కథక్

Kathak

ఉత్తరదేశంలో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నాట్యం కథక్. రాధాకృష్ణుల గాధలను ప్రదర్శించటం ద్వారా శృంగార రసాన్ని అందిస్తుంది. రాధాకృష్ణుల కథలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసాడు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలసి ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు.
పూర్వకాలంలో కథకులు పురాణాల నుంచీ ఇతిహాసాలకు చెందిన కథలను వేదికపై చెప్పడం లేదా పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. ఈ కథకులకు ఈ విద్య తరతరాలకు వారసత్వంగా సంక్రమించింది. క్రీ.పూ 3 మరియు 4 వ శతాబ్దానికి సంబంధించిన సాహిత్యంలో ఈ కథకులకు సంబంధించిన ప్రస్తావన ఉంది.

ఒడిస్సీ నృత్యం

Odissy

ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందినది మరియు భారతదేశపు శాస్త్రీయనృత్యాలలో ఒకటి.భారత ఈశాన్య రాష్ట్రమైన ఒడిషాలో పుట్టినది క్రీ.పూర్వం 2వ శతాబ్ధం నుండి ఈ నాట్యరీతి ప్రాచుర్యంలో ఉంది. శతాబ్దంలో జైన రాజైన ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది.
చెందిన ఖారవేలుని కాలంనాటిదిగా చెప్పబడుతున్న ఒడిస్సీ నాట్యపు చిత్రపటం ఉదయగిరిలోని మంచాపురి గుహలో లభ్యమైంది. ఈ చిత్రంలో రాజు తన ఇద్దరు రాణులతో కూడి మహిళా బృందం సంగీతం పలికిస్తుండగా నాట్యకత్తె నృత్యప్రదర్శనను తిలకిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది
ఇది కూడా భరతుని నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందినది. జగన్నాధుని ఆలయంలోని హహీరులు అనే స్త్రీలు దీనిని ప్రదర్శించేవారు. సంయుక్త పాణిగ్రహీ, కొలుచరణ్ మహాపాత్ర, గురుపంకజ్ చరణ్ దాస్ మొదలైన వారు దీనికి ఎంతో ప్రాముఖ్యత కలిగించారు.

ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడింది. మొదట్లో దీనిని పూరిలోని జగన్నాధ స్వామివారి ఆలయంలో ‘మహరిలు’అనే స్త్రీలు ప్రదర్శించేవారు. ఒడిస్సీ నృత్యం భారతీయ శిల్పానికి విలక్షణ శైలిగా ఉన్న మైలిక త్రిభంగ అనే భంగిమ చుట్టూ అల్లుకొని ఉంటుంది.
ఒడిషా రాజధానియైన భువనేశ్వర్ లో క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందిన జైన గుహలున్నాయి. ఇవి ఆకాలంలో ఖారవేలుని ఆస్థానంగా ఉపయోగపడేవని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ గుహల్లో కనుగొనబడ్డ ఆధారాలవల్ల ప్రాచీనమైన నాట్యకళారీతుల్లో ఒడిస్సీదే ప్రథమ స్థానమని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. ఇంకా కోణార్క్ సూర్యదేవాలయం, భువనేశ్వర్ లోని బ్రహ్మేశ్వరాలయంలో కూడా ఈ నాట్యానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి.

ఒడిస్సీ నృత్యంలో ప్రధానంగా మూడు సాంప్రదాయాలున్నాయి. అవి మహరీ, నర్తకి, గోటిపువా. మహరీలు అంటే ఒడిషాకు చెందిన దేవ దాసీలు. వీరు ముఖ్యంగా పూరీ జగన్నాథ దేవాలయం దగ్గర నివసించేవారు. పూర్వ కాలంలో మహరీలు కేవలం మంత్రాలకు, శ్లోకాలకు అభినయించడం మాత్రమే చేసేవారు. ఇప్పుడు జయదేవుని గీతగోవిందం లోని పల్లవులకు కూడా నృత్యాభినయాలు ప్రదర్శిస్తున్నారు.

కథాకళి

Kuchipudi

కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్యరూపం. ఇందులో నేత్రా చలనాలు, ఆహార్యం ప్రధానంగా నర్తిస్తారు. ఇందులో రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి మరియు పురాణాలనుంచి పాత్రలను ప్రదర్శిస్తారు. ఈ కళ వివిధ రకాలైన రంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కళాకారులు ధగ ధగ మెరిసే ఆభరణాలు, కిరీటాలు, దుస్తులతో ఆకట్టుకుంటారు. వివిధ రకాలైన పాత్రలకు అనుగుణంగాఅలంకరణ చేసుకుంటారు.

