భారతదేశం – ముస్లింల పరిపాలన

ఆఫ్గనిస్తాన్ కు చెందిన మొహమద్ గజనీ మొదటగా భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేసాడు కాని రాజ్యస్థాపన చేయలేదు.ఇతని దండయాత్ర మెదటిగా క్రీ.శ.1001లో ప్రారంభమైంది. తొలిసారిగా నేటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ల మీద దండయాత్ర చేసి ఆక్రమించుకున్నాడు. తరువాత 1005లోను, 1006లోను, 1013లోను, 1014లో స్థానేశ్వమీద 1015లో కాశ్మీర్ మీద 1018లో మధుర మీద 1025లో సోమనాధ్ పాలకుడు భీమ మీద దాడి చేసి పోమనాథ దేవాలయాన్ని థ్యంసం చేయటమే కాకుండా అప్పట్లోనే 2 మిలియన్ల దీనార్ల ఖరీదుచేసి సొమ్మును లూటీ చేసి తీసుకెళ్లాడు. ఈ విధంగా మొత్తం 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేసా అపారమైన భారతేదేశ సంపదను కొల్లగొట్టాడు.

భారతదేశంలో అనేక దేవాలయాలను ధ్వంసం చేసి అపారమైన సంపదను కొల్లగొట్టాడు. వాటిలో ద్యాదశ లింగాలలో ఒకటైన సోమనాధ్ దేవాలయం కూడా ఉంది. గజనీ తరువాత మహమద్ ఘోరి భారతదేశం మీద దండయాత్ర చేసాడు. ఇతని దండయాత్ర తొలిసారిగా 1175 సం.లో ప్రారంభమైంది. 1178సంలో గుజరాత్ మీద దండయాత్ర చేసాడు. 1179లో పంజాబ్, లీహోర్ ల మీద, తరువాత 1191లో తరాన్ మీద వరుసగా దండయాత్రలు చేసాడు.

1192 తిరిగి భారతదేశం మీద 1,20,000 సైన్యంతో దండయాత్ర చేసి నాటి పాలకుడైన ఫృధ్వీరాజ్ ను ఓడించి బందీ చేసి చంపించాడు దీనితో నాటి ఢిల్లీ, అజ్మీర్ ఇతని వశమయ్యాయి. తరువాత గుజరాత్, బుందేల్ ఖండ్, బెంగాల్, బీహార ప్రాంతాల మీద కూడా దండయాత్ర చేసి ఆక్రమించుకున్నాడు. తన ప్రతినిధిగా తన బానిస ఐన కుతుబుద్దీన్ ఐబక్ ను ఢిల్లీ సింహాసనం మీద అధిష్టింపచేసి ఘోరీ 1206లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్లే దారిలో నేటి పాకిస్తాన్ లోని ధమ్యక్ జిల్లాలో తెలియని వారిచే హత్య చేయబడ్డాడు. ఆనాటి రాజపుత్రుల అనైక్యత వలన భారతదేశంలో ముస్లింల పరిపాలనకు బీజం పడింది.

భారతదేశంలో ముస్లింల పరిపాలన క్రీ.శకం 1206 సంవత్సరంలో టర్కీ ముస్లిం ఐన కుతుబుద్దీన్ ఐబక్ తో ప్రారంభమై 1526 వరకు సాగింది. తరువాత 1526లో మొగల్ దండయాత్రతో మొగల్ ల ప్రారంభమై 1857తో అంతమైంది.

Delhi Sultanate…Slave Dynasty…1206 to 1290
Qutub-ud-din-Aibak…1206 to 1210

కుతుబుద్దీన్ ఐబక్…భారతదేశంలో బానిస వంశాన్ని స్థాపించి ఢిల్లీ సింహాసనం ఆధిఫ్టించిన మొదటి ముస్లిం. ఇతని పరిపాలనా కాలం క్రీ.శకం 1206 నుండి 1526 వరకు. ఢిల్లీలో మొట్టమొదటి మసీదును నిర్మించాడు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం కుతుబ్ మినార్ ను ప్రారంభించాడు. కానీ ఇతని తరువాత ఈ కట్టడం పూర్తి చేయబడ్డది. పోలో ఆడుతూ గుర్రం మీద నుండి పడిపోయి చనిపోయాడు.

ఇల్ టుట్ మిష్ 1210 నుండి 1236 వరకు

కుతుబుద్దీన్ ఐబక్ మొదలు పెట్టిన కుతుబ్ మినార్ కట్టడాన్ని పూర్తి చేసాడు. భారతదేశంలో ముస్లిం సమాధులను మొదటగా నిర్మించింది ఇతనే. అరబ్ వెండి నాణాలను ప్రవేశపెట్టాడు. తన తరువాత తన కూతురు రజియా సుల్తాన్ ను తన వారసురాలుగా ప్రకటించాడు.

రజియా సుల్తానా…1236 నుండి 1239 వరకు

రజియా సుల్తానా పరిపాలన కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే కానీ మంచి పరిపాలనా దక్షురాలుగా పేరుపొందింది. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజాభిమానాన్ని పొందింది. ఇస్లాం మతస్థులలో మొదటి చివరి మహిళా పరిపాలకురాలు.

బహ్రమ్ షా… 1240 నుండి 1242 వరకు..

రజియా సుల్తానా తరువాత కేవలం రెండు సంవత్పరాలు మాత్రమే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. సొంత సైన్యం చేతిలో హత్య చేయబడ్డాడు.

అలా వుద్దీన్ మాసుద్ 1242-1246
నసీరుద్దీన్ మొహమద్… 1246-1266 ఇతను ఇల్ టుట్ మిష్ మనుమడు

బాల్బన్.. 1255-1286

వీరి తరువాత ఖిల్జీ వంశస్తులు ఢిల్లీని 1290 నుడి1320 సం.దాకా పరిపాలించారు.
వీరి పతనం తరువాత 1320 నుండి 1413 సం.దాకా తుగ్లక్ వంశస్థలు పరిపాలించారు. తుగ్లక్ ల తరువాత 1451 సం.దాకా సయ్యద్ వంశస్థులు ఆతరువాత 1451 నుండి 1526 దాకా లోఢి వంశస్థులు పరిపాలించారు. .

వీరి తరువాత తరువాత మొగల్ వంశస్థుడైన బాబర్ భారతదేశం మీద 1526 సంవత్సరంలో దండయాత్ర చేసి అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ సింహాసనం ఎక్కాడు. 1526 నుండి నుండి మొగల్ పరిపాలన ప్రారంభమైనది. బాబర్ తరువాత హుమయూన్, తరువాత అక్బర్, తరువాత జహంగీర్, తరువాత షాజహాన్, తరువాత ఔరంగజేబ్ భారతదేశాన్ని పరిపాలించారు. ఔరంగజేబ్ కాలంలో పతనావస్థకు చేరుకుని రెండవ బహుదుర్ షాతో (1857) మొగల్ సామ్రాజ్యం అంతమైనది.

ఢిల్లీ చివరి ముస్లిం పాలకుడు బహుదూర్ షా-2 పరిపాలన 1857 సం.లో జరిగిన సిపాయిల తిరుగుబాటుతో ఢిల్లీ సింహాసనం తెల్లవాళ్ల అధీనంలోకి వెళ్లింది.