్ సి వంటి కంప్యూటర్ లాంగ్వేజ్‌ల ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎంతో ముఖ్యం. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు యాప్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్ సైతం యాప్ డెవలప్‌మెంట్‌పై శిక్షణనిస్తున్నాయి. ఉడెమీ, ఎడ్యురేక, ఎడెక్స్ తదితర…

Read More

After M.P.C

ఇంజనీరింగ్ vs   డిగ్రీ పస్తుతం బీటెక్, బ్యాచిలర్ డిగ్రీలో ఏది బెస్ట్ అంటే.. జాబ్ మార్కెట్ కోణంలో బీటెక్‌కే తొలి ప్రాధాన్యం అని చెప్పొచ్చు. బీటెక్‌లో మీరు ఎంపిక చేసుకునే బ్రాంచ్ కూడా కెరీర్ పరంగా కీలకం. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. బీటెక్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచ్‌ల విద్యార్థులకు జాబ్ మార్కెట్‌లో కొంత ప్రాధాన్యం ఉంటోంది. ఈ బ్రాంచ్‌ల విద్యార్థులు అకడమిక్స్‌కే పరిమితం కాకుండా.. తాజా ట్రెండ్స్‌కు అనుగుణంగా నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. బీటెక్ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3-డి డిజైన్ ప్రింటింగ్ తదితర అంశాలపై అవగాహన పొందాలి. ఇలాంటి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. బీటెక్‌లో ఏ బ్రాంచ్‌లో చేరినా ఉద్యోగం పొందడం సులభమే. ఈ విద్యా సంవత్సరంలో బీటెక్‌లో చేరాలనుకుంటే.. సీఎస్‌ఈ…

Read More

ఆస్ట్రానమీ

విశ్వం, విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతల అధ్యయనాన్ని ఆస్ట్రానమీ అంటారు. ఆస్ట్రోనమిస్ట్లు నక్షత్రాలు ఎలా పుడతాయి..వాటి ప్రత్యేకతలు తదితర అంశాలతోపాటు పలు ఖగోళ అంశాలపై అధ్యయనం, పరిశోధనలు చేస్తుంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్లో ప్రతిభావంతులైన అభ్యర్థులు ఆస్ట్రానమీ వైపు వెళ్తే మంచి భవిష్యత్ ఉంటుంది. ఆస్ట్రానమీని కెరీర్గా ఎంచుకోవాలనుకొనే వారు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదవాలి. అనంతరం డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్, ఆస్ట్రానమీ సబ్జెక్టులతో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ(బీఎస్సీ లేదా బీటెక్)ని అభ్యసించవొచ్చు. కొన్ని యూనివర్సిటీలు ఆస్ట్రోఫిజిక్స్ స్పెషలైజేషన్ను అందిస్తున్నాయి. ఇది ఫిజిక్స్, ఆస్ట్రానమీల కలయికగా ఉంటుంది. అనంతరం సంబంధిత సబ్జెక్టుల్లో రెండేళ్ల పీజీ, తదనంతరం పీహెచ్డీని పూర్తి చేస్తే ఆస్ట్రానమిస్ట్గా చక్కటి కెరీర్ను సొంతమవుతుంది. పీజీ కోర్సులు.. ఎంఎస్సీ ఆస్ట్రానమీ ఎంఎస్సీ ఆస్ట్రోఫిజిక్స్ ఎంఎస్సీ ఇన్ మెటీరియాలజీ పీహెచ్డీ ఇన్ ఆస్ట్రానమీ పీహెచ్డీ ఇన్ ఆస్ట్రోఫిజిక్స్…

Read More

ఐటీ కొలువులకు.. కలిసొచ్చే కోర్సులు ఇవే..!

లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల లక్ష్యం..ఐటీ రంగంలో ఉద్యోగం! మరి ప్రస్తుతం ఐటీలో జాబ్ మార్కెట్ ఎలా ఉంది? కొలువు ఖాయం చేసుకోవాలంటే.. ఎలాంటి స్కిల్స్ అవసరం? నియామకాల పరంగా భరోసా కల్పించే కోర్సులు ఏవి? త్వరలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకోనున్న విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్నలు ఇవి!!  ఐటీ రంగంలో ప్రస్తుతం జాబ్ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. కోర్ అంశాలైన కోడింగ్, కంప్యూటర్ లాంగ్వేజెస్ మొదలు బ్లాక్‌చైన్, ఐవోటీ వరకూ.. సరికొత్త టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఐటీ ఉద్యోగార్థులు ఎమర్జింగ్ టెక్నాలజీపై పట్టుసాధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు దక్కించుకోవడానికి మార్గాలు, నేర్చుకోవాల్సిన కోర్సుల గురించి తెలుసుకుందాం… ముఖ్యంగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, జావా, రోబోటిక్స్, పైథాన్, సైబర్ సెక్యూరిటీ, డేవాప్స్, క్లౌడ్ సర్వీసెస్ వయా ఎంఎస్ ఎజ్యూర్, ఐఓటీ, క్లౌడ్ టెక్నాలజీ…

Read More

సాఫ్ట్‌వేర్ కొలువు…ఇలా సులువుగా సాధించండి !

ఐటీ కంపెనీల్లో కొలువు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తోనే సాధ్యమని భావిస్తున్నారా?! మీ కాలేజీలో క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించకుంటే.. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కల్లేనని ఆందోళన చెందుతున్నారా..?! బీటెక్/బీఈ వంటి అర్హతలున్న వారికే ఐటీ ఉద్యోగం లభిస్తుందనే భావనలో ఉన్నారా? అయితే.. ఇప్పుడు వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు! ఎందుకంటే.. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ టెస్ట్‌ల్లో సత్తాచాటితే చాలు.. ఐటీ జాబ్ సొంతమవుతుంది! టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలు ఆన్‌లైన్ టెస్టుల ద్వారా యంగ్ టాలెంట్‌కు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్న ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లతో ప్రయోజనాలు, ఆయా పరీక్షల తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం…‘ఐటీ కంపెనీల్లో కాలు పెట్టాలంటే క్యాంపస్ డ్రైవ్స్‌లో సత్తా చాటితేనే సాధ్యం. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు అవకాశం లేకుంటే..ఐటీ కొలువు కష్టమే’-ఇది సాధారణంగా వినిపించే అభిప్రాయం.…

Read More

డేటాసైన్స్

కళ్లు చెదిరే ప్యాకేజీలతో…ఈ ఏడాదిలో 1.5 లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు! కళ్లు చెదిరే ప్యాకేజీలతో…ఈ ఏడాదిలో 1.5 లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు! ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో మంచి ఉద్యోగం అందుకోవాలంటే.. ఏ కోర్సులో చేరాలి..ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి.. ఏ విభాగంలో ఉద్యోగావకాశాలెక్కువ?! ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానమే.. డేటాసైన్స్! 2020లో డేటాసైన్స్ విభాగంలో అదిరిపోయే అవకాశాలు లభిస్తాయని అంచనా..!  ఇటీవల కాలంలో.. ఈ రంగం.. ఆ రంగం.. అనే తేడా లేకుండా అన్నింటా డేటాసైన్స్ దూసుకుపోతోంది. ఇదే విషయం పలు సర్వేల్లో స్పష్టమైంది. ఇప్పటికే ఎమర్జింగ్ కెరీర్‌గా వెలుగొందుతున్న డేటాసైన్స్.. 2020లో మరింత హాట్‌ఫేవరెట్‌గా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. డేటాసైన్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం.. కళ్లు చెదిరే ప్యాకేజీలు : డేటాసైన్స్.. దీన్నే డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ అని కూడా…

Read More

‘ఐపాట్’

దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలతో బయటకు వస్తున్నారు. వీరిలో ఉద్యోగాలు లభించేది కొందరికే. ఐఐటీల్లో ఎంటెక్లో ప్రవేశాలకు నిర్వహించే ‘గేట్’ స్కోర్ ఆధారంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాలు జరుపుతున్నాయి. మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఇలాంటి పరీక్ష ఏదైనా ఉందా? అంటే.. ఇంతకాలం ‘లేదు’అనే సమాధానమే వచ్చేది. కాని ఇకపై ప్రైవేటు కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు వీలు కల్పించే పరీక్ష ఐపాట్ను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తొలిసారిగా నిర్వహించనుంది. ఇండస్ట్రియల్ ప్రొఫిషియన్సీ అప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీర్స్’ (ఐపాట్)లో ప్రతిభ చూపిన ఇంజనీరింగ్ అభ్యర్థులు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించొచ్చు. ఈ నేపథ్యంలో… ‘ఐపాట్’ పరీక్ష తీరుతెన్నులపై ప్రత్యేక కథనం… దేశంలో ఏటా 10లక్షల మందికిపైగా ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకుంటున్నారు. వీరిలో అధికశాతం మంది ఉద్యోగాల…

Read More

ఎంటెక్

ఐఐటీల్లో ఎంటెక్ సీటు కావాలంటే సీఓఏపీలో నమోదు కావాల్సిందే! గేట్లో మంచి పర్సంటైల్ వచ్చిందా.. ఐఐటీల్లో ఎంటెక్ చేయాలనుకుంటున్నారా.. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు వైపు మనసు లాగుతోందా.. అయితే మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంటెక్ సీటు, లేదా ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లో కొలువు దక్కాలంటే.. కామన్ ఆఫర్ యాక్సప్టెన్స్ పోర్టల్ (సీఓఏపీ)లో నమోదు చేసుకోవాల్సిందే!! కరోనా లాక్డౌన్ కారణంగా తాజాగా సీఓఏపీ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా సీఓఏపీ పోర్టల్లో దరఖాస్తు విధానం, అర్హతలు, ప్రయోజనాలపై ప్రత్యేక కథనం.. ఐఐటీల్లో ఎంటెక్ ప్రవేశాలకు గేట్ స్కోరు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కో ఐఐటీకి వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థులు తమ ప్రాథమ్యాల పరంగా రాజీ పడే ఆస్కారం ఉంది. ఈ క్రమంలోనే కామన్ ఆఫర్ యక్సప్టెన్స్…

Read More

బీటెక్ తర్వాత క్యాట్ లేక గేట్ ఏది చేయాలి.

బీటెక్ పూర్తవ్వబోతోందా..! మరి ఆ తర్వాత లక్ష్యం ఏమిటి.. గేట్పై గురిపెట్టాలనుకుంటున్నారా.. లేదా క్యాట్లో సత్తా చాటాలనే ఆలోచన ఉందా..?! అసలు ఈ రెండింట్లో దేనికి హాజరవ్వాలో తేల్చుకోలేకపోతున్నారా..! త్వరలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకోనున్న విద్యార్థులకు ఉపయోగపడేలా క్యాట్ లేదా గేట్లో దేన్ని ఎంచుకోవాలి.. ఎవరికి ఏది బెటర్… క్యాట్, గేట్లలో ఏది తేలిక.. ఏది కఠినం..? క్యాట్ సానుకూలతలు–ప్రతికూలతలు.. గేట్ సానుకూలతలు–ప్రతికూలతలపై ప్రత్యేక కథనం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు ఉన్నత విద్య పరంగా ప్రముఖంగా అందుబాటులో ఉన్న మార్గాలు… గేట్, క్యాట్. క్యాట్తో ఎంబీఏ, గేట్తో ఎంటెక్లో చేరొచ్చు. బీటెక్ అర్హత తో క్యాట్, గేట్లకు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ రెండు పరీక్షల స్వభావం భిన్నంగా ఉంటుంది. వీటిద్వారా చేరే కోర్సులు, కెరీర్లు పూర్తి విభిన్నం. కాబట్టి ఈ రెండింట్లో ఒకదాన్ని ఎంచుకొనే ముందు అభ్యర్థులు…

