టూల్‌కిట్

టూల్‌కిట్’‌ అంటే ఓ డాక్యుమెంట్‌. దేని గురించి అయినా వివరించే ఓ పత్రం, బ్లూ ప్రింట్‌ లాంటిది అని చెప్పవచ్చు. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు నడిచాయి. కొన్ని ప్రపంచ గతినే మార్చేశాయి. తాజాగా గతేడాది అమెరికాలో ‘‘బ్లాక్ లైవ్స్‌ మాటర్’’, పర్యావరణానికి సంబంధించి క్లైమేట్ స్ట్రైక్ క్యాంపెయిన్ లాంటివి ఉన్నాయి. ఒకప్పుడు ఇలాంటి ఉద్యమాలు జరిగితే అందుకు సంబందించిన కార్యాచరణ, వ్యూహాలకు సంబంధించిన ప్రణాళికను కాగితాల మీద ముద్రించేవారు. దానిని ఆ ఉద్యమానికి మద్దతు తెలిపే వారికి చేరేలా చూసేవారు. 

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆ స్థానంలోకి టూల్‌కిట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ ఉద్యమం అయినా సరే దానికి సంబందించిన ఒక డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తారు. దీనినే టూల్‌కిట్‌ అంటారు. ఆ ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు, దానిపై ఆసక్తి ఉన్నా వారు ఎవరైనా సరే ఈ టూల్‌కిట్‌ని చదివితే ఉద్యమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే ఉద్యమంలో ఏ రోజున ఎలాంటి కార్యక్రమం ఉంటుంది.. ఎక్కడెక్కడ ర్యాలీలు, దీక్షలు ఉంటాయి.. ఉద్యమం ఎలా ముందుకు వెళ్తోంది అనే సమాచారం టూల్‌కిట్‌ ద్వారా తెలుస్తుంది. ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి.. ఉద్యమానికి మద్దతు పెంచడానికి ఈ టూల్‌కిట్‌ని సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తుంటారు. ప్రపంచం నలుమూలలా ఉన్న మద్దతుదారులను ఏకం చేయడంలో ఈ టూల్‌కిట్‌ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం కూడా ఇదే.

బ్లాగింగ్ ద్వారా ఆదాయ మార్గాలు

బ్లాగింగ్ ద్వారా నెలకు పదివేల డాలర్లు(అంటే సుమారు ఏడెనిమిది లక్షలు) కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇందులో సగటు చెప్పడం కష్టం, మీ బ్లాగ్ని ఎంత మంది చూస్తున్నారు అనేదాన్ని బట్టి ఉంటుంది, లేదా మీరు ఎంచుకున్న ఆదాయ మార్గం బట్టి ఉంటుంది. మొదట ఆదాయ మార్గాలు చూద్దాం.

ప్రకటనలు : ఇది అత్యంత సాధారణంగా ఉపోయోగ పడే ఆదాయ మార్గం. ఇక్కడ మీ బ్లాగ్ కు ఎన్ని వీక్షణలు వస్తున్నాయి, ఎంతమంది ప్రకటనలు మీద ఆసక్తి చూపుతున్నారు, మీ ప్రేక్షకులు ఏ దేశానికి చెందిన వారు మొదలైనవి కారకాలుగా ఉంటాయి. గూగుల్ యాడ్సెన్స్, ఇంకా మరికొన్ని సంస్థలు ద్వారా ఈ ప్రకటనలు మీ బ్లాగులో కనబడేలా చేయవచ్చు.

అఫిలియేట్ మార్కెటింగ్ : అధిక ఆదాయం వచ్చేది ఇక్కడ నుండే. ఇక్కడ మీకు తక్కువ వీక్షకులు ఉన్నా కూడా ఎవరైనా మీ యొక్క లింక్ ద్వారా ఏదైనా వస్తువు గాని, సేవ గాని కొనుగోలు చేస్తే మీకు అంత కమిషన్ వస్తుంది. మరి కమిషన్ ఎవరు ఇస్తారంటే ఆ యొక్క వస్తువు గానీ, సేవ గానీ అందచేసే సంస్థ. అమెజాన్, వెబ్ హోస్టింగ్ సంస్థలు, ఇతర ఈ కామర్స్ సంస్థలు వంటివి సాధారణంగా ఇలాంటి భాగస్వామ్య ప్రోగ్రాంలలో చేరడానికి సౌకర్యం ఇస్తాయి.

మీ సొంత సేవలను/ఉత్పత్తులను అమ్మడం: మీకు కొంతమంది నమ్మకమైన వీక్షకులు వచ్చిన తరువాత బ్లాగ్ ద్వారా మీ యొక్క సొంత ఉత్పత్తులను గాని, సేవలను గాని అమ్మవచ్చు. ఉదాహరణకి ఏదైనా కోర్స్, ఈ పుస్తకం మొదలైనవన్నమాట.

