పోస్టుమార్టెమ్

భారతదేశంలో నున్న చట్టం ప్రకారం, అన్ని మెడికోలీగల్ కేసులకీ పోస్టుమార్టెమ్ చేస్తారు. అంటే – ఏ ఏ సందర్భాలలో మృతి అనుమానాస్పదమో, ఆయా కేసులలో. అంటే – రోడ్డు ప్రమాదాలు, విషం తీసికోవటం, ఆత్మహత్య, హత్య, అగ్నికి ఆహుతి కావటం, నీళ్ళలో మునిగి చనిపోవటం, బాంబు ప్రేలుడులు, వగైరా. చట్టం: ‘అనుమానాస్పద మృతి’ అన్నాము కదా! అనుమానం ఎవరికి? అంటే – ఆ మృతదేహాన్ని చూసిన డాక్టరుకు లేదా ఆ కేసును పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారికి, అనుమానం వస్తే చాలు. ఆ అనుమానం వారి వారి విజ్ఞానాన్ని బట్టి, విజ్ఞతను బట్టి, అనుభవాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, – ఇలా. ‘నీకు అనుమానం ఎందుకు వచ్చింది?’ అని వారిని ఎవరూ అడగకుండానే, వారంతట వారే కేసును ‘మెడికోలీగల్’ చేసే అధికారాన్ని భారత న్యాయవ్యవస్థ వారికిచ్చింది.…

Read More