Eye Donation
నేత్రదానం అంటే ఒకవ్యక్తి మరణించిన తరువాత ఆ వ్యక్తి కళ్లను సేకరించి అందులోని కార్నియాను (కంటిమీద ఉండే పారదర్శకమైన పొర) సేకరించి అవసరమైన వారికి ఒక కంటికి మాత్రమే అమరుస్తారు. కనుక ఒక వ్యక్తి నేత్రదానం చేస్తే దానివల్ల ఇద్దరికి చూపు వస్తుంది. కార్నియా దెబ్బతిన్నవారికి మాత్రమే ఇవి అమరుస్తారు.దీనినే కార్నియా రీప్లేస్ మెంట్ లేదా కెరటోప్లాస్టీ, కార్నియా గ్రాఫ్టింగ్ అంటారు. ఈ సర్జరీకి బ్లడ్ గ్రూపులతో అవసరం లేదు.కార్నియా పారదర్శకంగా ఉంటూ బయటి దృశ్యాలను కంటిలోపలకి చేరవేస్తుంది. కార్నియాలోని పారదర్శకత లోపించినప్పుడు అది రెటీనాకు సరైన సమాచారాన్ని చేరవేయలేదు. దీనినే కార్నియల్ బ్లైండ్ నెస్ అంటారు. దాతనుండి సేకరించిన కార్నియాను వైద్యనిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇన్నర్ లేయర్ శక్తిని పరీక్షిస్తారు. అది సరిగ్గా ఉండా సర్జరీ ద్వారా అవసరమైనవారికి అమరుస్తారు.కార్నియాను సేకరించే విధానం :మరణానంతరం ఆరు…
Read More
You must be logged in to post a comment.