మహిళల భద్రత – తక్షణ సహాయం

మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసినా కూడా వారు భద్రత పరంగా ప్రతిరోజూ ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని సార్లు తక్షణ సాయం తప్పని సరి అవుతోంది. తక్షణ సాయం కోసం ఎవరైనా 100 కు డయల్ చేయవచ్చు. వెంటనే పోలీసుల నుండి సహాయం అందుతుంది. ప్రత్యేకించి మహిళల కోసం కూడా హెల్ప్ లైన్ నంబర్లను ప్రారంభించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో తక్షణ సాయం కోసం మహిళలు డయల్ చేయాల్సిన నంబరు 112 లేదా 1091 కు కాల్ చేయవచ్చు.

ఇంతే కాకుండా భద్రతకు సంబంధిన కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ వాడేవారు ఈ యాప్స్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకుంటే అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

ఆంధ్ర ప్రదేశ్ లో దిశా యాప్:

అత్యవసర సమయాల్లో మహిళలకు సహాయం అందించడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ యాప్ లో ఉన్న ఎస్ఓఎస్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మహిళలు తక్షణ సాయం పొందవచ్చు. ఇందులో ఇంకా దగ్గరలో ఉన్న రక్షిత స్థలాలు, పోలీస్ స్టేషన్లు, హాస్పిటళ్లు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు వంటి ఎంతో ఉపయోగకరమైన సమాచారం కూడా ఉంటుంది. అంతే కాకుండా ఈ యాప్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరి కోసం ట్రాకింగ్ సేఫ్టీ ఫీచర్ కూడా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి అమ్మాయి, మహిళా కూడా తప్పని సరిగా ఈ యాప్ ను వారి ఫోన్ లో ఉంచుకోవాలి.

పాఠశాలలో నిర్వలేని ఒక ముఖ్యమైన నైపుణ్యం – ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ‘ జీవించడం’

ఈ నైపుణ్యం నేర్వనందువల్లనే, ఎన్నో జీవితాలు మొగ్గలోనే మాడిపోతున్నాయి. నిజానికి లౌకికంగా చూసినా, అలౌకికంగా చూసినా మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. ఏజీవికీ లేని మాట్లాడటం అనే నైపుణ్యం మానవుడి సొంతం. మిగతాజీవులకూ తెలివితేటలు ఉన్నా, మానవుడి తెలివి అద్భుతం.

ఆదిమ మానవుడి నుంచి ఇప్పటిదాకా జీవన విధానం ఎంతో మారిపోయింది. విద్యా, వైద్య , శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనూహ్యంగా అభివృద్ధి చెందాయి.

కాబట్టి, బతికివుంటే ఎన్నో అద్భుతాలు చూస్తాం. అందుకే కరుణశ్రీ గారు…

చచ్చిపోయినట్టి సార్వభౌమునికంటే

బ్రతికి ఉన్న చిన్న చీమ మేలు

బ్రతుకుకన్న వేరు స్వర్గమ్ము లేదురా

లలిత సుగుణజాల! తెలుగు బాల! అన్నారు.

జీవించడం.. అనే గొప్పవిషయాన్ని బాల్యం నుంచి చెప్పకపోవడం వల్ల ఎందరో క్షణికావేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆ కుటుంబాలలో చీకటి మిగులుతోంది. అందుచేత, సమస్యలు వస్తే, తట్టుకుని జీవించగలిగే నైపుణ్యాన్ని ఇంటివద్ద నేర్పాలి.