Read More

ఇంజనీరింగ్.. ఈ బ్రాంచులు చదివితే పోటీ తక్కువ.. అవకాశాలు ఎక్కువ

ఇంజనీరింగ్లో ఎక్కువ మంది విద్యార్థుల ఆప్షన్లు.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లే. ఈ కోర్ బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్ పూర్తిచేస్తే భవిష్యత్తుకు ఢోకా ఉండదనే భావనే దీనికి కారణం. అయితే బీటెక్ స్థాయిలో వినూత్న బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్ చేయాలనుకునేవారికి.. ఏరోనాటికల్, మైనింగ్, కెమికల్, మెటలర్జికల్, బయోటెక్నాలజీ తదితర స్పెషలైజ్డ్ బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి. స్వీయ ఆసక్తితోపాటు అవకాశాలపై అవగాహన ఉన్న విద్యార్థులు ఈ వినూత్న బ్రాంచ్లను ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల వివరాలు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం.. కెమికల్ ఇంజనీరింగ్.. రసాయన శాస్త్రాన్ని(కెమిస్ట్రీ) టెక్నాలజీకి అనుసంధానించే ప్రక్రియలోంచే ‘కెమికల్ ఇంజనీరింగ్’ ఆవిర్భవించింది. సిరామిక్స్, ఇంధనాలు, పెట్రోకెమికల్స్, ఎరువులు, ప్లాస్టిక్స్, పేలుడు పదార్థాలు వంటి ఉత్పత్తుల తయారీలో కెమికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కెమికల్…

Read More

ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్ మంచిది.. దేనికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ

ఈతరం విద్యార్థులు చదువుతున్న… చదవాలనుకుంటున్న కోర్సు… ఇంజనీరింగ్. ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌లు అనేకం. దీంతో విద్యార్థుల్లో ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలి.. ప్రస్తుతం అవకాశాల పరంగా ఏ బ్రాంచ్‌కు స్కోప్ ఎక్కువ.. ఎవరికి ఏ బ్రాంచ్ సూట్ అవుతుంది?! తదితర సందేహాలు విద్యార్థులకు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో.. ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్ బ్రాంచ్‌లు, వాటి ప్రత్యేకతలు, ఉద్యోగ అవకాశాలు, కెరీర్ స్కోప్ గురించి తెలుసుకుందాం.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్.. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ఈసీఈ)లో విద్యుత్ ప్రవాహం, సెమి కండక్టర్లు, కండక్టింగ్ అండ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్స్ తదితరాలపై ప్రధానంగా దృష్టిపెడతారు. సమాచారం, ఇంధనం, వ్యవసాయ రంగం సహా ప్రతి విభాగంలో ప్రస్తుతం ఈసీఈ పాత్ర కీలకంగా మారుతోంది. ఉక్కు, పెట్రోలియం, రసాయన పరిశ్రమల్లోనూ, ఆరోగ్య రంగంలోనూ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తప్పనిసరి. సురక్షిత రవాణా,…

Read More

రోబోటిక్స్‌

రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తు మీదే..! ప్రస్తుత కరోనా కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు, యువత ఆన్‌లైన్ విధానంలో రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో రోబోటిక్స్ హవా కొనసాగనుందనే అంచనాల నేపథ్యంలో రోబోటిక్స్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. మూక్స్ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా రోబోటిక్స్ కోర్సుల్లో చేరుతున్నారు. రోబోటిక్స్ కోర్సుల పట్ల యువతలో క్రేజ్‌కు భవిష్యత్ అవకాశాలు ఎత్తయితే.. డ్రోన్స్, రోబోల తయారీల్లో ఉండే ఫన్ మరొక కారణంగా నిలుస్తోంది. అందుకే కొద్దికాలంగా రోబోటిక్స్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది.అన్ని రంగాల్లో రోబో… రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో రోబోటిక్స్ సేవలు అత్యంత కీలకంగా మారనున్నాయి. దీంతో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాల పరంగా ఢోకా ఉండదని అంచనా. ఫార్చ్యూన్ మ్యాగజీన్ 2025 నాటికి తయారీ రంగంలో ఆటోమేషన్…

