సంతోషం – ఆలోచనా విధానం
మన సంతోషానికీ, తృప్తికీ ఎల్లలు ఏర్పరుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆ హద్దులు మీరితే ఎటువంటి సంతోషమైనా మనిషికి తృప్తిని ఇవ్వలేదు. చిల్లుపడిన బానలో ఎన్ని నీళ్ళు పోసినా నిలవనట్లే తృప్తి చెందలేని స్వభావం కలిగిన మనుషులకి ఏ సంతోషమూ దక్కదు. ” ఇది లేకపోతే నేను సంతోషంగా ఉండలేను ” అని కొన్ని అనవసరమైన కోరికలను కోరుకుంటాం మనం, అదే మనలోని లోపం. ఇలాంటి వారి మనసెప్పుడూ అసంతృప్తితో నిండిఉండి తన దగ్గరలేని వాటి గురించి చింతిస్తూ ఉంటారు. చిల్లుని బాగు చేస్తే కుండ నిండుతుంది కదా. అదేవిధంగా మన మనసులోని లోపాన్ని సరిదిద్దుకున్నప్పుడు మనలో సంతోషం వెల్లివిరుస్తుంది. ” సంతోషమనేది తాళంకప్పలాంటిది… జ్ఞానం తాళంచెవి వంటిది… తాళంచెవిని ఒకవైపుకి తిప్పితే సంతోషం తలుపులు మూసుకుపోతాయి…మరోవైపుకి తిప్పితే సంతోషం దర్వాజాలు మనకోసం తెరుచుకుంటాయి… అదెటువైపు తిప్పాలనే…
Read More
You must be logged in to post a comment.