కోనసీమకు కొబ్బరి ఎలా వచ్చింది, ఎలా విస్తరించింది

కోనసీమ అనగానే అందరికీ ముందుగా కొబ్బరి చెట్లే గుర్తుకువస్తాయి. లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పరచుకున్న కొబ్బరి తోటలు, గోదావరి పంట కాలువలు, పచ్చని పొలాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది. కోనసీమ వాసుల జీవితాలు కొబ్బరి సాగుతో బాగా ముడిపడిపోయాయి. కోనసీమ నుంచి కొబ్బరి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. కానీ, రవాణా సదుపాయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల తగినంత అభివృద్ధి జరగలేదన్నది కోనసీమ వాసుల ఆవేదన. కొబ్బరి ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు కోరుతున్నారు. ఇటీవల కొబ్బరికి పెరుగుతున్న తెగుళ్లకు తగిన విరుగుడు సకాలంలో అందించే ఏర్పాట్లు చేయాలని ఆశిస్తున్నారు. కొట్టుకువచ్చాయా? కోనసీమకు, కొబ్బరి తోటలకు మూడు శతాబ్దాలకు పూర్వమే అనుబంధం ఏర్పడిందని చెబుతారు. కోనసీమ భౌగోళికంగా ఓ ద్వీపంలా ఉంటుంది. మూడు వైపులా గోదావరి పాయలు ప్రవహిస్తుంటాయి. వశిష్ట,…

Read More