హరిత పర్యావరణం

కుళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుంది?
మానవుడు — 1 వారం
అరటి తొక్క – 3-4 వారాలు
వార్తాపత్రిక – 1.5 నెలలు
కార్డ్బోర్డ్ – 2 నెలలు
కాటన్ గ్లోవ్ – 3 నెలలు
ప్లైవుడ్ – 1-3 సంవత్సరాలు
ఉన్ని సాక్ – 1-5 సంవత్సరాలు
మిల్క్ కార్టన్లు – 5 సంవత్సరాలు
సిగరెట్ బుట్టలు – 10-12 సంవత్సరాలు
తోలు బూట్లు – 25-40 సంవత్సరాలు
టిన్డ్ స్టీల్ క్యాన్ – 50 సంవత్సరాలు
ఫోమేడ్ ప్లాస్టిక్ కప్పులు – 50 సంవత్సరాలు
రబ్బరు-బూట్ ఏకైక – 50-80 సంవత్సరాలు
ప్లాస్టిక్ కంటైనర్లు – 50-80 సంవత్సరాలు
అల్యూమినియం కెన్ – 200-500 సంవత్సరాలు
ప్లాస్టిక్ సీసాలు – 450 సంవత్సరాలు
పునర్వినియోగపరచలేని డైపర్స్ – 550 సంవత్సరాలు
మోనోఫిలమెంట్ ఫిషింగ్ లైన్ – 600 సంవత్సరాలు
ప్లాస్టిక్ సంచులు – 200-1000 సంవత్సరాలు

గ్లోబల్ గ్రీన్ హౌస్ ప్రభావానికి సంబంధించిన ప్రధాన కారణాలలో ప్లాస్టిక్ ఒకటి అని ప్రజలలో అవగాహన ఏర్పడుతుంది. ప్లాస్టిక్ ను వాడడం మానేద్దాం.

