ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకు.. బీఏ నుంచి ఎంబీఏ దాకా.. ఏ కోర్సు పూర్తవుతున్నా.. కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అడిగే కామన్ ప్రశ్న.. తర్వాత ఏంటి..? అని!! ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థుల్లో చాలా మంది ఇప్పుడీ ప్రశ్నకు ‘స్టార్టప్ పెడతా’ అంటూ.. సమాధానం ఇస్తున్నారు.
|
![]() కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం- స్థాపించి/నమోదుచేసుకొని పదేళ్లలోపు ఉన్న, ఏ ఆర్థిక సంవత్సరంలోనూ రూ.100 కోట్ల టర్నోవర్ దాటని ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ లేదా పార్టనర్షిప్ కంపెనీ లేదా లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలను స్టార్టప్‌లుగా వ్యవహరిస్తారు. కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా ప్రముఖ రంగాలు నేల చూపు చూస్తుండటంతో.. ప్రస్తుతం స్టార్టప్ భవిష్యత్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. భారత్ భేష్ ! బడ్జెట్ భరోసా.. పీఎంఈజీపీ స్టాండప్ ఇండియా:పత్యేకించి వెనుకబడిన వర్గాలను ప్రోత్సహించే ఉద్దేశంతో స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికింద ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు మహిళలకు రుణ సదుపాయం కల్పిస్తారు. ఇతర జనరల్ కేటగిరీలకు చెందిన వారు ఎస్సీ, ఎస్టీ, మహిళా భాగస్వాములతో కలిసి స్టాండప్ ఇండియా పథకంలో రుణం పొందవచ్చు. సదరు భాగస్వామికి కంపెనీలో 51శాతం వాటా ఉండాలి. ఈ పథకం కింద రూ.90 పైసల నుంచి రూ.1 వడ్డీతో రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణం మంజూరు చేస్తారు. కొత్తగా స్టార్టప్‌ను ప్రారంభించిన వారంతా స్టాండప్ ఇండియా లోన్‌కు వెళ్లొచ్చు. కొత్తలో వెళితే లోన్ మొత్తం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ పెట్టిన ఏడాదికి కంపెనీ విస్తరణకు లోన్‌కు వెళితే అధిక మొత్తం చేతికందుతుంది. స్టాండప్ ఇండియా పథకం కింద రుణం పొందేందకు కంపెనీ రిజిస్ట్రేషన్ వివరాలు, కంపెనీ పాన్, ట్యాన్, సీఐఎన్ వివరాలు, ప్రాజెక్టు రిపోర్టు తదితరాలను అందించాల్సి ఉంటుంది. ఆర్బీఐ ప్రకటించిన 27 షెడ్యూల్ బ్యాంకుల నుంచి స్టాండప్ ఇండియా రుణాలు పొందవచ్చు. స్టాండప్ ఇండియా హెల్ప్ సెంటర్‌తోపాటు చార్టెడ్ అకౌంటెంట్లను సంప్రదించి కంపెనీ డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు. ముద్ర యోజన: ముద్ర స్టార్టప్ లోన్ రకాలు: ప్రయివేటు ఫండింగ్:
క్రౌడ్ ఫండింగ్ : అనుకూల రంగాలు :
మంచి టీమ్ ఉండాలి.. స్టార్టప్ ప్రారంభించాలనుకొనే వారు ముందు టీమ్‌పై దృష్టిసారించాలి. మంచి టీమ్, బిజినెస్ అవకాశం ఉన్నప్పుడే ఫండింగ్ సులభంగా లభిస్తుంది. స్టార్టప్ కంపెనీ పెట్టిన వారు మొదట్లో పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి. కంపెనీ ఏర్పాటుకు సంబంధించి భవనాలు, ఇతర సౌకర్యాలపై ఎక్కువగా వెచ్చించడం సరికాదు. అలాగే పెద్ద మొత్తంలో జీతాలు కోరుకునే వారికంటే.. తక్కువ వేతనంతో బాగా పనిచేయగలిగేవారిని ఎంపికచేసుకోవాలి. కంపెనీతో దీర్ఘకాలం ప్రయాణించేవారిని ఉద్యోగులుగా నియమించుకోవడం లాభిస్తుంది. ఖర్చులు, పెట్టుబడి విషయంలో తెలివిగా వ్యవహరించాలి. స్టార్టప్‌లు సాధ్యమైనంత పొదుపు పాటించి… రెండేళ్లలో నిలదొక్కుకొనేలా ప్రయత్నించాలి. |
Category: JOBS_STARTUPS
అమెజాన్ లో సెల్లార్ గా బిజినెస్ చేయాలనుకునేవారు ఇవి తప్పకుండా తెలుసుకోవాలి
బిజినెస్ చేయాలనుకునేవారికి వున్న అవకాశాలలో అమెజాన్ , flipkart లాంటి eCommerce వెబ్సైటు ల ద్వారా బిజినెస్ చేయడం అనేది కూడా ఒకటి .