Read More

సైబర్ సెక్యూరిటీతో బంగారు భవిత

సాంకేతికత అనే మంత్రం ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది. నూతన టెక్నాలజీల ఆవిష్కరణతో సమస్తం డిజిటల్ మయమవుతోంది. అయితే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు సౌలభ్యాన్నే కాదు.. సవాళ్లనూ వెంట తెస్తున్నాయి. ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆవిష్కృతమైనదే..సైబర్ సెక్యూరిటీ. కరోనా లాక్‌డౌన్ కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు సైబర్ సెక్యూరిటీ విభాగాల్ని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో.. సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా మారేందుకు అర్హతలు.. చదవాల్సిన కోర్సులు.. సైబర్ సెక్యూరిటీ కెరీర్‌పై ప్రత్యేక కథనం.. గ్రోత్ ఘనమే.. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2025 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2025 నాటికి భారత ఐటీ మార్కెట్ 350 బిలియన్ డాలర్లకు, అందులో సైబర్ సెక్యూరిటీ సేవల వాటా 10 శాతానికి చేరుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 5కోట్ల మంది…

Read More

ఇంజనీరింగ్

వినూత్న కోర్సులు, విభిన్న ఉద్యోగావకాశాలకు వేదిక ఇంజనీరింగ్. అందుకే ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థుల హాట్ టాపిక్.. ఇంజనీరింగ్! దాంతోపాటు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు దేశ విదేశాల్లో లభిస్తున్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయ్. దేశవ్యాప్తంగా సుమారు మూడువేల ఐదు వందల ఇంజనీరింగ్ కాలేజీల్లో పదిహేను లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐఐటీల వాటా మాత్రం పదివేలే.  కాలేజీ ఎంపికలో…మౌలిక సదుపాయాలు:ఒక ఇన్‌స్టిట్యూషన్ లేదా కళాశాల విజయంలో మౌలిక సదుపాయాల పాత్ర కీలకం. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ఎక్విప్‌మెంట్, లైబ్రరీ, హాస్ట ల్, సెమినార్ రూమ్స్, ఇంటర్నెట్, ట్రాన్స్‌పోర్ట్, ప్లే గ్రౌండ్ మొదలైనవి చాలా అవసరం.ఫ్యాకల్టీ:ఇంజనీరింగ్ కాలేజీకి మౌలిక సదుపాయాలు అస్థిపంజరమైతే… ఫ్యాకల్టీ శరీరం అని చెప్పొచ్చు. విద్యార్థిని సరైన దిశలో నడిపించడంలో ఫ్యాకల్టీది ప్రధాన బాధ్యత. ఫ్యాకల్టీ బృందం సీనియర్, జూనియర్ల…

Read More

గ్రేట్ కెరీర్‌కు కేరాఫ్ ఎంపీసీ

జియాలజిస్టుగా విలువైన గనులను కనుక్కోవాలనుందా? ఐఫోన్ సృష్టికర్త స్టీవ్‌జాబ్స్‌ను మించిన గుర్తింపును కోరుకుంటున్నారా? ప్రపంచంలోనే అపర కుబేరుడిగా కీర్తికెక్కిన బిల్‌గేట్స్‌లా పేరు తెచ్చుకోవాలనుందా? లేదా సివి రామన్‌లా నోబెల్ బహుమతిని పొందాలనుందా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ‘ఎస్’ అయితే మీరు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూపును ఎంచుకోవాలి.పదో తరగతి తర్వాత… ఏంటి? అనే ప్రశ్న ఎదురైతే ఎన్నో కోర్సులు.. ఐటీఐ, పాలిటెక్నిక్, హోటల్ మేనేజ్‌మెంట్, సెట్విన్ కోర్సులు, స్వయం ఉపాధినందించే వివిధ కోర్సులు పదో తరగతి పాసైన విద్యార్థికి స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కువ మంది చూపు మాత్రం ఇంటర్మీడియెట్‌లో చేరి ఎంపీసీ గ్రూప్‌ను ఎంచుకోవడం. ఈ గ్రూప్‌కు ఉన్నటువంటి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మరే గ్రూప్‌కు లేవంటే అతిశయోక్తి కాదు! ఈ నేపథ్యంలో ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ను తీసుకున్న విద్యార్థికి ఉండే అవకాశాల విశ్లేషణ..ఎంపీసీ గ్రూప్…