Brain Dead /బ్రెయిన్ డెడ్

బ్రెయిన్‌డెడ్ అంటే ఏమిటి, ఎలా నిర్ణయిస్తారు?
ఆధునిక వైద్యశాస్త్రంలోని పురోగతి వల్ల ఇప్పుడు అవయవాలను మార్చి ప్రాణాలను నిలబెట్టగల సామర్థ్యం మన వైద్యులకు ఉంది. అయితే జీవించి ఉన్నవారు తమ అవయవాలను ఎలా ఇవ్వగలరు? అందుకే జీవన్మృతుల (బ్రెయిన్‌డెడ్ పర్సన్స్) నుంచి అవయవాలను సేకరించే అవకాశాన్ని కల్పించేలా చట్టబద్ధమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
బ్రెయిన్‌డెడ్ అంటే ఏమిటి, ఎలా నిర్ణయిస్తారు?
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు దెబ్బతగిలి మెదడు పనితీరు పూర్తిగా ఆగిపోయినా… శరీరం కొద్దిసేపు జీవంతోనే ఉంటుంది. ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. అయితే రోగి ఎట్టిపరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఆ పరిస్థితినే బ్రెయిన్‌డెడ్ కండిషన్‌గా పేర్కొంటారు.
ఒకరు జీవన్మృతుడని నిర్ణయించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్‌లతో పాటు, సదరు ఆసుపత్రి సూపరింటెండెంట్లతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం, కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్‌డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. అప్పుడు ఆ బ్రెయిన్‌డెత్‌కు గురైన వారి బంధువులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమైన ‘జీవన్‌దాన్’ బృందం సభ్యులు కలిసి, మాట్లాడి వారిని అవయవదానానికి ఒప్పిస్తారు.
ఈ ‘జీవన్‌దాన్’ కార్యక్రమానికి ప్రధాన కార్యక్షేత్రం నిమ్స్ కాగా… అవయవదానం పట్ల అవగాహన పెంచే బాధ్యతలను గాంధీ ఆసుపత్రి, రోగి బంధువులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన బాధ్యతలను ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి నిర్వహిస్తుంది..
అర్హులైన వారికే… అర్హమైన అవయవం…
ప్రతి అవయవ ప్రదానానికి అవసరమైన నిబంధనలను ఆ స్పెషాలిటీకి చెందిన ఒక నిపుణుల బృందం మార్గదర్శకాలను నిర్దేసిస్తుంది. దానికి అనుగుణంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం జరిగింది. దీని వల్ల ఎలాంటి అవకతవకలకు గాని, ఎలాంటి ఒత్తిళ్లు, సిఫార్సులకు గాని లోనుకాకుండా కేవలం అర్హులైన వారికే ఆయా అవయవాలు అందేలా చూస్తారు.
డిమాండ్ ఎక్కువ… లభ్యత తక్కువ
ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటి లభ్యత తక్కువగానూ ఉన్నందున జీవన్‌దాన్ కార్యక్రమం నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఆసుపత్రులకు రొటేషన్ పద్ధతుల్లో రోగికి అవయవాలు అందేలా ఏర్పాట్లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇలాంటి ఆసుపత్రులు 30 ఉన్నాయి. ఒత్తిడి వల్లనో, పలుకుబడితోనో అవయవాలు పొందాలన్నా పొందలేని విధంగా ఈ 30 ఆసుపత్రుల్లోని రోగుల వివరాలూ, వారి ప్రాధాన్య క్రమాలూ… అన్నీ అనుసంధానమై ఉన్నాయి. దాంతో కేటాయింపుల్లో ఏమాత్రం పొరబాటుకు తావుండదు.
రెండు రాష్ట్రాల్లో కలిపి మూప్ఫై ఆసుపత్రులకే ఎందుకు…?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 ఆసుపత్రులకే ఒక రోగిని బ్రెయిన్‌డెడ్‌గా నిర్ణయించే అర్హత, అవయవమార్పిడి చేసే అర్హత ఉన్నాయి. మరిన్ని ఆసుపత్రులకు ఈ వసతి కల్పిస్తే మరింత చావు నీడన బతుకీడుస్తున్న మరింత మందికి అవయవాలు చేరే అవకాశం ఉంది కదా అన్న ప్రశ్న తలెత్తవచ్చు. కానీ… ఒక వ్యక్తిని బ్రెయిన్‌డెడ్‌గా నిర్ణయించడం చాలా నిబద్ధతతో, నిష్ణాతులైనవారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ముందు చెప్పుకున్నట్లుగా న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థీషియా, జనరల్ ఫిజీషియన్ స్పెషాలిటీలతో పాటు… మరెన్నో సౌకర్యాల, ఉపకరణాల లభ్యత వంటి అంశాలుండాలి. నైపుణ్యం ఉన్న సిబ్బంది ఉండాలి. వీరంతా ఉన్న ఆసుపత్రులకే ఈ సర్టిఫికేట్ లభిస్తుంది. పైగా ఆ నిపుణుల బృందం పొరబాటుకు తావివ్వకూడదనే ఉద్దేశంతో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తిని ఒకటికి రెండుసార్లు పరీక్షించి మరీ నిర్ధారణ చేస్తారు. ఇంత జాగ్రత్త, ఇన్ని సౌకర్యాలూ, ఇంత నైపుణ్యం అవసరం.

అపోహలు తొలగాలి…
అవయవదానంపై మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. కానీ మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవే అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయి. అలా కాదని ఖననం చేస్తే విలువైన అవయవాలు వృథాగా మట్టిలో కలిసిపోతాయి. దహనం చేస్తే కాలిపోతాయి. మట్టిలో కలవడం కంటే… కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలిగినప్పుడు మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు. ‘‘ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోలిస్తే లభ్యత తక్కువే. అపోహలు తొలగి మరింత మంది అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