మానవులు, దేవతలు, రాక్షసులు మొదలగు రూపాలను ప్రదర్శించడానికి తగిన దుస్తులను, అలంకరణ సామాగ్రిని వాడతారు. ఈ కళకున్న ప్రత్యేకత కళాకారులెవరూ నోరు తెరిచి మాట్లాడరు. కథనంతా హావ భావ ప్రకటనల తోనూ, చేతి సంజ్ఞలతోనూ ప్రకటిస్తారు. ముఖంలో కనిపించే చిన్న మరియు పెద్ద కదలికలు, కనుబొమలు, కను గుడ్లు, ముక్కు, చెంపలు, గడ్డం మొదలైన వాటిని సూక్ష్మంగా నేర్పుగా కదుపుతూ వివిధ భావాలను ప్రకటిస్తారు. ఏయే భావాలకు ఏయే విధంగా వీటిని కదిలించాలన్నది కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. పురుషులు స్త్రీ వేషధారణ కూడా ధరిస్తారు. కానీ ఇప్పుడు స్త్రీలు కూడా ఈ కళలో ప్రవేశించారు.

ఈ రంగంలో ప్రముఖులు గురుగోపీచంద్, చంపకులం పరమపిళ్లై, వళ్లోత్తోల్ నారాయణన్, మీనన్ మొదలగు వారు.

కూచిపూడి

Kuchipudi

కూచిపూడి నృత్యము, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక దక్షిణ భారతీయ నాట్యం. ఇది భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన నాట్యకళ. ఈ నాట్యం కృష్ణా జిల్లాలో దివి తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించింది ఇది ఆంధ్రుల సాంస్కృతిక వైభవానికి చిహ్నం. దీనిని సిద్ధేంద్ర యోగి ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చాడు. ఈ నాట్యంలో అభినయానికి, భావప్రకటనకు ప్రాధాన్యం ఇస్తారు. ఇది సంగీతపరమైన నాటకకళ.

క్రీ పూ 2వ శతాబ్దంలో ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దీనికి ఈ గ్రామం పేరు మీదుగా కూచిపూడి నృత్యం అని పేరు వచ్చింది శాతవాహనులు ఈ కళను ఆరాధించి పోషించారు. దశాబ్దాలుగా ఈ నాట్య ప్రదర్శనలు వైష్ణవారాధనకే అంకితమైనాయి. అందుకే ఈ రూపాన్ని భాగవత మేళ నాటకం అంటారు. అత్యంత పవిత్ర దేవాలయమైన ఆంధ్ర విష్ణు దేవాలయం ఆవరణలో లభ్యమైన శాసనాల ప్రకారం దాదాపుగా మూడు వందల మంది దేవదాసీలు రాజమర్యాదలు అందుకునేవారు. ఇక్కడ లభ్యమైన శిల్పాలు కూడా ఆ నృత్య కళాకారిణుల దైవపూజగా భావించే అపురూప భంగిమలను సూచిస్తాయి.

చాలాకాలం వరకు,కూచిపూడి నృత్యం దేవాలయాలలో ప్రదర్శింపబడేది. సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్ని చేసేవారు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారు. 15 వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి, కూచిపూడి నాట్యంలో ఆడవారు నాట్యం చేయడానికి అనుగుణంగా, కొన్ని మార్పులు, చేర్పులు చేసి, దానిని పరిపుష్టం గావించి ఆడవారికి కూడా ఈ నృత్యంలో ప్రవేశం కల్పించాడు. అతని అనుచరులైన బ్రాహ్మణులు కూచిపూడిలో స్థిరపడి ఈ నాట్యాన్ని అభ్యసించటంతో ఆ ఊరి పేరే ఈ నాట్యానికి సిద్ధించింది. ఈ నాట్యకళ భరతుని ‘నాట్య శాస్త్రాన్ని’ అనుసరిస్తుంది.

1500 నాటికే కూచిపూడి భాగవతులు దక్షిణ భారతదేశంలో సుప్రఖ్యాతులైనట్టు మాచుపల్లి కైఫీయతులో ప్రస్తావించిన కొన్ని విషయాల వల్ల తెలుస్తోంది. 1506-09 విజయనగర చక్రవర్తి వీరనరసింహరాయలు ఎదుట కూచిపూడి భాగవతులు ప్రదర్శన చేస్తూ, సంబెట గురవరాజు అనే సామంతుడు తన పాలనలోని స్త్రీల పట్ల ధనసంపాదన కోసం చేస్తున్న అసభ్యమైన ఘోరాలు ప్రదర్శనరూపంలో తెలియపరచారని, దానిలోని వాస్తవాన్ని పరిశీలించి రాయలు సామంతుణ్ణి ఓడించి పట్టి మరణశిక్ష విధించి వధించారని కైఫీయత్తు తెలుపుతోంది.