అమెజాన్ , flipkart లాంటి ఫేమస్ eCommerce వెబ్సైటు లలో seller గా జాయిన్ అయి బిజినెస్ చేయవచ్చు . ఇలా eCommerce వెబ్సైటు లలో బుసినెస్ చేయాలనుకోనేవారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం…
- అమెజాన్ లో సెల్లార్ గా జాయిన్ అయి బిజినెస్ చేయాలనుకునేవారు ముందుగా ఎలాంటి ప్రోడక్ట్ సేల్ చేయాలి ?
- సేల్ చేయాలనుకున్న ప్రోడక్ట్ లు అమెజాన్ లో ఎంత వరకు profit వస్తుంది ?
- Best Selling products ఏంటి? అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి.
- అమెజాన్ వెబ్సైటు లో లక్షల్లో ప్రోడక్ట్ వుంటాయి కదా ? మరి ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని సేల్ చేయాలి అనేది కొంచం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ విషయాలు ముందుగా రిసెర్చ్ చేసి తెలుసుకొని బిజినెస్ ప్రారంభించడం మంచిది.
అమెజాన్ వెబ్సైటు లోకి వెళ్లి , ఈ విషయాలు చెక్ చేసి analysis చేసి తెలుసుకోవచ్చు. దీనికోసం అమెజాన్ వెబ్సైటు లో ఎక్కువగా సేల్ అయ్యే ప్రోడక్ట్ వివరాలు రీసెర్చ్ చేసి తెలుసుకునేందుకు అవకాశం ఉంది. అమెజాన్ లో తెలుసుకోవడమే కాకుండా మార్కెట్ ఎనాలిసిస్ కూడా చేసి , ఎలాంటి ప్రొడక్ట్స్ సేల్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుందో తెలుసుకోవడం ఎంతో మంచిది. ఈ రీసెర్చ్ అనేది పక్కాగా చేసుకోగలిగితే … ఒక్క అమెజాన్ వెబ్సైటు లో కాకుండా flipkart లాంటి ఇతర eCommerce వెబ్సైటు లో కూడా seller గ join అయి బిజినెస్ చేసుకోవచ్చు.
Amazon website లో ఉన్న లక్షల ప్రొడక్ట్స్ లో ఏ బిజినెస్ చేయడానికి ఏ ప్రోడక్ట్ best సెల్లింగ్ ప్రోడక్ట్ ? margins ఏ ప్రోడక్ట్ సేల్ చేస్తే వస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలి .
Product రిసెర్చ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి … అవేంటంటే ….