Read More

Differences between Metallurgical and Mining Engineering

Metallurgical Engineering Mining Engineering Metallurgical Engineering mainly deals with the extraction of metals from their respective ores. Metallurgical engineers work mostly at the plants or industries. Core Areas: Basic Hydrometallurgy, Basic Physical Metallurgy, Basic Pyrometallurgy, Corrosion, Electrometallurgy, Flotation, Minerals processing, Refractory materials, Welding metallurgy Job areas: Metallurgists are employed in foundries, heat treatment shops, rolling mills, etc. industries. They are also employed in research laboratories, industries and plants extracting and processing metals like iron and steel, nickel, tin, copper, zinc, aluminium etc. Top Recruiters: SAIL, Visakhapatnam Steel Plant, Jindal Steel…

Read More

Difference between Mechanical and Production Engineering

Mechanical Engineering Production Engineering Mechanical engineering is concerned with mechanical systems, thermodynamics, and kinematics. Mechanical engineers’ work includes development from miniature components to extremely large plant, machines or vehicles. Mechanical Engineering deals with design, manufacture, installation and operation of engines, machines, robotics, heating & cooling systems and manufacturing processes. Core Areas: Statics & Dynamics Control, Thermodynamics and Heat Transfer, Fluid Mechanics, Machine Design, Strength of Materials, Materials Science, Theory of Design Job areas: Mechanical engineers work in the automotive, aerospace, chemical, computer, communication, paper, power generation and almost all manufacturing companies. Top…

Read More

Difference Between ECE and EEE

Electronic and Communication Engineering Electrical and Electronics Engineering It deals with low voltage ( It contains basics on electrical machines and more on integrated circuits and communication systems ECE uses the scientific knowledge of the behavior and effects of electrons to develop devices, systems, or equipment that uses electricity as part of its driving force. Core Areas: It deals with analog transmission, basic electronics, solid state devices, microprocessors, digital and analog communication, analog integrated circuits, satellite communication, microwave engineering, antennae and wave progression. It also deals with the manufacturing of electronic…

Read More

Difference between CSE and IT

Computer Science Engineering Information Technology It refers to the field of computation. Computer Science is the mixture and application of Applied Mathematics, Electrical Engineering, and “Complexity Theory/Algorithms Computer Science is the study of computation and computer technology, hardware, and software. Core Areas: Algorithms and Data Structure, Architecture, Artificial Intelligence and Robotics, Database and Information Retrieval, Human-Computer Communication, Numerical and Symbolic Computation, Operating Systems, Programming Languages and Software Methodology and Engineering Computer science engineering refers to the processes used to create usable computer programs and applications together with all theory behind…

Read More

Recruitment through the UPSC

The UPSC holds an all-India competitive examination, known as the Combined Defence Services Examination (CDSE), twice a year. University graduates are eligible to appear in the examination. Successful candidates join the respective training academies, viz., the Indian Military Academy (IMA) for the Army, the Naval Academy for the Navy and the Air Force Academy for the Air Force.Indian Army:Entry options to Indian Army after graduation in engineering are as follows Technical Graduate Course (Engineers) Short Service Commission Non Technical Men Short Service Commission Non Tech Women Short Service Commission Technical…

Read More

గేట్ స్కోర్, ఇంటర్వ్యూ

Graduate Aptitude Test in Engineering (GATE) is an all India examination administered and conducted jointly by the Indian Institute of Science and seven Indian Institutes of Technology on behalf of the National Coordination Board – GATE, Department of Higher Education, Ministry of Human Resource Development (MHRD), Government of India. GATE  Score as the 1st selection criterion The GATE is conducted for admission into Masters Degree in IITs and IISc. However, the scenario has changed now as major companies are using it as a platform to identify the suitable engineers/researchers in…

Read More

Jobs after graduation (B. Tech)

Looking for a job opportunity after B. Tech is a good option. Based on your branch, you can enter into a company suitable for you. Students should be very cautious if they are interested to do a job, as the competition is high. It is better to get job in a company through campus placements, as it is difficult to get job once you are out of the college. Irrespective of the branch, software industry offers jobs the students based on their communication and aptitude skills in campus placements.Government Jobs:Apart…

Read More