ఉద్యోగ ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు సాధారణంగా చేసే తప్పులు

1. ఒక అంశం గురించి పూర్తిగా అవగాహనా లేకపోయినా ఆ విషయాన్ని లేవనెత్తి, తరువాత ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోవడం (దీనివల్ల ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కి అప్పటివరకు ఉన్న మంచి అభిప్రాయం పోతుంది).

2. తెలియని విషయాల్ని తెలిసినట్టు రెస్యూమే లో ఉంచడం.

3. ప్రశ్నని పూర్తిగా వినకుండా సమాధానం చెప్పడం.

4. తన పాత కంపెనీ ని తక్కువ చేసి చెప్పడం. మనజీరియాల్ రౌండ్ లో ముఖ్యంగ అడిగే ప్రశ్న “ఎందుకు పాత కంపెనీ ని వదిలి రావాలి అనుకొంటున్నావ్?”. ఈ ప్రశ్న కి సమాధానం చెప్పేటప్పుడు చాల జాగ్రత్త వహించాలి. మనం ఎప్పుడు పని చేస్తున్న కార్యాలయం ని తక్కువ చేసి చెప్పకూడదు.

5. తెలియని ప్రశ్నని నిజాయితీగా ఒప్పుకోవడం మంచిది.

6 . బాగా తెలిసిన విషయాన్నీఎక్కువ సమయం వెచ్చించి చెప్పడం కూడా కొన్నిసార్లు కీడు చేస్తుంది.

7. మంచి ఉదాహరణ ని తీసుకోకపోవడం, ముఖ్యంగా ఒక విషయం గురుంచి వివరించేటప్పుడు తీసుకొనే ఉదాహరణ చాలా సరళంగ మరియు ఇంటర్వ్యూ చేసేవ్యకి అర్ధం అయ్యే ల ఉండాలి .

ఇంటర్వ్యూ – సెల్ఫ్ ఇంట్రడక్షన్

ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు చాలా జాగ్రతగా మీ సీవి లేదా రేసుమే రాయండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక కంపెనీకి వెళ్ళాక లేదా ఇంటర్వ్యూ ఆహ్వానం మేరకు మీరు వెళ్ళక ముందే HR వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. అభ్యర్థి కంపెనీకి ప్రాజెక్ట్ కి సరిపోతాడ లేదా అని.

సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా సింపుల్ గా ఉండాలి. ముందు మీ పేరు చెప్పాలి, అంటే ఫుల్ నేమ్ మీ ఇంటి పేరుతో సహా.

తర్వాత మీరు ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని కంపనీలో చేశారు అని ఒక దాని తరువాత ఒకటి వివరించాలి. మీ designation కూడా చెప్పండి. ఆయా కంపనీలో మీ జాబ్ రెస్పాన్సిబిలిటీ లు వివరించండి.

చాలా క్లుప్తంగా చెప్పండి. సోది మాత్రం చెప్పకండి. IT బాషలో crisp and catchy అంటారు.

ఎప్పుడు కూడా అవతలి వ్యక్తి కంటే మీరు ఒక మెట్టు ఎక్కువ అని తెలుపవద్దు. అట్లాగే ఓవర్ కాన్ఫిడెన్స్ చూపొద్దు.

రేసుమ్ దాటి ఏది చెప్పవద్దు , లేదంటే ఇరుకులో పడ్డట్టే. వెంటనే ఎలిమినేట్ చేసేస్తారు. మీ హాబీస్ వద్దు. మీ అకడమిక్ బ్యాక్గరౌండ్ కూడా చెప్ప వద్దు వాళ్ళు అడిగితేనే కానీ. మీరు చెప్పిన దాని బట్టే, నెక్స్ట్ క్వెషన్స్ ఉంటాయి అని గుర్తు పెట్టుకోండి.

కొంత మంది HR లు చాలా ట్రికీ గా అడుగుతారు మనం చెప్పిన దాంట్లో నుంచే. అందుకని స్ట్రెయిట్ గా ఆన్సర్స్ ఇవ్వండి. కొంచెం తేడా కొట్టిన మీరు పవిలియన్ కి వచ్చేస్తారు. అసలు manipulate చేయవద్దు. మాట్లాడే టప్పుడు ఎక్కడ ఆగ వద్దు. మీ కమ్యూనికేషన్ చూడటానికే ఈ సెల్ఫ్ ఇంట్రూడుక్షన్ అని మరచి పోవద్దు.

మీ కమూనకేషన్ స్కిల్స్ సరిగా లేకపోతే, ఇంక వేరే రౌండ్ లకు వెళ్ళటం కష్టం , మీరు చాలా ఎక్సెప్షనల్ అయితే కానీ.

ఒక ఉదాహరణ

I am Ravi Shankar godi, working as an analyst for xxx company. I have been associated with the company since may,2017.

My daily activities or tasks include, developing code, perform unit testing and document them on hourly basis. Unresolved issues are triaged and segregated to different teams which are not in my radius.

Prior to XXX company I worked for zzz company for 3 years i.e, may 2014 to April 2017 as a trainee.

During my probation, I was assigned into different projects. I got an opportunity to learn and explore on different languages. That’s how I inculcated my interest in development. Although, I worked on Java, SQL but my major interest was into java.

కచ్చితంగా ఒక 3 నిమిషాలకు మించ కూడదు.

Personality Vs Character

ఒకటేమో కనపడేది ఇంకోటి మీదకి కనిపించనిది కానీ అంతర్గతంగా పనిచేసేది

అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న మాట కన్నా పర్సనల్ డెవలప్మెంట్ అన్న మాట మెరుగు అది రెంటినీ సూచిస్తుంది. కానీ అంతర్గత విషయాల పై శ్రద్ధ పెట్టి ఫలితం కనపడేలా చేసే ప్రక్రియ సమయం పట్టే ప్రక్రియ ఈ విషయంలో షార్ట్ కట్ లు తీసుకున్నా దాని వలన దీర్ఘకాలంలో నష్టమే కానీ లాభం తక్కువ

ఒకటి వదిలి ఇంకోటి చేయమని కాదు రెంటిమీద తగిన దృష్టి పెట్టాలి అని

గెలుపుని మధ్యలో వదిలేయకూడదు

ఒకసారి ఓడిపోతే విజయం సాధించలేము అని కాదు ఇంకోసారి ప్రయత్నం చేయాలి ఆ ఓటమి మనకు మరింత ఓర్పును సహనాన్ని పెంచుతుంది కాబట్టి అనుకున్నది ఎప్పుడైనా సాధించవచ్చు. కొంత మంది ఒక ప్రయత్నం తోనే దానికి సాధించాలి అనుకుంటారు ఒకవేళ ఓటమి ఎదురైతే ఇంకో ప్రయత్నం మాటే రాదు కాకపోతే కొందరు పట్టుదలతో చాలా ప్రయత్నం చేసి సాధిస్తారు వీళ్లు ఒకసారి ఓటమిని ఎదుర్కొన్నా మరోసారి కి గెలుపొందచ్చు అని అభిప్రాయపడతారు

విజయం పొందాలనుకునే వారికి ఒక లక్ష్యం తప్పనిసరిగా ఉండాలి అదేంటంటే ఓటమిని స్వీకరించడం మరియు ఓటమి అనే భయం ఉండకూడదు దాంతో అదే ఒక పెద్ద పాఠంగా మనకి శక్తినిస్తుంది. ఒక లక్ష్యం పెట్టుకుని తరువాత వదిలేయడం అనేది వ్యక్తి పై ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తికి స్థిరత్వం, దృష్టి సంకల్పం వంటి ముఖ్యమైన లక్షణాలు ఉంటే తప్పకుండా విజయం దక్కుతుంది విజయం సాధించాలని కునేవారు విజయంతో పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని ముందే గమనించాలి.