- Low Computation High demand ; Computation తక్కువగా ఉంది డిమాండ్ ఎక్కువ వున్నా ప్రోడక్ట్ ల కోసం రిసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ,
- margins లాభసాటిగా ఉండేలా మనం సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ ఉండాలి ,
- season లో మాత్రమె అమ్ముడుపోయే ప్రొడక్ట్స్ జోలికి పోకుండా year మొత్తం సేల్స్ వుండే ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
- Lightweight items సెలెక్ట్ చేసుకోవాలి , Light weight ఎందుకంటె .. buyer కి ship చేసేటప్పుడు Shipping charges weight బట్టి ఉంటాయి. వెయిట్ తక్కువ వుంటే Shipping charges ,risk మరియు maintenance తక్కువగా ఉంటాయి . దీనిద్వారా కూడా కొంచం గా ప్రాఫిట్ పెంచుకోవచ్చు.
- ప్రతిరోజు 10 కనీసం ప్రోడక్ట్ లు అమ్ముడయ్యేలా వుండే ప్రోడక్ట్ లను ఎంచుకోవాలి.
అమెజాన్ వెబ్ సైట్ లో వివిధ రకాల ప్రోడక్ట్ ల categories అన్నీ లిస్టు చేసుంటాయి. ఏ ప్రోడక్ట్ మంచిది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుందనే Overview అనేది ఉంటుంది. ఎక్కువగా సేల్ అయ్యే ప్రోడక్ట్ లలో టాప్ 100 rank వుండే ప్రోడక్ట్ ల వివరాలు దొరుకుతాయి. దీనిబట్టి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు .
బిజినెస్ లో మీ ప్రత్యర్థిని సమర్ధవంతంగా ఎదుర్కోవడం ఎలా ?
బిజినెస్ లో మీ ప్రత్యర్థిని సమర్ధవంతంగా ఎదుర్కోవడం ఎలా ?
Startup బిజినెస్ చేసే వారు మంచి బ్రాండింగ్, ప్లానింగ్, కస్టమర్ satisfaction ఇవి మాత్రమే కాదు.
ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలి ? వారి వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగట్టి , వారి వలన మన బిజినెస్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా ప్రత్యర్థులను సమర్ధవంతం గా తిప్పికొట్టాలి మరియు పోటీ ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
బిజినెస్ లో ప్రత్యర్థి కదలికలను గమనిస్తూ ఉండాలి
బిజినెస్ లో ప్రత్యర్థి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు ? కస్టమర్ లను తమ వైపు తిప్పుకోవడానికి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ? అనేది కనిపెడుతూ దానికి తగినట్లు మన కదలికలను వేయాల్సి ఉంటుంది.
అలాగని ఎప్పుడు ప్రత్యర్థి ఏం చేస్తున్నాడు అనే దాని కోసం మన విలువైన సమయాన్ని మొత్తం వృధా చేయకూడదు. ప్రత్యర్థి మార్కెట్లో ఎలా వ్యూహ రచన చేస్తూ ముందుకు పోతున్నాడు , అనే దాని గురించి, వారి యొక్క బలాలు , బలహీనతలను గమనిస్తూ ఉండాలి.
ప్రత్యర్థి నుండి కూడా కొన్ని నేర్చుకోవాలి
మనలో లోపాల గురించి మనకంటే మన ప్రత్యర్థికి ఎక్కువ తెలుస్తాయి. తప్పిదాలు చేస్తూ , ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదు.
వారు చేసే బిజినెస్ లో ఏమైనా తప్పులు చేస్తుంటే, వాటిని గమనిస్తూ అలాంటి తప్పులు మనం చేయకుండా జాగ్రత్త పడటం నేర్చుకోవాలి.
మార్కెటింగ్ అనేది ఏ బిజినెస్ కి అయినా చాలా ముఖ్యం.కస్టమర్ ని తమ వైపు రాబట్టుకోవడం లో వారు అనుసరిస్తున్న మార్గాలు గమనిస్తూ , వారి నుండి కూడా కొత్త విధానాలను నేర్చుకుంటూ మన ఆలోచనలకు పదును పెడుతూ, సరికొత్త విధివిధానాల ద్వారా మార్కెటింగ్ సమర్ధవంతం గా చేస్తూ బిజినెస్ ని విజయవంతంగా నడిపించాలి.