కూచిపూడి నృత్యప్రదర్శన గణేశ స్తుతి, సరస్వతీ స్తుతి, లక్ష్మీస్తుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. ఆ పై ఒక్కొక్క పాత్ర వేదిక పైకి వచ్చి స్వీయపరిచయం చేసుకొంటారు. దీని తర్వాత కథ మొదలౌతుంది. ఒక గాయకుడు, కర్ణాటక సంగీతశైలిలో కీర్తనలను పాడతాడు. దీనినే నట్టువాంగం అంటారు. ఇందులో మృదంగం, వయొలిన్, వేణువు మరియు తంబూరా వంటి వాద్యపరికరాలను ఉపయోగించబడతాయి.

చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్పసదృశమైన దేహభంగిమలు, చేతులు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, ముఖాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్దండులు. నృత్యకారులు ధరించే ఆభరణాలు తేలికగా ఉండే బూరుగు అనబడు చెక్కతో చేస్తారు.

కూచిపూడి భరత నాట్యానికి దగ్గరగా ఉంటుంది కానీ కూచిపూడికి ప్రత్యేక నాట్యరీతులు ఉన్నాయి.
కూచిపూడి వారి నాట్య ప్రదర్సనములు చాలా ఉన్నవి.వాని అన్నింటిని కలాపములని, భాగవత నాటకములని రెండు రకములుగా విభజింప బడినవి.

వీనిలో కలాపములు మూడు:
సత్యభామా కలాపము, గొల్ల భామా కలాపము, చోడిగాని కలాపము. కృష్ణుని సతీమణి సత్యభామను అనుకరిస్తూ చేసే నాట్యం, భామాకలాపం.

గొల్లభామాకలాపము భాణిక అను ఒక ఉషరూపకము.
ఒక వెడల్పాటి ఇత్తడి పళ్ళెం అంచులపై పాదాలను ఆనించి, రెండు చేతుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఉంచుకుని తలపై నీటితో నిండిన ఒక పాత్రను నిలిపి నాట్యం చేయడాన్ని తరంగం అంటారు.

కూచిపూడి నాట్యంలో ప్రముఖులు : వేదాంతం సత్యనారాయణ, వెంపటి చినసత్యం, రాధారాజారెడ్డి, శోభానాయిడు, యామినీ కృష్ణమూర్తి. వీరే గాక అనేక వందల మంది విద్యాధికులు సైత కూచిపూడి నృత్యంలో పేరుపొందారు.

కూచిపూడి కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలో ఉన్నది. విజయవాడకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నదిమరియు చారిత్రాత్మక నగరమైన శ్రీకాకుళంకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నది

భరతనాట్యం

Bharata Natyam

భరతనాట్యం దక్షిణ భారతేదేశపు ఒక శాస్త్రీయ నృత్య విధానం. భరతముని నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందినది. ఇందులో అలరింపు, వర్ణం, పదం, తిల్లాన వంటి అంశాలుంటాయి. ఈ నాట్యం ఎక్కువగా దేవాలయాలలో ప్రదర్శించేవారు.

భావం, రాగం, తాళం – ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు కఠినంగా ఉంటాయి.

పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరలు నాట్యం చేస్తున్నట్లుగా చెక్కబడి ఉన్నాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని “తంజావూరు”లో ‘నట్టువన్నులు’ మరియు దేవదాసీలు ఈ కళకు పోషకులు. ఈ నృత్యంలో విస్తృతమైన భంగిమలు ఈ ధరించే వస్త్రాలు అత్యంత మనోహరం గా ఉండాలి. శృంగారమేఈ నృత్యానికి మూలం. మగవారు కూడా ఈ నృత్యం చేస్తారు. కానీ స్త్రీలు మాత్రమే ఈ నృత్యంలో నిష్ణాతులుగా పేరుపొందారు

ప్రముఖ భరతనాట్య కళాకారులు
రుక్మిణీ అరండేల్, బాలసరస్వతి, యామిని కృష్ణమూర్తి, మృణాళిని సారాబాయి, పద్మా శుబ్రహ్మణ్యం, వైజంతిమాలా