పుట్టుకతోనే ప్రతిభ వచ్చేయదు కనుక వయస్సు తో పాటు ప్రతిభను పెంచుకోవాలి దాంతో విజయానికి ఒక అర్థం ఉంటుంది మరియు ఒక పనిని పూర్తి సామర్ధ్యంతో సరైన పద్ధతిలో చేయగలుగుతారు. ఒకవేళ సరైన పద్ధతిలో విజయం దక్కకపోతే ఆ విజయానికి అర్థమే ఉండదు మరియు దానితో పాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. థామస్ ఆల్వా ఎడిషన్ ఒక బల్బు ని కనిపెట్టడానికి వేయి సార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు ఆ తరువాతే విజయం పొందారు ఒకవేళ ఈ సార్లు చేసినా ఫలితం దక్కలేదని అక్కడే ఆగిపోతే ఆయనకు ఈ విజయం దక్కేది కాదు.

colonel sander 65 ఏళ్ల వయస్సు అప్పుడు కి 1009 సార్లు ప్రయత్నించి ఓడిపోయారు ఆయన చేసిన చికెన్ వంటకాన్ని ప్రతి ఇంటికి వెళ్లి అమ్మడానికి ప్రయత్నించేవారు కానీ ఆ వంటకాన్ని ఎవరూ అంగీకరించలేదు 1964లో అదే వంటకానికి చాలా డిమాండ్ పెరిగింది 600 ఫ్యాన్సీ కూడా ఏర్పడ్డాయి ఇప్పటికీ ఇది చాలా ప్రసిద్ధిచెందింది అదే కేఎఫ్సి చికెన్ దీంతో వయసు కి విజయానికి సంబంధం లేదని అర్థం చేసుకోవచ్చు.

అబ్రహం లింకన్ పేదరికంలో పుట్టాడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదిగాడు ఈయన రెండు సార్లు వ్యాపారాల్లో ఓడిపోయాడు దాంతోపాటు ఎనిమిదిసార్లు ఎన్నికలలో ఓడిపోయారుఈ కష్టాల తో పాటు పీఎం కి అబ్రహం లింకన్ కు నాడి కి సంబంధించిన మానసిక రుగ్మత కూడా ఏర్పడింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆయన జీవితాన్ని ముగించలేదు ఎన్నో సార్లు ప్రయత్నించి 1860లో ఆయన యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ గా నిలిచారు మరియు చరిత్రలోనే ఈయన గొప్ప ప్రెసిడెంట్ గా నిలిచారు

Soft Skills

Soft Skills in the Promotion of Successful Career. .

Soft skill is the ability required and expected from persons for finding a suitable job, its maintenance and promotion. Soft skills are interpersonal and broadly applicable. Soft skills are often described by using terms often associated with personality traits, such as:
 • optimism
 • common sense
 • responsibility
 • a sense of humor
 • integrity
And abilities that can be practiced such as:
 • empathy
 • teamwork
 • leadership
 • communication
 • good manners
 • negotiation
 • sociability
 • The ability to teach.
It’s often said that hard skills will get you an interview but you need soft skills to get (and keep) the job. The soft skills required for etiquette and behavior even in day to day lives are quite interesting. It will surely help you display skills which will help you in the long run.
Importance of soft skill:


Soft skill is very important

 To handle interpersonal relations

 To take appropriate decisions

 To communicate effectively

 To have good impression and impact to gain professional development


Skills play a vital role for professional success; Having   Good soft skills — which are in fact scarce — in the highly competitive corporate world, will help you stand out in a milieu of routine job seekers with mediocre skills and talent.
The most common traits, mentioned by virtually every employer, were:
~ Positive work ethic. 
~ Good attitude.
Desire to learn and be trained.
Soft skills “are as important, if not more important, than traditional hard skills to an employer looking to hire — regardless of industry or job type. This could offer a major breakthrough as educators and training providers seek to develop and cluster training courses to fit business and industry needs.”
Here are the top ten soft skills in demand for today’s job market:
1. Communication skills: Communication skills involve active listening, presentation as well as excellent writing capabilities. One highly sought-after communication skill is the ability to explain technical concepts to partners, customers and coworkers that aren’t tech savvy.
2. Computer and technical literacy: Almost all jobs nowadays require basic competency in computer software, If computer skills are relevant to your field, insert a “Technical Skills” or “Systems Proficiencies” section to your resume.
3. Interpersonal skills: The ability to work in teams, relate to people and manage conflict is a valuable asset in the workplace. This skill is important to get ahead–and as you advance in your career, the aptitude to work with others becomes even more crucial. Personal accomplishments are important on your resume, but showing that you can work well with others is important too.
4. Adaptability: Don’t underestimate the ability to adapt to changes and manage multiple tasks. In today’s technology driven and rapidly evolving business environment, the ability to pick up on new technologies and adjust to changing business surroundings is important.
5. Research skills: With Google at the tip of your fingers, it’s easy to find answers to common issues. However, hiring managers seek employees that are skilled at assessing situations, are able to seek multiple perspectives and gather more in depth information.
6. Project management skills: Organization, planning and effectively implementing projects and tasks for yourself and others is a highly effective skill to have. In the past, this was a job in itself. Nowadays, many companies aren’t hiring project managers because they expect all of their employees to possess certain characteristics of this skill.
7. Problem-solving skills: The ability to use creativity, reasoning, past experience, information and available resources to resolve issues is attractive because it saves everyone at the organization valuable time. Highlight this skill by listing an example of when your organization had a sticky situation and you effectively addressed it.
8. Process improvement expertise: The number one goal every company has in common is to save money. Optimizing business procedures can save a company time and money. Quantify results in your resume by listing the before and after facts of projects that you took on.
9. Strong work ethic: Employers are looking for employees that take initiative, are reliable and can do the job right the first time. Managers don’t have the time or resources to babysit, so this is a skill that is expected from all employees. Don’t make the hiring manager second-guess by sending a resume with typos, errors and over-exaggerated work experience.
10. Emotional Intelligence: Emotional intelligence is usually something that is revealed through actual interactions with the hiring manger, but you can hint that you have it with a strategic resume the addresses areas where your experience and skills are lacking relative to the job requirements.

INCLUDE THESE SKILLS ON YOUR OWN RESUME! MAKE YOUR RESUME MORE EFFECTIVE BY HIGHLIGHTING YOUR SKILLS. A COVER LETTER IS YOUR OPPORTUNITY TO EMPHASIZE THE SKILLS THAT MAKE YOU STAND OUT FROM THE CROWD.