పోటీ తత్వం ఉంటేనే మనం ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి సరి కొత్త ఆలోచనలు చేస్తూ ఉండాలి.
మనలోని సృజనాత్మకత బయటికి తీస్తూ అభివృద్ది దిశగా బిజినెస్ ను నడిపించేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది.
సరైన క్వాలిటీ , బ్రాండింగ్, కస్టమర్ Satisfaction
కస్టమర్ కి సరైన క్వాలిటీ ప్రోడక్ట్ అందజేయడం, వారికి వచ్చిన సందేహాలు సహనం తో తీర్చడం , వారికి మీ వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ సర్వీస్ చేయడం లాంటివి కూడా మీ బిజినెస్ కు ఎంతో అనుకూలిస్తాయి. మీ కస్టమర్ లను మీ ప్రత్యర్థి వైపు వెళ్ళకుండా చూసుకోవచ్చు.
ప్రత్యర్థి చేసే మానసిక దాడిని ఎదుర్కునే మనస్థైర్యం అలవరచుకోవాలి
మానసికంగా మిమ్మల్ని దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు గోతి కాడ నక్క లా కాచుకొని కూర్చొని ఉంటారు. మాటలతో , చేతలతో మీ మనస్థైర్యాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
అలాంటి వారి మాటలను అసలు పట్టించుకోవద్దు. సహనం గా ఉంటూ, సమర్ధవంతంగా వారి వ్యూహాలను, ప్రతి వ్యూహాలతో తిప్పికొడుతూ, బిజినెస్ కి ఎలాంటి నష్టం లేకుండా చూసుకోవాలి.
బ్రాండింగ్ ని కాపాడుకోవాలి
బిజినెస్ ప్రారంభించే ముందుగా, బ్రాండింగ్ సంబంధించిన విషయాలు అందరి ముందు ప్రస్తావించ వద్దు (బిజినెస్ నేమ్ , Logo, వెబ్సైటు నేమ్ ).
మార్కెట్ లోకి మీ బిజినెస్ ప్రారంభించే వరకు ఇలాంటి విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది.
మీ బిజినెస్ ని దెబ్బతీయడానికి , అవకాశం దొరికితే మీ వెనుక గోతులు తవ్వేందుకు ఎంతో మంది వేచి చూస్తూ ఉంటారు .
సమయస్పూర్తితో అలాంటివి మీ సమయస్పూర్తితో తిప్పి కొడుతూ , బిజినెస్ ను విజయవంతంగా నడిపించేందుకు కృషి చేయాలి.
యూట్యూబ్ ఛానల్
యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి కావాల్సిన టూల్స్

Camera
మంచి కెమెరా అంటే మన దగ్గర ఉన్న కెమెరానే మంచి కెమెరా. అది మొబైల్ కెమెరా అయినా సరే. ఒకవేళ మీరు మంచి కెమెరా కొనాలి అనుకుంటే మీరు తీసే వీడియోలను బట్టి ప్రొఫెషనల్ కెమెరామెన్ ని సంప్రదించి కెమెరా ని కొనండి. ప్రస్తుతం వస్తున్నా స్మార్ట్ ఫోన్లకు కెమెరా బాగానే ఉంటుంది. ప్రారంభంలో మనం మన దగ్గర ఉన్న మొబైల్ కెమెరా తో వీడియోలను షూట్ చేయొచ్చు.