Organ Donatiion…Jeevandan….జీవన్‌దాన్… అవయవ మార్పిడి

అవయవ మార్పిడి కోసం ఎదురు చూసే వారికి అపన్న హస్తం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో అవయవాలను మార్పిడి చేయించి వారికి పునర్జన్మ కల్పించడంలో విశేష కృషి చేస్తోంది.బాధిత కుటుంబాల్లో కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది. దూర ప్రాంతాల నుంచి కూడా అవయవాలను ప్రత్యేక వాహనాల్లో తెప్పించి బాధితులకు బాసటగా నిలుస్తోంది. గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాల మార్పిడీల సంఖ్యను పెంచుతూ బాధితులకు పునర్జన్మ కల్పిస్తోంది.
నిమ్స్‌లో నోడల్‌ కేంద్రం
జీవన్‌దాన్‌కు సంబంధించి 2013లో నిమ్స్‌లో నోడల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ జీవన్‌దాన్‌కు డీఎంఈ చైర్మన్‌గా, నిమ్స్‌ డైరక్టర్‌ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి వర్గాలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. కాలేయం, కిడ్నీ, గుండెకు సంబంధించిన కమిటీలు ఉంటా యి. ఈ కమిటీ పర్యవేక్షణలో అవయవ మార్పిడీల కేటాయింపులు జరుగుతాయి. రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి
ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రి తప్పని సరిగా జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఆస్పత్రికే అవయవాలు కేటాయించి అక్కడే మార్పిడి నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ప్రతి ఆస్పత్రిలో ఓ కో-ఆర్డినేటర్‌ను నియమించాలి.
కో-ఆర్డినేటర్లకు శిక్షణ
ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నియమించిన కో-ఆర్డినేటర్లకు అవయవదానంపై బాధిత కుటుంబాలకు అవగాహన ఎలా కల్పించాలి అనే అంశంపై శిక్షణ ఇస్తారు. ఏదైనా ఆస్పత్రిలో బ్రెయిన్‌డెత్‌ అయితే ఏం చేయాలి. రోగి కుటుంబ సభ్యులకు ఎలా కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. ఈ సమాచారాన్ని జీవన్‌దాన్‌కు ఎలా చేరవేయాలి ఇత్యాది అంశాలపై ఆరునెలల నుంచి ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. అవయవాల కేటాయింపు ఎలా జరుగుతుంది ?….
ఏదైనా బ్రెయిన్‌డెత్‌ ఉంటే జీవన్‌దాన్‌కు ఆ సమాచారం అందుతుంది. అక్కడి నుంచి ఓ కో-ఆర్డినేటర్‌ వెళ్లి రోగి కుటుంబ సభ్యులను ఒప్పించి అవయవ మార్పిడి ప్రక్రియకు మార్గం సుగమం చేస్తారు. ఆ తరువాత ఆ వివరాలను వెంటనే జీవన్‌దాన్‌ కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీ అత్యవసరంగా అవయవాలు అవసరమున్న బాధితులను గుర్తించి మార్పిడికి అవకాశమిస్తారు. జాబితా ప్రకారం అత్యవసరమున్న వారికే ఈ అవయవాలను అందిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకే మొదటి ప్రాధాన్యతను జీవన్‌దాన్‌ కల్పిస్తుంది.

అవయవాల కోసం రిజిస్ట్రేషన్‌
అవయవాలు అవసరమైన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. నిమ్స్‌లోని జీవన్‌దాన్‌ నోడల్‌ కేంద్రానికి వచ్చి బాధితులు తమ వివరాలను అందజేయాల్సి ఉంటుంది.
బాధితులు 040-23489494 నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చు.
www.eevandan.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