ప్రతి విజయవంతమైన విద్యార్ధి కాలేజీ లో నేర్చుకోవలసిన ఆరు ప్రధాన విషయాలు

విద్య మరియు కెరీయర్
ఒక విజయవంతమైన విద్యార్థి ఎలాకావలని  తెలుసుకోవాలనుకుంటున్నారాకళాశాల అనుభవం ప్రతి విద్యార్ధికి ప్రత్యేకంగా ఉంటుందికానీ అందరు కళాశాలలో ఒకే ద్యేయం తో ప్రవేశిస్తారు, అది ఒక డిగ్రీ పొందండంకాబట్టి కళాశాలలో విజయవంతంకావడానికివిద్యార్ధులు సాధారణంగా “కస్టపడి  అధ్యయనం చేయoడి , “క్రమం తప్పకుండ  తరగతికి వెళ్లండి, “బాగా చదవండి ” అనేసలహాలను సాధారణం  పొందుతారుకానీ ఒక విజయవంతమైన విద్యార్ధి అంటే కేవలం తరగతులకు హాజరు కావడంపరీక్షలకు చదవడంపలు వ్రాతపూర్వక ప్రాజెక్టులు పూర్తి చేయడం మరియు మంచి గ్రేడ్స్/మార్క్స్  సంపాదించడంకాదుకళాశాలలో విజయవంతం అవడం  ఇంతకంటే చాలా క్లిష్టంగా ఉంటుంది

.క్రిందప్రతి కళాశాల విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి మరియు కళాశాల అనుభవాన్ని అసాధారణంగా చేయటానికి ఏమి చేయాలనే దానిపై కొన్ని చిట్కాలు ఉన్నాయి
1.మంచి గ్రేడ్స్/మార్కులు గురించి జాగ్రత పడండి.
గ్రేడ్స్/ మార్క్స్ ప్రేరణగా ఉండవచ్చు కానీ మీరు కాలేజీ కి అధ్యయనం చేయడం కోసం వచ్చారు,కేవలంగ్రేడ్స్/మార్క్స్ పొందటానికి కాదు. కాబట్టి మీరు క్రొత్త విషయాలను నేర్చుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలి మరియు వివిధ అభ్యాస వ్యూహాలను ప్రయత్నించండిమీరు మీ ప్రొఫెసర్ యొక్క గ్రేడింగ్ (శ్రేణీకరణ) విధానాన్ని గురించి తెలుసుకోవాలి మరియు అసైన్మెంట్స్   లో మీరు మంచి గ్రేడ్స్ పొందాలనుకుంటే మీరు  వాటిని అనుసరించాలిఅంతే కాకుండా,ఇందుకు అవసరం అనుకంటే  ఆన్-లైన్  సహాయం కూడా పొందవచ్చు మరియు మీ డిసర్టేషన్ను పూర్తి చేయవచ్చు.
 విధంగామీ క్లాసు లో మీరు  విజయం సాధించచవచ్చుమీరు ఒక నిర్దిష్ట గ్రేడ్ సంపాదించటం కోసం  మీ ప్రొఫెసర్ తో వ్యక్తిగతంగా చర్చించవచ్చుమీరు భవిష్యత్లో మీ గ్రేడ్స్/మార్క్స్  ఎలా మెరుగుపరచాలనే దానిపై కూడా సలహా పొందవచ్చు.
2.ఉద్యోగం సంపాదించడం
కాలేజీలో  ఉద్యోగం పొందడానికి అనేక కారణాలు  ఉండవచ్చు   ఉదాహరణకుడబ్బు సంపాదించడానికి లేదా కెరీర్ అవకాశాలను మెరుగుపరచడం కోసం.  క్యాంపస్ లో ఉద్యోగ అవకాశాలు పేడ్ paid మరియు అన్-పేడ్ unpaid ఇంటర్న్షిప్పులు గా ఉంటాయిఈ ఇంటర్న్శిప్స్ వలన నిజమైన ఉద్యోగ అనుభవo వస్తుంది  మరియు మీ భవిష్యత్ కెరీర్ కోసం మిమ్మల్లి  మీరు సిద్ధం చేసుకోవడానికి సహాయపడుతుందియజమానులు సమయం వృధా కాకుండా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొనే వ్యక్తిగా మిమ్మల్లి చూస్తారు తద్వారా మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరవాత ఉద్యోగం పొందటానికి మంచి అవకాశాలు ఉంటాయి.
.3.పరిచయాలు లేదా నెట్వర్కింగ్ Networking
కళాశాలలో ఉండగామీరు చాలామందిని కలుస్తారు, మీ సహవిద్యార్థులతో  మరియు  కొత్త వ్యక్తులతో స్నేహం చేసుకోవాలిమీరు వారితో సన్నిహితంగా ఉండాలిమీరు ఉద్యోగం కోసం ప్రయతిస్తున్నప్పుడు ఇది మీ కెరీర్ రంగంలో మీకు సహాయపడవచ్చుమీరు కూడా ఎవరికైనా సహాయం చేయగలరు.
4. విదేశాలలో చదువు
మనము నేడు  విశ్వవ్యాప్త ప్రపంచం లో జీవిస్తున్నాము కాబట్టి విదేశాలలో చదువు అనేది మీకు  కొత్త సంస్కృతులను తేలుసుకోవటానికి మరియు ఒక వ్యక్తిగా ఉన్నతి పొందటానికి సహాయపడే ఒక అనుభవం వంటిది. అంతేకాకుండామీరు  ఉద్యోగం పొందడానికి అవకాశాలను  మెరుగుపరుస్తుందిఎందుకంటే విదేశాలలో చదివిన అనుభవం మీ రేజ్యుం లో గొప్పగా కనిపిస్తుంది, మరి  ముఖ్యంగా మీకు  విదేశీ భాష వస్తే  మీదే విజయంమీరు వివిధ సాంస్కృతిక నేపథ్యాలతో చాలామంది కొత్త వ్యక్తులను కలుసుకోగలుగుతారుమరియు మీరు అదృష్టవంతులైతేమీరు వారితో స్నేహంగా ఉంటారు లేదా మీ కలల భాగస్వామిని కనుగొంటారు.
5.తమ పై  తాము జాగ్రత్త తీసుకోవడం
మీరు స్వతంత్రంగా జీవించటం నేర్చుకోవాలి  అందుకు  మీ నిద్ర షెడ్యూల్స్ విషయం లో జాగ్రత పడాలి. మీరు  మంచి వ్యాయామ మరియు భోజన అలవాట్లు పెంపొందించుకోవాలి.  . మీరు ఆరోగ్యకరమైన  జీవనశైలి అలవాట్లను అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మీరు మానసికంగా మరియు భౌతికంగా సరి అయిన షేప్(ఆకృతి)లో ఉండవలసి ఉంటుందిఆరోగ్యంగా తినడంవ్యాయామం చేయడంతగినంత నిద్ర పోవడం చేయాలి. ఇందుకు  మీరు చక్కెర పానీయాలు మరియు జంక్ ఫుడ్ తప్పని సరిగా తీసుకోరాదు. కనీసం 8 గంటలు నిద్రించడానికి ప్రయత్నించండినిద్ర లేమి వలన మీ ఆరోగ్యం దెబ్బతింటుంది మరియు మీ చదువు లో ప్రతికూల ప్రభావం చూపుతుందిఅనగా మీరు మీ తరగతుల్లో తక్కువ శ్రద్ధ మరియు ఆలోచన మరియు జ్ఞాపకశక్తి సమస్యలు ఎదుర్కొంటారు.
6.మీ ప్రోఫెసర్లతో మంచి సంభందాలు కలిగి ఉండండి.