పైన చెప్పిన మూడు విధాలుగా బ్లాగర్లు సంపాదించవచ్చు. దీనికి ఒక పరిమితి లేదు. మీరు బాగా కష్టపడితే ఊహించనంత ఫలితం ఉంటుంది. ఐతే కష్టం లేకుండా ఏమి జరగదండీ. ఎందుకంటే ఈ రోజు సంపాదిస్తున్న బ్లాగర్లు అందరు కొన్ని సంవత్సరాలు పని చేసారు (ఎన్నో బ్లాగులు ద్వారా ప్రయత్నించి) ఈ స్థాయి రావడానికి.

వాట్సాప్ చాట్స్ టెలిగ్రాంలోకి

How To Import WhatsApp Chats To Telegram - Sakshi

తాజాగా టెలిగ్రామ్ కొత్తగా తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకోని వచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ చాట్లను కూడా టెలిగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చాట్ హిస్టరీతో పాటు వీడియోలు, డాక్యుమెంట్లు వంటి ఇతర మీడియా కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. కేవలం వాట్సాప్ నుంచే కాకుండా లైన్, కకావో టాక్ వంటి ఇతర యాప్‌ల చాటింగ్‌ను కూడా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. ఇది వ్యక్తిగతమైన చాటింగ్‌తో పాటు గ్రూప్ చాటింగ్‌కు కూడా వర్తించనుంది. దీనికోసం యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసాక మీకు అక్కడ ఎక్స్‌పోర్ట్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు విత్ మీడియా, విత్ అవుట్ మీడియా అనే ఆప్షన్ లు కనిపిస్తాయి. మీరు విత్ మీడియా ఎంచుకుంటే మీకు అదనంగా స్టోరేజ్ స్పేస్ ఖర్చవుతుంది. ఇలా ఎక్స్‌పోర్ట్ చేస్తే ఈరోజు వరకు ఉన్న చాటింగ్ కూడా టెలిగ్రాంలోకి వచ్చేస్తుంది. వారు ఎప్పుడు పంపారో అదే టైం స్టాంప్‌తో మెసేజ్‌లు టెలిగ్రాంలోకి ఇంపోర్ట్ అవుతాయి. 

డక్ డక్ గో సెర్చింజన్

గూగుల్ మనము ఏమీ సైట్లు వాడుతున్నాము అనేది ట్రాక్ చేస్తుంది. డక్ డక్ గో లో మనకు ఆ భయం అవసరం లేదు. గూగుల్ మనం వాడే ప్రతీ విషయం, వెతికే ప్రతి పదం కీ వర్డ్ ను సేవ్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా మీరు గూగుల్ లో వెతికిన ఒక వస్తువు వెంటనే మీ FB, TWITTER, INSTAGRAM లలో యాడ్లు వస్తుంటాయి. డక్ డక్ గో లో ఇలా జరగదు.

గూగుల్ లో వెతికితే ఒక్కొకరికి ఒక్కో రిజల్ట్ చూపిస్తుంది. అలా ఎలా అంటారా.. గూగుల్ లో వెతికే ప్రతీ వ్యక్తి అభిరుచిని, ఇష్టమైన సైట్లను గుర్తుంచుకొని, అవే చూపిస్తుంది. అలా ఒక్కొక్కళ్ళకీ ఒక్కో రిజల్ట్ వస్తుంది. డక్ డక్ గో లో ఎలా రికార్డు చేయదు కాబట్టి అందరికీ ఒకే రిజల్ట్ వస్తుంది. డక్ డక్ గో లో మన ప్రైవసీ మనకు ఉంటుంది. అందుకే డార్క్ వెబ్ ను యాక్సిస్ చేయాలంటే దీనినే వాడతారు.

సిగ్నల్‌ యాప్‌

Signal App Attract Whatsapp Users - Sakshi

మామూలు మొబైల్‌ కాల్‌ తరహాలో సిగ్నల్‌ యాప్‌లో వాయిస్‌ కాల్‌ ఫుల్‌ క్లారిటీ ఉండడం కూడా అదనపు ప్రధాన ఆకర్షణ. మీ ఐపీ అడ్రస్‌ కూడా ఎవరికీ తెలియకూడదని భావించినప్పడు రిలే కాల్స్‌ ఫీచర్‌ను వాడుకోవచ్చు. అంటే సిగ్నల్‌ యాప్‌ సర్వర్ల ద్వారా కాల్స్‌ వెళతాయి. ఈ ఆప్షన్‌ ఉపయోగించినప్పుడు వాయిస్‌ క్వాలిటీ కొంత తగ్గుతుంది. ఇక సిగ్నల్‌ యాప్‌లో వీడియో కాల్‌ సౌకర్యం కూడా ఉంది. సిగ్నల్‌ యాప్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్, లైనెక్స్‌ తదితర ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో పనిచేస్తుంది. గ్రూప్స్‌ కూడా పెట్టుకోవచ్చు. గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సౌకర్యాన్ని కూడా ఇటీవలే జోడించింది. మెసేజ్‌కు ఎమోజీ ద్వారా రిప్‌లై ఇవ్వడం, డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్, డిసప్పియరింగ్‌ మెసేజ్‌ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.