Blood Groups

చూడటానికి పైకి ఒకేలా కనిపిస్తుంది గానీ అందరి రక్తం ఒకటి కాదు. ఇందులో ఎ, బి, ఎబి, ఒ అనే రకాలు ఉన్నాయి. అలాగే పాజిటివ్‌, నెగెటివ్‌ను బట్టి కూడా మరిన్ని రకాలుగా వర్గీకరిస్తారువాటి వివరాలు గురించి తెలుసుకుందాం.
యాంటీజెన్ల ఆధారంగా..
– ఎర్ర రక్తకణాల ఉపరితలం మీదుండే యాంటీజెన్ల ఆధారంగా రక్తం – —- గ్రూపులను నిర్ధరిస్తారు.
– ఎ యాంటీజెన్‌ ఉంటే ఎ గ్రూపు,
– బి యాంటీజెన్‌ ఉంటే బి గ్రూపు,
– ఎ బి రెండూ ఉంటే ఎబి గ్రూపు..
– ఇక యాంటీజెన్‌లేవీ లేకపోతే ఒ గ్రూపుగా పరిగణిస్తారు.
– అలాగే ఎర్ర రక్తకణాల మీద ఆర్‌హెచ్‌ ఫ్యాక్టర్‌ కూడా ఉంటే పాజిటివ్‌గా, లేకపోతే నెగిటివ్‌గా భావిస్తారు.
– ఉదాహరణకు ఎ యాంటీజెన్‌తో పాటు ఆర్‌హెచ్‌ ఫ్యాక్టర్‌ కూడా ఉంటే ఎ పాజిటివ్‌ అని..
– ఆర్‌హెచ్‌ ఫ్యాక్టర్‌ లేకపోతే ఎ నెగిటివ్‌ అని అంటారు.
అందరికీ సరిపోయేది..
అత్యవసర సమయాల్లో ఒకే రకం రక్తం అందుబాటులో లేకపోతే ఒ నెగిటివ్‌ రక్తాన్ని ఎక్కిస్తుంటారు. అందుకే వీరిని సార్వత్రిక రక్తదాతలంటారు. ఇక ఎబి పాజిటివ్‌ రక్తం గలవారికి ఎలాంటి గ్రూపు రక్తమైనా సరిపోతుంది. వీరిని సార్వత్రిక రక్త గ్రహీతలంటారు.

Eye Donation

నేత్రదానం అంటే ఒకవ్యక్తి మరణించిన తరువాత ఆ వ్యక్తి కళ్లను సేకరించి అందులోని కార్నియాను (కంటిమీద ఉండే పారదర్శకమైన పొర) సేకరించి అవసరమైన వారికి ఒక కంటికి మాత్రమే అమరుస్తారు. కనుక ఒక వ్యక్తి నేత్రదానం చేస్తే దానివల్ల ఇద్దరికి చూపు వస్తుంది. కార్నియా దెబ్బతిన్నవారికి మాత్రమే ఇవి అమరుస్తారు.
దీనినే కార్నియా రీప్లేస్ మెంట్ లేదా కెరటోప్లాస్టీ, కార్నియా గ్రాఫ్టింగ్ అంటారు. ఈ సర్జరీకి బ్లడ్ గ్రూపులతో అవసరం లేదు.
కార్నియా పారదర్శకంగా ఉంటూ బయటి దృశ్యాలను కంటిలోపలకి చేరవేస్తుంది. కార్నియాలోని పారదర్శకత లోపించినప్పుడు అది రెటీనాకు సరైన సమాచారాన్ని చేరవేయలేదు. దీనినే కార్నియల్ బ్లైండ్ నెస్ అంటారు. దాతనుండి సేకరించిన కార్నియాను వైద్యనిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇన్నర్ లేయర్ శక్తిని పరీక్షిస్తారు. అది సరిగ్గా ఉండా సర్జరీ ద్వారా అవసరమైనవారికి అమరుస్తారు.
కార్నియాను సేకరించే విధానం :
మరణానంతరం ఆరు గంటలలోపు కళ్లను సేకరించాలి. అంతవరకు మృతుని కనురెప్పలను మూసి కళ్లమీద తడిగుడ్డ లేదా దూదిని లేదా ఐస్ ముక్కలను ఉంచాలి. తల ఎత్తులో ఉండేటట్లు చూడాలి. తలకింద రెండు తలగడలు ఉంచాలి. మృతదేహం ఉన్న గదిలో ఫ్యాన్ వేయకూడు. దీనివల్ల కార్నియా పొడిగా మారి చెడిపోయే అవకాశం ఉంటుంది. గదిని వీలైనంత చల్లగా ఉంచాలి. ఆధునాతన పరికరాలు అందుబాటులో ఉన్న ఈ కాలంలో కంటి నల్లగుడ్డుమీద ఉండే కార్నియాను మాత్రమే సేకరిస్తారు. ఇదివరకటిలాగా కనుగుడ్డు మొత్తం సేకరించరు కనుక కను గుడ్డు ఆకారంలో ఏ మాత్రం తేడా కనిపించదు.ఆధునాతన పరికరాలు అందుబాటులో లేకపోతే పాత పద్ధతిలో కంటిని మొత్తంగా తీసినట్లయితే ఆ స్థానంలో కృత్రిమ కంటిని అమరుస్తారు. కార్నియాను సేకరించిన తరువాత దానిని కార్నియా ట్యాంక్ లో ఉంచి అవసరమైనవారికి అమరుస్తారు.