ప్రశ్నలను అడుగుతూ మరియు సమాధానమిస్తూ మీరు క్లాస్ లో  చురుకుగా ఉండాలి.  మీరు తరగతుల తర్వాత మీ ప్రొఫెసర్ తో  మాట్లాడవచ్చు మరియు మీ అధ్యయనానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చించవచ్చు ఉదాహరణకుకోర్సులుపరిశోధనా పథకాలుఇంటర్న్షిప్ మొదలైనవిమీ ప్రొఫెసర్లతో కమ్యూనికేట్ చేయడం మీ కెరీర్ గోల్స్ సాధించడంలో మీకు సహాయపడుతుందిఎందుకంటే మీరు  ప్రొఫెసర్ నుంచి ఉద్యోగం కోసం సిఫార్సు ఉత్తరం పొందవచ్చుమీరు మీ సబ్జెక్టు అధ్యయనం చేస్తున్న విద్యార్థులను స్నేహితులు గా చేసుకోవాలి విధంగామీరు మీ కెరీర్ మార్గంలో మీకు సహాయపడే వ్యక్తులతో కనెక్షన్లను పెంపోదించుకోవచ్చు.

వ్యక్తిత్వ వికాసం మంచి-మర్యాదలు

 1. ఒకరిని పదేపదే కాల్ చేయవద్దు.  వారు మీ కాల్‌ను తీసుకోకపోతేఅందుకు వారికి ముఖ్యమైన పనులు ఉన్నాయని అనుకోండి.

 2. అవతలి వ్యక్తి మీమ్మల్లి అడగక ముందే మీరు అరువు తెచ్చుకున్న డబ్బును తిరిగి ఇవ్వండి.  ఇది మీ సమగ్రతను మరియు వ్యక్తిత్వంను చూపుతుంది. 

 3. ఎవరైనా మీకు భోజనం / విందు ఇస్తున్నప్పుడు మెనులో ఖరీదైన వంటకాన్ని ఎప్పుడూ ఆర్డర్ చేయవద్దు.  వీలైతే మీ ఆహారాన్ని వారిని ఎంపిక చేయనియండి.

 4. ఇతరులను “మీకు ఇంకా వివాహం కాలేదా?’ లేదా మీకు పిల్లలు లేరా‘ లేదా ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?’ వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను అడగవద్దు.

 5. మీ వెనుక వచ్చే వ్యక్తికి ఎల్లప్పుడూ తలుపు తెరవండి.  ఆ వ్యక్తి, పురుషుడు  లేదా స్త్రీ / సీనియర్ లేదా జూనియర్ అయినా ఫర్వాలేదు.  ఎవరితోనైనా సరే బహిరంగంగా గౌరవంగా వ్యవహరించoడి.

 6. మీరు ఒక స్నేహితుడితో కలసి టాక్సీ లో ప్రయాణిస్తూ ఉంటె ఒకసారి అతను / ఆమె ఫేర్ చెల్లిస్తేతదుపరి సారి మీరు చెల్లించoడి.

 7. విభిన్న అభిప్రాయాలను గౌరవించండి.  ఒక విషయం లో రెండవ అభిప్రాయం మంచిది.

 8. ఇతరులు మాట్లాడేడప్పుడు ఎప్పుడూ అంతరాయం కలిగించవద్దు.    వారు చెప్పేదాన్ని ఆసాంతం  వినండి.

 9. ఎవరితో పరాచికాలు ఆడవద్దు. వారు బాధపెడితే మరలా ఎప్పుడు ఆలా  చేయకండి.
 

 10. ఎవరైనా మీకు సహాయం చేస్తున్నప్పుడు ధన్యవాదాలు” అని చెప్పండి.

 11. బహిరంగంగా ప్రశంసించండి.  పరోక్షం లో విమర్శించవద్దు.

 12. ఒకరి శరీర బరువుపై వ్యాఖ్యానించవద్దు. “మీరు బరువు తగ్గితే అద్భుతంగా కనిపిస్తారు” అని మృదువుగా చెప్పండి

 13. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటోలు  చూపించినప్పుడుఎడమ లేదా కుడి వైపుకు స్వైప్ చేయవద్దు.
 
 14. సహోద్యోగి  ఆరోగ్య స్థితి గురించి  వ్యంగంగా వ్యాఖ్యానించ  వద్దు.

 15. అటెండర్ ను  సీఈఓతో సమానంగా చూసుకోండి.  మీ క్రింద ఉన్నవారితో  మీరు ఎంత బాగా ప్రవర్తిస్తే అంతా బాగా మీరు వారిని ఆకట్టువచ్చు. మీరు వారిని గౌరవంగా చూస్తే ఇతరులు  దాన్ని గమనిస్తారు.

 16. ఒక వ్యక్తి మీతో నేరుగా మాట్లాడుతుంటేమీరు ఫోన్‌ను చూడటం మొరటుగా ఉంటుంది.

 17. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ సలహా ఇవ్వకండి.

 18. చాలా కాలం తర్వాత ఒకరిని కలిసినప్పుడుదాని గురించి మాట్లాడాలి తప్పవారి వయస్సు మరియు జీతం అడగవద్దు.

 19. మీ పని మీరు చూసుకోండి – ఇతరుల పనిలో తల దూర్చవద్దు.

 20. మీరు బజారులో  ఎవరితోనైనా మాట్లాడుతుంటే మీ సన్ గ్లాసెస్ తొలగించండి.  ఇది గౌరవానికి సంకేతం.  మాట  కంటే కంటి పరిచయం చాలా ముఖ్యం.

 21. పేదల మధ్య మీ ఐశ్వర్యం గురించి ఎప్పుడూ మాట్లాడకండి.  అదేవిధంగామీ పిల్లల  గురించి మాట్లాడకండి … మీ జీవిత భాగస్వామీ గురించి మాట్లాడకండి.

 22. చివరగాఇతరులు నేర్చుకోవడంలో మీరు సహాయపడoడి. అది   మీ సహకారం  వైరల్ అయ్యేలా చేస్తుంది.

ఇంటర్నషిప్

 
వృత్తి విద్యా కోర్సులు పెరుగుతున్న నేటి యుగంలో ఇంటర్నషిప్‌ల ప్రాముఖ్యత క్రమంగా పెరుగుతోంది. ఇంటర్న్‌షిప్ అనేది ఒక సంస్థ యొక్క పనితీరు మరియు ప్రత్యేకమైన ప్రాంతంలో పని చేసే మార్గాలను తెలుసుకునటానికి  ఉపయోగపడే సాధారణ ఉద్యోగ శిక్షణ కాలం అని చెప్ప వచ్చు ఇంటర్నషిప్‌లను అందించే సంస్థలు  చాలా ఉన్నవి.. కొన్ని సంస్థలు ఇంటర్న్ షిప్ కాలం లో వేతనం చేల్లిస్తాయి కొన్ని సంస్థలు చేల్లిoచవు. విద్యార్థులు తమ కోర్సుల ఆధారంగా ఇంటర్నషిప్‌లను ఎంచుకుంటారు. ఇంటర్నషిప్‌లు మీకు ఆసక్తి ఉన్న ప్రాంతంలో నైపుణ్యాలు మరియు పద్ధతులను నేర్చుకునే అవకాశంగా చూడాలి. ఇంటర్నషిప్ అనేది మీ పరిచయాలను పెంచి  మీ వృత్తిని బలోపేతం చేసే మార్గoగా   చూడాలి.
ఇంటర్నషిప్ యొక్క ప్రాముఖ్యత మరియు అందలి ముఖ్యమైన అంశాలు.


