నిరుద్యోగులకు వరం

నిరుద్యోగ భారతం ఎదుర్కొనే ఇక్కట్లు  అన్నీ ఇన్నీ కాదు.  ఫీజుల రూపంలో బోలెడు చెల్లించి కష్టపడి చదివి పట్టా తెచ్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు అతి స్వల్పం. కన్నవాళ్లకు భారంగా మారా మని బాధపడి ఏదో ఒక ప్రైవేటు సంస్థలో కుదురుకున్నా అత్తెసరు జీవితం. దేశంలో రెండున్నర కోట్ల నుంచి 3 కోట్లమంది వరకూ ఉద్యోగార్థులు వివిధ ప్రభుత్వ విభాగాల్లో నియామకాల కోసం ఏటా పరీక్షలు రాస్తారని అంచనా. వీరంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వేర్వేరు ఉద్యోగాలకు విడిగా దరఖాస్తు చేసుకోవడం, శిక్షణ తీసుకోవడం, దూరప్రాంతాలకు పరీక్ష రాసేందుకు పోవడం తప్పడం లేదు. ప్రతి ఉద్యోగానికీ రుసుము చెల్లించడం మరో సమస్య. దరఖాస్తుకే ఇలా వందలాది రూపాయలు ఖర్చుపెట్టవలసిరావడం నిరుద్యోగులకు ఎంతో ఇబ్బందికరం. దశాబ్దాలుగా కోట్లాది మంది నిరుద్యోగులు నిరంతరం ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఎన్‌డీఏ ప్రభుత్వం తొలిసారి పరిష్కారం…

Read More

జాతీయ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ ( NATIONAL RECRUITMNENT AGENCY)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలన్నింటికీ ఓకే పరీక్ష రాస్తే సరిపోతుంది. అంతేకాదు, ఆ పరీక్షలో వచ్చిన స్కోరు కార్డును మూడేళ్ల పాటు ఉద్యోగాల కోసం వాడుకోవచ్చు. ఈ దిశగా సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (CET) నిర్వహించేందుకు ‘జాతీయ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ’ (National Recruitment Agency) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం (ఆగస్టు 19) ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో నాన్-గెజిటెడ్ పోస్టులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఇవపై ఎన్‌ఆర్‌ఏ కామన్ ఎలిజిబిటిటీ టెస్ట్ నిర్వహిస్తుంది. వివిధ ఉద్యోగ నియామకాల్లో ఈ పరీక్షలో వచ్చిన మార్కులనే ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ స్కోరు కార్డుకు మూడేళ్ల పాటు వాలిడిటీ ఉంటుంది. ఈలోగా…

Read More