ఎవరికి అవసరం ?
సూడోపేకిక్ బుల్లస్ కెరటోపతి, కెరటోకోనస్, కార్నియాకు గాయాలు, కార్నియల్ డీ జనరేషన్, కార్నియల్ అల్సర్స్, ఎండోధీలియల్ డీ- కంపెన్సేషియన్, పుట్టుకతోనే తెల్లటి కార్నియా ఉంటడం, రసాయనాలవల్ల కార్నియా దెబ్బతినటం జరిగిన వారికి అవసరం
నేత్రదానం ఎవరెవరు చేయవచ్చు
నేత్రదానం చేయదలచుకున్నవారు సంబంధిత సంస్థలను సంప్రదించి ప్రతిజ్ఙ చేయాలి. మరణించిన వారి కళ్లను ప్రతిజ్ఙ చేయకపోయినా వారి వారసులు దానం ఇవ్వవచ్చు. నేత్రదానానికి వయసుతో నిమిత్తం లేదు. వార్ధక్యం అడ్డురాదు.
కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నవారు, కళ్లజోడు ధరించేవారు, బిపీ, షుగర్ ఉన్నవారు, ఉబ్బసం, టీబీ వంటి వ్యాధులున్నవారు కూడా కార్నియా ఆరోగ్యంగా ఉంటే దానం చేయవచ్చు.
ఎవరు నేత్రదానం చేయకూడదు ?
ఎయిడ్స్, హెపటైటిస్, రుబెల్లా, మలేరియా, సిఫిలిస్ వంటి అంటు వ్యాధులన్నవారు, క్రెజ్డ్ ఫోల్డ్ జాకబ్ వ్యాధి, అల్జీమర్స్, మల్టిపుల్ స్ల్కెరోసిస్, బ్లడ్ క్యాన్సర్, ట్యూమర్లు ఉన్నవారు, మత్తు పదార్ధాలు వాడేవారు నేత్రదానానికి అనర్హులు. విషప్రభావంతో మరణించిన వారి కళ్లు పనిరావు. వాటిని సేకరించటానికి ప్రయత్నం కూడా జరగదు.
నేత్రదానం గురించి కొన్ని అపోహలు
అపోహ : కళ్లను దానం చేసి కళ్లు లేని దేహాన్ని ఖననం లేదా దహనం చేస్తే మరుసటి జన్మలో కళ్లులేకుండా పుడతారని, అందుకు మతాలు ఒప్పుకోవనిది ఒక అపోహ.
నిజం : ఇది కేవలం నిరాధారమైన అపోహ మాత్రమే. నిజానికి ఏ మతమైనా దాతృత్వాన్ని ప్రభోదిస్తుంది.
అపోహ : క్యాటరాక్ట్ చేయించుకున్న వాళ్ల కళ్లు నేత్రదానానికి పనికి రావంటారు
నిజం : క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నా సరే….కళ్లను నిరభ్యంతరంగా దానం చేయవచ్చు.
అపోహ : ముసలివాళ్ల కళ్లు దానానికి పనికి రావు. వయసులో ఉన్నవారి కళ్లు మాత్రమే పనికి వస్తాయి.
నిజం : ఏడాది నిండిన పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవరైనా సరే అందరూ నేత్రదానం చేయవచ్చు.
అపోహ : బతికి ఉన్న వాళ్లు కూడా జీవించి ఉండగానే కళ్లు దానం చేయవచ్చా?
నిజం : కేవలం చనిపోయిన వారి నుంచి మాత్రమే కళ్లను స్వీకరిస్తారు. చూపు పోయి బతికి ఉన్నవాళ్లయినా సరే కళ్లను స్వీకరించరు.