 1.వృత్తిపరమైన పని వాతావరణం:
ఇంటర్నషిప్ పూర్తిగా  వృత్తిపరమైన పని వాతావరణాన్ని అందిస్తుంది. సంస్థ అనుసరించే నీతి నియమావళిని అర్థం చేసుకోవడం సులభతరం చేస్తుంది.అక్కడి వాతావరణం మీ కాలేజి మరియు యూనివేర్సిటిల అకాడెమిక్  వాతావరణo కు బిన్నంగా పూర్తిగా వృత్తి పరమైన వాతావరణo కలిగి ఉంటుంది.

2.సాధన – పరిపూర్ణత:
కొందరు పెద్దలు చెప్పినట్లు ప్రాక్టీస్ మనిషిని పరిపూర్ణంగా చేస్తుంది” క్రొత్తదాన్ని నేర్చుకోవటానికి మీరు ఎంత ఎక్కువ ప్రయత్నిస్తారో అది అంత పరిపూర్ణత వైపు మిమ్మల్ని తీసుకు వెళ్తుంది.  మీకు అవసరమైన అన్ని నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని నేర్చుకునేలా చేస్తుంది. ఒక నిర్దిష్ట పనిని ఎప్పటికీ వదులుకోవద్దు. మీరు విజయవంతం అయ్యేవరకు సహనంతో ఉండండి మరియు సాధన చేయండి.
3.ఆసక్తి ఉన్న ప్రాంతాన్ని కనుగొనడంలో సహాయం పడుతుంది.
అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసంవారి ప్రతిభను మరియు ఆసక్తిని గుర్తించడంలో ఇంటర్నషిప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక నిర్దిష్ట విషయాన్ని చదవడం ద్వారా అది మీ ఆసక్తి ఉన్న ప్రాంతం అవును కాదా అని మీరు నిర్ధారించలేరు? ఒక నిర్దిష్ట క్షేత్రం లేదా ప్రాంతం యొక్క విభిన్న అంశాలను పని చేయడం మరియు అర్థం చేసుకోవడం లో మీ ఆసక్తి మరియు ప్రతిభను అన్వేషించడంలో ఇంటర్న్ షిప్ మీకు సహాయపడుతుంది.

4.విశ్వాసం స్థాయిని పెంచుతుంది:
మీకు పని చేసే విధానం తెలిసినప్పుడుమీ విశ్వాస స్థాయి ఆటోమాటిక్ గా పెరుగుతుంది. మీరు మంచి పనితీరు కనబరిచినప్పుడు ఇది మీలో సానుకూల వైఖరిని పెంచుతుంది మరియు మీ విశ్వాసాన్ని బాగా పెంచడానికి మిమ్మల్ని ప్రేరేస్తుంది.

5.అనుభవం:
ఎల్లప్పుడూ మరింత ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నించండి మరియు సాధ్యమైనంత ఎక్కువ అనుభవాన్ని పొందండి. మిమ్మల్ని ఉత్తేజపరిచే ప్రతి క్రొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీకు భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే  పరిష్కరించడానికి మరియు మీ పనిని సులభతరం చేయడానికి అనుభవాలు మీకు సహాయపడతాయి. ఇంటర్నషిప్‌లు క్రొత్త విషయాలను నేర్చుకునేలా చేస్తాయి.
6.నెట్‌వర్క్ పెంచుకోండి:: 
పరిచయాలు మరియు బలమైన మానవ సంబంధాలను  నిర్మించడం లో  ఇంటర్నషిప్ తోడ్పడుతుంది మరియు అది వృత్తి-మీ మధ్య అంతరాన్ని పూరించగలదు. మీ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగిఉండం ఏ సంస్థలోనైనా ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఇంటర్నషిప్ పూర్తయిన తర్వాత కూడా మంచి నెట్‌వర్కింగ్ మరియు మంచి రిలేషన్ షిప్స్ మీకు పనిలో సహాయపడుతాయి.
7.కెరీర్ అవకాశాలు:
మీ ఇంటర్నషిప్ సమయంలో నేర్చుకోవటానికి మీరు  ఆసక్తి మరియు ఉత్సుకత తో పనిచేయడం వలన సంస్థలో ఉద్యోగిగా మీరు  విస్తృత కెరియర్ అవకాశాలను పొందగలరు.

8.     మంచి అభిప్రాయం కల రేజ్యుం :
ఉద్యోగం పొందడానికిబలమైన రేజ్యుం తోడ్పడుతుంది. అది మిమ్మల్ని భిన్నమైన మరియు ఉత్తమమైన వారుగా  ప్రకటిస్తుంది.  మంచి పేరున్న ప్రఖ్యాత సంస్థ నుండి మీ పని పై మంచి అభిప్రాయం బలమైన రేజ్యుం నిర్మాణం కు తోడ్పడుతుంది మరియు అది మీ ఎంపిక యొక్క అవకాశాలను పెంచుతుంది.

విజయానికి కావలసిన ఆరు “సి” లు Six Cs of success

Image result for six c's for success


కమ్యూనికేషన్ మరియు విశ్వాసం అనేవి  ఉద్యోగసాధన కొరకు నేటి యువతకు  అవసరమైన ముఖ్య లక్షణాలు.

ప్రపంచం చాలా వేగంగా కదులుతోందిసంస్థలు మారుతున్న పరిశ్రమల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఉపాధ్యాయులు ఒక విషయం బోధించడానికి సిద్ధమయ్యే లోపే ఆ విషయం పాతది అవుతుంది. టెక్నాలజీలో మార్పులుముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు రోబోటిక్స్ వలన చాలా ఉపాధి అవకాశాలు తగ్గినవి.

ఉద్యోగ సాధనకు తన నిజమైన బలం కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం. ఈ నైపుణ్యాన్ని సాధించి  తమ ఆలోచనలను ఎలా కమ్యూనికేట్ చేయాలో మరియు ప్రదర్శించాలో యువత నేర్చుకోవాలి.
కమ్యూనికేషన్కాన్ఫిడెన్స్క్యూరియాసిటీక్రియేటివిటీకోలబిరెషన్ అండ్ కాంపిటెన్స్ (Communication, Confidence, Curiosity, Creativity, Collaboration and Competence) అనే ఆరు “సి” ల విజయాల భావన.

కలిసి పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలు కమ్యూనికేషన్ మరియు విశ్వాసం. కానీ ఈ రెండు లక్షణాలను  వ్యక్తి ఆసక్తిగాసృజనాత్మకంగాసహకారంగా మరియు సమర్థంగా వినియోగించాలి.  దీనినే విజయం యొక్క సిక్స్ సి అని అందురు.

విషయాలను తెలుసుకోవటమే గాక   తమ ఆలోచనలను ఇతరుల ముందు ఎలా ప్రదర్శించాలో తెలుసుకోవాలి. ఇతరులను ఒప్పించటంవిభేదాలను పరిష్కరించడంవైఫల్యాలను ఎదుర్కోవడంచర్చలు మరియు పనులు చేయడంలో పట్టుదలతో ఉండాలి.ఇవన్నీ నేటి యువతకు కావలసిన ముఖ్యమైన నైపుణ్యాలు. 
18 మరియు 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత వీటి  సాధన తమ లక్ష్యంగా చేసుకునాలి. 
సిక్స్ సి ఆత్మవిశ్వాసాన్ని పెంచి అభివ్యక్తికరణకు  సహాయపడుతుంది.  

