అత్య‌వ‌స‌ర నిధి (Emergency Fund) ఎంత అవ‌స‌రం? తెలుసుకునేదెలా?

జీవన ప్రయాణంలో ఒడిదొడుకులు సహజం. ఈరోజు ఉద్యోగంలో ఉన్నాం. ప్రతి నెలా జీతం వస్తుంది. ఈరోజు కోసం మాత్రమే కాదు. భవిష్యత్తు కోసమూ ఆలోచించాలి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు. వాటిని ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ఇందులో భాగమే అత్యవసర నిధి ఏర్పాటు. ప్రతీ ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో తప్పనిసరిగా భాగం కావాలి. ఎంత మొత్తం అవసరం. అత్యవసర నిధి.. ఎంత మొత్తం అవసరమో నిర్ణయించుకునేందుకు రెండు విధానాలు ఉన్నాయి. మొదటిది ఆదాయం, ఖర్చులను బట్టి అంచనా వేయడం. మీరు ప్రతి నెలా ఎంత సంపాదిస్తున్నారు. ఇందులో ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలి. కనీసం 6 నుంచి 12 నెలల సంపాదనతో అత్యవసర నిధి ఏర్పాటు చేయడం మంచిది. ఒకవేళ మీరు స్వయం ఉపాధి పొందుతున్న వారైతే మీ…

Read More