విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 15 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. మనదేశంలో అయితే రోజురోజుకూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో విద్యా సంవత్సరం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల విద్యా సంవత్సరం సెప్టెంబర్ 15న మొదలుకానుంది. ఇంతకు ముందు ప్రథమ సంవత్సరంలో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబర్ ఒకటి, ఇతర విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ షెడ్యూల్ను సవరించింది. కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తరగతుల (విద్యా సంవత్సరం)ను ప్రారంభించాలని పేర్కొంది.
Read More
You must be logged in to post a comment.