న‌చ్చిన కొలువు దక్కించుకోవాలంటే…‘ఇంగ్లిష్‌’ తప్పనిసరి

ఇంగ్లిష్‌ నైపుణ్యం ఉంటే.. ప్రపంచాన్నే చుట్టేయొచ్చు అనే నానుడి! కంపెనీలు నియామకాలప్పుడు ఇంగ్లిష్‌పై పట్టును ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి.
Career guidance

ఐఐటీలు, ఐఐఎంల నుంచి స్థానిక కళాశాలల్లో చదివిన విద్యార్థుల వరకూ.. ఇంగ్లిష్‌ స్కిల్స్‌ ఉంటేనే అవకాశం కల్పిస్తున్న వైనం! సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఎంత ఘనంగా ఉన్నా.. ఇంగ్లిష్‌ నైపుణ్యం లేకపోతే ఆఫర్‌ అనుమానమే! దీంతో.. ఇప్పుడు నచ్చిన కొలువు దక్కించుకోవాలంటే.. ముందుగా ఇంగ్లిష్‌ స్కిల్స్‌ను పెంచుకోక తప్పని పరిస్థితి! ఈ నేపథ్యంలో.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌కు కంపెనీలు ఇస్తున్న ప్రాధాన్యం.. భాషపై పట్టును పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం…
ఇప్పుడు ఏ ఉద్యోగ ప్రకటనను చూసినా.. ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడం వచ్చి ఉండటం తప్పనిసరి నిబంధనగా మారింది. కంపెనీలు ఇంగ్లిష్‌ స్కిల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం ఇది. మరోవైపు నూటికి 70 శాతం మంది ఇంగ్లిష్‌ నైపుణ్యాలు లేని కారణంగా అవకాశాలను చేజార్చుకోవాల్సి వస్తోంది. ఐఐటీలు మొదలు స్థానిక కళాశాల వరకూ.. ఎక్కడ చదివినా, ఎలాంటి కోర్సు పూర్తి చేసినా.. ఇంగ్లిష్‌ నైపుణ్యం లేకుంటే.. అవకాశం దక్కడం కష్టమే. దక్కినా నిలబెట్టుకోవడం అసాధ్యం. ఇంతలా ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరగడానికి కారణం.. మారుతున్న కంపెనీల వ్యాపార కార్యకలాపాలు.. రోజు రోజుకూ మారిపోతున్న టెక్నాలజీ!అంతర్జాతీయ క్లయిం ట్స్‌ సంస్థలు, వినియోగదారులతో సంప్రదింపుల పరంగా ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యం పెరిగింది. కాబట్టి విద్యార్థులు సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌కే పరిమితం కాకుండా.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవడానికి కృషిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
విదేశీ విద్యకు లాంగ్వేజ్‌ టెస్ట్‌లు :
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్‌ ఇప్పుడు కేవలం ఉద్యోగాల సాధనకే పరిమితం కాకుండా.. ఇతర విషయాల్లోనూ యువతను ముందంజలో నిలిచేలా చేస్తోంది. ముఖ్యంగా విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టుల్లో ప్రతిభ చూపడం తప్పనిసరి. ముఖ్యంగా టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ వంటి స్టాండర్డ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ల్లో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్‌ పాత్ర కీలకం. స్పోకెన్, రిటెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యాలు మెరుగ్గా ఉంటేనే లాంగ్వేజ్‌ టెస్టుల్లో రాణించే వీలుంటుంది.
ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ :
ఇంగ్లిష్‌ నైపుణ్యం పెంచుకుంటే.. అభ్యర్థుల్లో ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ కూడా మెరుగవుతాయి. ఇది ఉద్యోగ సాధనకు దోహదపడుతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు ఏదైనా ఒక టాపిక్‌పై ప్రజెంటేషన్‌ను కోరుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లిష్‌ ప్రజెంటేషన్‌ స్కిల్స్‌ ప్రధానంగా మారాయి. అంతేకాకుండా ప్లేస్‌మెంట్స్‌ ప్రక్రియలో భాగంగా నిర్వహించే గ్రూప్‌ డిస్కషన్స్‌లోనూ ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కీలకం. కాబట్టి విద్యార్థులు తాము కోర్సులో చేరిన రోజు నుంచే ఇంగ్లిష్‌ భాషపై పట్టు పెంచుకునేందుకు ప్రత్యేకంగా దృష్టిసారించాలి. అలాగే స్టార్టప్‌ ఔత్సాహికులు తమ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లను వివరించేందుకు ఇంగ్లిష్‌ స్కిల్‌ తప్పనిసరి. మరోవైపు పోటీ పరీక్షల్లో రాణించేందుకు కూడా ఇంగ్లిష్‌ భాషపై పట్టుండటం తప్పనిసరి.
ప్రముఖ విద్యాసంస్థల్లో సైతం :ఇంగ్లిష్‌ నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ఆన్‌లైన్‌ వేదికలను ఉప యోగించుకోవచ్చు. వీటిల్లో బ్లాగులు, సోషల్‌ నెట్‌వర్క్‌ మెసేజింగ్, చాటింగ్, య్యూటూబ్‌ వీడియోలు, లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ పోర్టల్స్‌ వంటివి ముఖ్యమైనవి. బ్లాగుల్లో ఏదైనా ఒక విషయానికి సంబంధించి పోస్ట్‌ చేసిన కామెంట్లు లేదా అనాలిసిస్‌లను చదివి.. వాటికి ఇంగ్లిష్‌లో సమాధానం రాయడం అలవర్చుకోవాలి. తొలిదశలో నచ్చిన రీతిలో రాస్తూ.. క్రమేణా రాత నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్స్‌లో నిపుణుల కామెంట్స్‌ను క్షుణ్నంగా చదవడం ఎంతో లాభిస్తుంది. ఒక టాపిక్‌కు సంబంధించి సదరు నిపుణులు ఉపయోగించిన భాషపై అవగాహన వస్తుంది. తద్వారా భాషా పరిజ్ఞానాన్ని క్రమేణా పెంచుకోవచ్చు. అలాగే యూట్యూబ్‌తోపాటు ఇతర వెబ్‌పోర్టల్స్‌లో వీడియోలు చూడటం ద్వారా ఇంగ్లిష్‌పై పట్టు సాధించే వీలుంది.
స్పోకెన్‌ ఇంగ్లిష్‌ :