Blood Donation….రక్తదానం

చేయదగిన వారు : ఆరోగ్యవంతులైన 18 నుండి 55 సంవత్సరాల వయసున్న వారు రక్తదానం చేయవచ్చు. మగవారైతే ప్రతి మూడునెలలకు ఆడవారైతే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చును. కొన్ని ప్రమాణాల ఆధారంగా రక్తదాతలు :
12.5 జి / డి.ఎల్‌ కన్నా ఎక్కువ హిమోగ్లోబిన్‌ వున్నవారు. నాడి కొట్టుకునే వేగం నిమిషానికి 50 – 100 మధ్య వున్నవారు. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా వున్నవారు. బరువు 46 కిలోల కన్నా ఎక్కువ వున్నవారు.
రక్తదానం చేయకూడని వారు :
గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, గర్భస్రావం అయినవారు, నెలసరిలో ఉన్న స్త్రీలు.
స్థిరాయిడ్లు, హార్మోన్‌ మందులు, ఏవైనా ప్రత్యేక మందులు వాడుచున్నవారు.
హెచ్‌.ఐ.వి / లైంగిక వ్యాధులు / ఇన్‌ఫెక్షన్లు వున్నవారు. మాదకద్రవ్యాలు సేవించేవారు.
మలేరియా. టైఫాయిడ్‌, కామెర్ల వంటి వ్యాధులు వున్నవారు.
గత ఆర్నెల్ల కాలంలో ఆపరేషన్లు చేయించుకున్నవారు.
రక్తదానానికి ముందు24 గంటల సమయంలో మద్యం త్రాగినవారు.

అపోహలు : రక్తదానం చేసిన తరువాత హోమోగ్లోబిన్‌ పడిపోతుందని అపోహ. ఒకసారి 470 మి.లీ. కంటే తక్కువే తీసుకుంటారు కాబట్టి మన శరీరం ఈ రక్తాన్ని త్వరగానే భర్తీ చేసుకుంటుంది.
రక్తదానానికి ఎక్కువ సమయం పడుతుందని కొందరి అపోహ. కాని గంటకన్నా ఎక్కువ సమయం పట్టదు.
రక్తదానం చేసిన తరువాత ఎలాంటి అనారోగ్యం తలెత్తదు. కొన్నిగంటలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది.
రక్తదానం చేస్తే ఇన్‌ఫెక్షన్లు వస్తాయని చాలామంది భయపడతారు. కాని శుభ్రమైన (స్టెరిలైజ్డ్‌) పరికరాలు వాడితే ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రావు.

రక్తదానం

రక్తదానం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకరి రక్తదానం ముగ్గురు మనుషులని కాపాడుతుంది. దీని వల్ల ఎదుటివారికే కాదు.. మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

blood donation toi
రక్తదానం అనేది.. ఎదుటివారి ఆరోగ్యం, వారిని రక్షించేందుకు మాత్రమే కాదు. మన ఆరోగ్యం కూడా చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. రక్తదానం చేసినవారికి మానసిక, శారీరక ప్రయోజనాలు ఉన్నాయి..అవేంటంటే..

– ఒత్తిడి తగ్గుతుంది
– నెగెటీవ్ ఫీలింగ్స్ తగ్గడం
– మానసికారోగ్యం
– శారీరక ఆరోగ్యం..

ఫ్రీ చెకప్

ఇంకో బెనిఫిట్ ఏమిటంటే బ్లడ్ డొనేషన్ వల్ల ఫ్రీ గా చెకప్ అయిపోతుంది. ఎందుకంటే మీరు బ్లడ్ డొనేట్ చేసే ముందు మీ బీపీ, టెంపరేచర్, పల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేస్తారు. దీంతో పాటు మీ బ్లడ్ ని హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ, హెచైవీ, వెస్ట్ నైల్ వైరస్, సిఫిలిస్ లాంటి టెస్ట్స్ కూడా చేస్తారు.
ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా?

ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రావు. కొంతమందికి బ్లడ్ డొనేషన్ తర్వాత వికారంగా, తల తిరుగుతున్నట్లుగా అనిస్తుంది. ఇవి కొన్ని నిమిషాల పాటూ మాత్రమే ఉంటాయి. అలాంటప్పడు కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకుని పడుకుంటే సరిపోతుంది. అలాగే, సూది గుచ్చిన చోట కాస్తా రక్తం కారుతుంది. అలాంటప్పుడు దూదితో అదిమి పెట్టడమో, రెండు నిమిషాలు చేయి ఎత్తి పట్టుకోవడమో చేస్తే సరిపోతుంది.
రక్తం ఇచ్చిన చాలా సమయం వరకూ తల తిరగడం జరిగినా, సూది గుచ్చిన దగ్గర ఎక్కువగా రక్తం కారుతున్నా, లేదా అక్కడ వాపు కనిపిస్తే, చెయ్యి నొప్పి, తిమ్మిరిగా ఉన్నా వెంటనే బ్లడ్ డొనేషన్ సెంటర్‌ని సంప్రదించండి.

బ్లడ్ డొనేషన్ ఎలా చేయాలి..

ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఐడీ, మెడికల్ హిస్టరీ ప్రొవైడ్ చేయాలి. తరువాత మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు. అంతా ఓకే అనుకున్నాక బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ మొదలౌతుంది. హోల్ బ్లడ్ డొనేషన్ చాలా సింపుల్ ప్రాసెస్. ఈ హోల్ బ్లడ్ ని ఇలాగే ఇంకొకరికి ఎక్కించవచ్చు, లేదా, రెడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా గా సెపరేట్ చేసి ముగ్గురికి అందించవచ్చు.
బ్లడ్ డొనేషన్ ఎలా చేస్తారంటే:
– మీరు కూర్చుని, పడుకుని ఎలా అయినా బ్లడ్ ఇవ్వచ్చు.
– మీ చేతి మీద ఒక ప్రదేశాన్ని స్టెరిలైజ్ చేసి అక్కడ నరంలోకి సూది ఎక్కిస్తారు.
– దాదాపుగా ఓ అర లీటరు రక్తం తీసుకుంటారు. దీనికి సుమారు ఎనిమిది నించి పది నిమిషాల సమయం పడుతుంది.
– ఆ తరువాత సూది తీసేసి అక్కడ బ్యాండేజ్ వేస్తారు.
బ్లడ్ డొనేషనే కాకుండా, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా, డబుల్ రెడ్ సెల్స్ కూడా డొనేట్ చేయొచ్చు.
డొనేషన్ తర్వాత మీకు తినడానికీ, తాగడానికీ ఏమైనా ఇచ్చి 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోమంటారు.

డొనేషన్ కి ముందు..

– మీరు 18 నుంచి 65 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి.

– కనీసం 50 కిలోల బరువు ఉండాలి.

– మీ మెడికల్ హిస్టరీ, మీరు ఆ సమయంలో ఏమైనా మందులు తీసుకుంటే వాటి గురించి వివరంగా చెప్పాలి.

– మీరు హోల్ బ్లడ్ డొనేట్ చేస్తే, మళ్ళీ అలా చేయడానికి కనీసం ఎనిమిది వారాలు ఆగాలి. డబుల్ రెడ్ సెల్ డొనేషన్ అయితే పదహారు వారాలు ఆగాలి.

– ప్రతి ఏడు రోజుల తర్వాత ప్లేట్లెట్స్ డొనేట్ చేయొచ్చు.

బ్లడ్ డొనేట్ చేయబోయేముందు చేయాల్సిన పనులు

– మీ అపాయింట్‌మెంట్‌కి ముందు నీరు ఎక్కువగా తీసుకోండి.