Tripod
Tripod ఉంటేనే వీడియోని బాగా షూట్ చేయడానికి వీలు అవుతుంది. కెమెరా ని ఒక frame లో సెట్ చేసుకొని మనం షూట్ చేసుకోవొచ్చు. నేను ప్రస్తుతం Amazon Basics Tripod ని వాడుతున్నాను. యీ tripod ని మనం ప్యాక్ చేసుకొని మన బ్యాగ్ లో తీసుకెళ్లవచ్చు. ఇది వాడిన తరువాత కూడా అంతే జాగ్రత్తగా ప్యాక్ చేసి బ్యాగ్ లో పెట్టుకోవాలి. outdoor షూటింగ్స్ లో కూడా యీ tripod ని వాడుకోవొచ్చు.
Mic
ఒక వీడియో లో వీడియో కి మనం ఎంత ప్రాధాన్యతని ఇస్తామో, అంతే ప్రాధాన్యతని మనం ఆడియో కి కూడా ఇవ్వాలి. మనం వాడే మొబైల్ కెమెరాలో కూడా మైక్ ఉంటుంది కానీ ఆ mic అంత క్లియర్ గ ఉండదు. పైగా కెమెరా మనకు దూరంగా ఉండి షూట్ చేయాల్సి వచ్చినప్పుడు mic కూడా దూరంగా ఉంటుంది. అటువంటి సమయాల్లో ఆడియో సరిగ్గ రికార్డు అవ్వదు. ఇటువంటి సమస్యని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా mic ఉండాల్సిందే. ప్రారంభంలో మనం బోయా mic తో స్టార్ట్ చేయొచ్చు. నేను ప్రస్తుతం బోయా mic నే వాడుతున్నాను యూట్యూబ్ వీడియోస్ కోసం.
Lighting
రాత్రి రికార్డు చేస్తున్న సమయాల్లో కానీ, వెలుతురు సరిగ్గా లేని స్థలాల్లో వీడియో ని క్లియర్ గ రికార్డు చేయాలంటే మంచి లైటింగ్ ఉండాల్సిందే. నేను ప్రస్తుతం LED Ring Light వాడుతున్నాను. Yellow, White, Yellow + White లో లైటింగ్ సెట్ చేసుకోవొచ్చు. యీ light స్టాండ్ కె మన మొబైల్ పెట్టుకొనే హోల్డర్ ఉంటుంది కానీ అది indoor షూటింగ్స్ లో మాత్రమే వాడుకోవొచ్చు. outdoor షూట్ కి అనుకుంటే మీరు tripod కొనాల్సిందే.
Video Editing Apps
- InShot
- Premiere Rush (if your mobile supports)
- Kinemaster
మీరు మీ laptop గాని desktop లో గాని వీడియో ఎడిటింగ్ చేయాలి అనుకుంటే davinci resolve అనే ఫ్రీ వీడియో ఎడిటింగ్ టూల్ ని download చేసుకొని ఎడిటింగ్ చేయండి. ఫ్రీ వెర్షన్ ని మాత్రమే డౌన్లోడ్ చేయండి.
other resources
మీకు అవసరం అవ్వొచ్చు అనుకొని ఇస్తున్న వీడియో లింక్స్
How to Create YouTube Channel? (PART-1)
How to Create YouTube Channel? (PART-2)
How to Design YouTube Thumbnails?
Canva Tutorial in Telugu – Digital John
యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించటం ఎలా?
యూట్యూబ్ అనేది వీడియో సెర్చ్ ఇంజిన్
యూట్యూబ్ లో డబ్బు సంపాందించాలి అంటే మనకి కచ్చితంగా ఎదో ఒక స్కిల్ అనేది ఉండాలి.
1. మీకు గేమ్స్ అంటే ఇష్టం ఐయితే ఆ గేమ్స్ మీద వీడియోస్ చేయండి.
2. మీకు మూవీస్ అంటే ఇష్టం ఐయితే మూవీస్ మీద వీడియోస్ చేయండి.
3. మీకు వైల్డ్ లైఫ్ ఇష్టం ఐయితే వైల్డ్ లైఫ్ మీద చేయండి.
4. మీకు హెల్త్ టిప్స్ బాగా తెలుసు అనుకుంటే వాటిమీద చేయండి.
