
మామూలు మొబైల్ కాల్ తరహాలో సిగ్నల్ యాప్‌లో వాయిస్ కాల్ ఫుల్ క్లారిటీ ఉండడం కూడా అదనపు ప్రధాన ఆకర్షణ. మీ ఐపీ అడ్రస్ కూడా ఎవరికీ తెలియకూడదని భావించినప్పడు రిలే కాల్స్ ఫీచర్‌ను వాడుకోవచ్చు. అంటే సిగ్నల్ యాప్ సర్వర్ల ద్వారా కాల్స్ వెళతాయి. ఈ ఆప్షన్ ఉపయోగించినప్పుడు వాయిస్ క్వాలిటీ కొంత తగ్గుతుంది. ఇక సిగ్నల్ యాప్‌లో వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంది. సిగ్నల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్, లైనెక్స్ తదితర ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పనిచేస్తుంది. గ్రూప్స్ కూడా పెట్టుకోవచ్చు. గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని కూడా ఇటీవలే జోడించింది. మెసేజ్‌కు ఎమోజీ ద్వారా రిప్లై ఇవ్వడం, డిలీట్ ఫర్ ఎవ్రీవన్, డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.