5. మీకు వంటలు చేయడం ఇష్టం ఐయితే వంటలు మీద చేయండి.
6. గాడ్జెట్స్ మీద రివ్యూస్.
ఇలా మనము చెప్పుకుంటే పొతే చాల ఉంటాయి ఎందుకంటే ఒక్కొరికి ఒక్కోటి ఇష్టం.
మీరు వీడియోస్ పెట్టగానే డబ్బులు రావు
మీ ఛానల్ కి కచ్చితంగా 1000 మంది Subscribers ఉండాలి అలాగే 4000 గంటలు మీ వీడియోస్ చూసి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు గూగుల్ యాడ్స్ కి అనుమతి లభిస్తుంది .
టిప్స్
1. ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే మీకు వ్యూస్ అండ్ డబ్బు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది .
2. టైటిల్స్ కరెక్ట్ గ పెట్టాలి.
3. వీడియో కి సంబందిచిన టాగ్స్ కచ్చితంగా ప్రతి వీడియోకి యాడ్ చేయాలి.
4. యూజర్స్ సెర్చ్ చేసే దానిమీద వీడియోస్ చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాసం ఉంటాది.
ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించడం ఎలా?
ప్రొద్దున్నే ఫుట్ పాత్ మీద ఇడ్లీలు, వడలు అమ్ముతుంటారు. ఒక ప్లేట్ ఇరవై రూపాయలు చొప్పున ఒక వంద మందికి అమ్మినా 2000 రూపాయలు వస్తాయి. వెయ్యి రూపాయలు ఖర్చులకు పోయినా వేయి రూపాయలు మిగులుతాయి. ఈ వ్యాపారం లో కనీసం 50% లాభం ఉంటుంది. రోజుకు పని చేసేది 5 గంటలు మాత్రమే.(ఉదయం6 గంటలనుండి 11 గంంటల వరకే).
ట్రైన్స్ లో సమోసాలు అమ్మే వాళ్లు కూడా రోజుకు రెండు వేలు సంపాదిస్తారు.
తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో టాక్సీలు నడిపితే నెలకు లక్ష లేదా రెండు లక్షలు సంపాదించవచ్చును.
పట్టణాల్లో పని చేసే బార్బర్ షాపులు, యిస్త్రీ బళ్లు ,రైల్వే పార్టర్లు, రోజుకు వేయి రూపాయలు పైననే సంపాదిస్తారు
ఏపని అయినా చేసేందుకు సిద్ధంగా ఉంటే మన దేశంలో గవర్నమెంట్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదించవచ్చును.
50 వేల రూపాయలతో ఎటువంటి వ్యాపారం చేయొచ్చు?
50 వేలతో చాల వ్యాపారలు చేయవచ్చు.
1. కొనడం అమ్మడం
మీకు అంతర్జాలంలో నైపుణ్యం ఉంటె అమెజాన్ నుండి మీరు బాగా వ్యాపారం చేయవచ్చు అది ఎలాగ అంటే
మీరు పైన చూపించిన బొమ్మ లో చూసింది బియ్యం, కూరగాయలు మరియు పండ్లు కడుకునే పాత్ర అమెజాన్ లో వెల 100 రూపాయలు నుండి 150 రూపాయలు దాక ఉంది మరియు ఎంత మంది రేటింగ్స్ ఇచ్చారో చూడవచ్చు .
ఇప్పుడు ఈ క్రింద బొమ్మను గమనిస్తే అదే వస్తువును ఇండియన్ మార్ట్ లో 30 రూపాయలు నుండి 50 రూపాయలు దాక ఉంటుంది.
మనం 500 ఆర్డర్స్ ఇస్తే మీకు 20 రూపాయలు కూడా రావచ్చు. ఇలాంటివి వస్తువులును మీరు బాగా పరిశీలిస్తే అమెజాన్ లో చాలా ఉన్నాయి.