స్పోకెన్‌ ఇంగ్లిష్‌.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్, లాంగ్వేజ్‌ స్కిల్‌ పరంగా అత్యంత కీలకమైన నైపుణ్యం. ఇంగ్లిష్‌లో రాయగలిగినా.. చాలామంది మాట్లాడేందుకు జంకుతుంటారు. లిజనింగ్, రైటింగ్‌ పరంగా పట్టు సాధించినప్పటికీ.. స్పీకింగ్‌కు వచ్చేసరికి తడబడుతుంటారు. వాస్తవానికి ప్రస్తుత పోటీ ప్రపంచంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కీలకంగా మారింది. పట్టుదలతో ప్రయత్నిస్తే స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. ఇంగ్లిష్‌లో మాట్లాడటం కోసం ముందుగా.. నిర్దిష్టంగా ఒక అంశాన్ని ఎంపిక చేసుకోవాలి. సదరు విషయానికి సంబంధించి అప్పటివరకు ప్రచురితమైన వ్యాసాలు, వార్తలు చదవాలి.అందులో వినియోగించిన పదజాలం, వాక్య నిర్మాణం వంటివి పరిశీలించాలి. స్థూలంగా దాని సారాంశం తెలుసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత టాపిక్‌ను తమదైన శైలిలో పాయింట్ల రూపంలో రాసుకోవాలి. ఆయా అంశాలను ముందుగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. ఈ విషయంలో బిడియం సరికాదు. తొలిదశలో ఒక విషయాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేట్లు చెప్పగలుగుతున్నామా లేదా? అనేదే ప్రధానం.
గ్రూప్‌ డిస్కషన్స్‌ :
స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యం పెంచుకునేందుకు ఉపయోగపడే మరో సాధనం..గ్రూప్‌ డిస్కషన్స్‌(జీడీ). తొలిదశలో గ్రూప్‌ డిస్కషన్స్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రారంభించాలి. దీనివల్ల సదరు చర్చ సందర్భంగా బాగా మాట్లాడిన వాళ్లను పరిశీలించే అవకాశం లభిస్తుంది. అలాగే డిబేట్స్‌(చర్చలు)లో పాల్గొనడం కూడా మేలు చేస్తుంది. కాలేజీ, స్కూల్‌ స్థాయి నుంచే ఇంగ్లిష్‌లో మాట్లాడం అలవాటుగా మార్చుకోవాలి. ఫలితంగా నలుగురిలో ఇంగ్లిష్‌లో మాట్లాడేటప్పుడు బెరుకు తగ్గుతుంది.
గ్రామర్, వొకాబ్యులరీ :
 • ఇంగ్లిష్‌ నేర్చుకునేటప్పుడు తొలిదశలో అత్యంత ఉపయుక్త సాధనం.. నిఘంటువు (డిక్షనరీ). ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ వంటి డిక్షనరీల్లో ఒక పదానికి అర్థం తెలియజేయడంతోపాటు.. సదరు పదాన్ని ఏ సందర్భంలో వినియోగిస్తారు? ఎలా మాట్లాడొచ్చు? అనే విషయాలు ఉంటాయి. సదరు పదాలకు సమానార్థాలు, వ్యతిరేకార్థాలు కూడా కనిపిస్తాయి.
 • స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యం కోణంలో …వొకాబ్యులరీపై పట్టు సాధించడం ఎంతో అవసరం. ప్రతిరోజు కనీసం పదికొత్త పదాలు–వాటి అర్థాలు తెలుసుకోవాలి. వాటిని ఏ సందర్భంలో ప్రయోగించవచ్చో తెలుసుకోవాలి.
 • ఇంగ్లిష్‌ నైపుణ్యం మెరుగుపరచుకునే విషయంలో బేసిక్‌ గ్రామర్‌(వ్యాకరణం)పై అవగాహన మేలు చేస్తుంది. ప్రధానంగా టెన్సెస్, డైరెక్ట్‌–ఇండైరెక్ట్‌ స్పీచ్, యాక్టివ్‌ వాయిస్‌–ప్యాసివ్‌ వాయిస్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఫలితంగా ఒక విషయాన్ని కమ్యూనికేట్‌ చేసే క్రమంలో చక్కటి నైపుణ్యం లభిస్తుంది.
అకడమిక్‌ మార్గాలు :
ఇంగ్లిష్‌ నైపుణ్య సాధనకు ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అకడమిక్‌ స్థాయిలోనే కాలేజీలు, యూనివర్సిటీల పరిధిలో ఫినిషింగ్‌ స్కూల్స్‌ పేరుతో, లేదా ప్రత్యేకంగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ క్లబ్‌ల పేరుతో శిక్షణ కేంద్రాలు ఏర్పడుతున్నాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. వీటితోపాటు బ్రిటిష్‌ కౌన్సిల్, కేంబ్రిడ్జ్‌ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు లెర్నింగ్‌ ఇంగ్లిష్‌పై దశల వారీగా శిక్షణనిస్తున్నాయి. సదరు శిక్షణ పూర్తయ్యాక నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్‌ సైతం చేతికందుతుంది.
నేర్చుకోండిలా..మరి ఇంగ్లిష్‌ను నేర్చుకోవడం ఎలా.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌పై పట్టు సాధించడం ఎలా?! అనే సందేహాలు తలెత్తడం సహజం. విద్యార్థులు నాలుగు అంశాలపై దృష్టి సారిస్తే ఇంగ్లిష్‌ బేసిక్‌ స్కిల్స్‌ అలవడుతాయని నిపుణులు చెబుతున్నారు. అవి.. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్‌.
లిజనింగ్‌: ఇంగ్లిష్‌ను నేర్చుకునే క్రమంలో తొలుత సంభాషణను శ్రద్ధంగా వినడం చాలా ముఖ్యం. ఇంగ్లిష్‌పై అవగాహన ఉన్న వ్యక్తులు తమతో మాట్లాడుతున్నప్పుడు ఏకాగ్రతతో ఆలకించాలి. మధ్యలో అడ్డు తగలకూడదు. దీనివల్ల వారు ఏ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారో తెలుస్తుంది. వారి లాంగ్వేజ్‌ ఎక్స్‌ప్రెషన్‌ కూడా అర్థం అవుతుంది.
స్పీకింగ్‌: అంటే.. మాట్లాడటం. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ను పెంచుకునే విషయంలో స్పీకింగ్‌ ఎంతో కీలకం. నచ్చిన అంశాన్ని ఎంచుకుని మాట్లాడటం సాధన చేయాలి. తొలిదశలో పొరపాట్లు దొర్లినా.. బిడియ పడకుండా మాట్లాడటం కొనసాగించాలి. తద్వారా క్రమేణా తమ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.
రీడింగ్‌: ఒక అంశాన్ని క్షుణ్నంగా చదివి దాని సారాంశాన్ని.. అందులోని పద ప్రయోగాలను గుర్తించాలి. దీనివల్ల సదరు అంశం.. ఉద్దేశం, లక్ష్యం అర్థమవుతుంది.
రైటింగ్‌: ఇంగ్లిష్‌ బేసిక్‌ స్కిల్స్‌లో నాలుగోది చదివిన లేదా విన్న అంశాలను సొంత మాటల్లో రాయడం. ఈ విధానం వల్ల వాక్య నిర్మాణం, పద ప్రయోగం వంటి వాటిపై క్రమేణా పట్టు లభిస్తుంది.
రెండు విధానాల్లోనూ కీలకం :
ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌.. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఎంతో కీలకంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఇంగ్లిష్‌ నేర్చుకునేందకు కృషి చేయాలి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో అందుబాటులో ఉన్న ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ కోర్సులు అభ్యసించేందుకు ప్రయత్నించాలి.

ఇంగ్లిష్ పట్టండి.. కొలువు కొట్టండి..!

ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణమైంది.
Career guidance

మన విద్యార్థులు ఎక్కువగా వెళ్లే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో మనగలిగేందుకు ఇంగ్లిష్ తప్పనిసరి. అంతేకాదు స్వదేశంలోనూ ఏ పోటీ పరీక్షలో, ఏ ప్రవేశ పరీక్షలో మెరుగ్గా రాణించాలన్నా.. ఇంగ్లిష్ వచ్చి ఉండాలి. కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్వ్యూల్లో నెగ్గాలన్నా.. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆఫర్ సొంతం చేసుకోవాలన్నా.. ఇంగ్లిష్ నైపుణ్యం లేకుంటే కష్టమే!! ప్రస్తుత పరిస్థితుల్లో కెరీర్కు లైఫ్లైన్గా మారిన ఇంగ్లిష్పై పట్టు బిగించేందుకు.. ఇప్పుడు కరోనా కారణంగా అందివచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లాక్డౌన్ రోజుల్లో ఇంట్లోనే ఉండి.. ఇంగ్లిష్ నేర్చుకునేందుకు అందుబాటులో ఉన్న పలు ఆన్లైన్ మార్గాల గురించి తెలుసుకుందాం..
బ్రిటిష్ కౌన్సిల్…
ఇంగ్లిష్ బోధనలో బ్రిటిష్ కౌన్సిల్ పెట్టింది పేరు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకూ.. వివిధ వయసుల వారు, వారి అవసరాలకు తగ్గట్టు ఇంగ్లిష్ బోధనా నిపుణులతో కోర్సులను రూపొందించి అందిస్తోంది. ఇందులో కొన్ని లెవెల్స్ను ఉచితంగాను, మరికొన్నింటిని స్వల్ప రుసుం చెల్లించి ఆన్లైన్లో పొందవచ్చు. వీడియో, ఆడియో పాఠాల ద్వారా ఇంగ్లిష్ను నేర్చుకోవచ్చు. ఆయా పాఠ్యాంశాలు పూర్తయ్యాక ఉచితంగా పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా ఆన్లైన్ కోర్సులతోపాటు లిజనింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ గ్రామర్, వొకాబ్యులరీ, బిజినెస్ ఇంగ్లిష్, జనరల్ ఇంగ్లిష్ వంటి విభాగాలు అందుబాటులో ఉన్నాయి. చిన్నారులకు, యువతకు స్థాయిని బట్టి అర్థమయ్యేలా బోధన కొనసాగుతుంది. ఇంగ్లిష్ టీచర్ల బోధనా పటిమను మెరుగుపరిచేలా పలు కోర్సులను రూపొందించారు. అంతేకాకుండా ఎప్పుడు కావాలన్నా ‘ఆన్లైన్ ఇంగ్లిష్ ట్యూటర్’ విధానం సైతం అందుబాటులో ఉంది. దీనికి కోర్సును బట్టి స్వల్ప మొత్తం చెల్లించి పాఠాలు వినవచ్చు. అవసరమనుకుంటే.. ఫోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్https://learnenglish.britishcouncil.org
బీబీసీ లెర్నింగ్…
ఆన్లైన్ ఇంగ్లిష్ కోర్సులను అందించడంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మరో వేదిక.. ‘బీబీసీ లెర్నింగ్ ఇంగ్లిష్’. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంగ్లిష్ లెర్నర్స్ కోసం ఉచితంగా ఆడియో, వీడియో, టెక్స్›్ట మెటీరియల్ను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా ఇందులో చక్కటి వీడియో పాఠాలు పొందుపరిచారు. వివిధ దేశాలకు చెందిన వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇంగ్లిష్ చెప్పే విధానం అద్భుతంగా ఉంది. వివిధ స్థాయిల్లోని వారికి అర్థమయ్యేలా కోర్సులు రూపొందించారు. అంతేకాదు.. గ్రామర్, వొకాబ్యులరీ, ప్రనౌన్సేషన్, న్యూస్ రివ్యూ, బిజినెస్ ఇంగ్లిష్, ఫర్ చిల్డ్రన్, ఫర్ టీచర్స్.. ఇలా వివిధ విభాగాలు ఉంటాయి. లెర్నర్స్.. ఇంగ్లిష్ ఎంతవరకు నేర్చుకున్నారో తెలుసుకునేందుకు ‘క్విజ్’లు సైతం ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇందులో అధికంగా వీడియో పాఠాలే ఉన్నాయి. కాబట్టి ఏబీసీడీలు వస్తే చాలు.. ఇంగ్లిష్ నేర్చుకునే అవకాశం ఉంది. ‘బీబీసీ లెర్నింగ్ ఇంగ్లిష్ యాప్’ కూడా అందుబాటులో ఉంది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైనా, ఎక్కడైనా సరే ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్https://www.bbc.co.uk/learningenglish
ఎడెక్స్ లాంగ్వేజెస్..
ప్రపంచ వ్యాప్తంగా పలు యూనివర్సిటీలు అందించే షార్ట్టర్మ్ ఇంగ్లిష్ కోర్సులు ఎడెక్స్ పోర్టల్ ద్వారా పొందవచ్చు. ఇందులోనూ మనకు ఏ స్థాయి కోర్సు అవసరమో దాన్ని ఎంచుకొని ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. ఇక్కడ దాదాపు అన్ని కోర్సులు ఉచితంగానే అందిస్తున్నారు. ప్రధానంగా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో మాట్లాడే ఇంగ్లిష్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయా దేశాల వొకాబ్యులరీ, గ్రామర్ ప్రకారం అక్కడ టాప్ యూనివర్సిటీలు, కాలేజీలు రూపొందించిన కోర్సులు ఇందులో చూడొచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్www.edx.org/learn/english
ఏబీఏ ఇంగ్లిష్..
ఏబీఏ ఆన్లైన్ ఇంగ్లిష్ కోర్సుల్లో చాలా రకాలు ఉన్నాయి. ముఖాముఖి కోర్సులు, ఆన్లైన్ కోర్సులు, ప్రైవేట్ క్లాసులు వంటివి వాటిలో కొన్ని. ఏ కోర్సు ఎవరికి అనువుగా ఉంటుందో.. ఎంతవరకు అవసరమో తెలుసుకోవడం కష్టం. అందుకు అనువుగా ‘ఏబీఏ ఇంగ్లిష్’ ఆన్లైన్ ప్రొవైడర్ కోర్సులను అందిస్తోంది. ఇక్కడా నేర్చుకునేవారి అవసరం, సామర్థ్యాన్ని బట్టి బిగినర్స్, లోయర్–ఇంటర్మీడియెట్, ఇంటర్మీడియెట్, అప్పర్–ఇంటర్మీడియెట్, అడ్వాన్స్డ్, బిజినెస్ స్థాయిలు ఉన్నాయి. ఇందులో నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు. ఆన్లైన్ ఇంగ్లిష్ కోర్సును మనకు అనువైన సమయంలో ఎక్కడ నుంచైనా నేర్చుకోవచ్చు. ఇందులో ఫేస్ టు ఫేస్ కోర్సు, ఆన్లైన్ కోర్సు అని రెండు రకాలు ఉన్నాయి. ఫేస్ టు ఫేస్ తరగతులకు ఫీజు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ కోర్సులకు మాత్రం అందులో పదో వంతు చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాలకు వెబ్సైట్https://www.abaenglish.com
ఫ్యూచర్ లెర్న్..అవకాశాలకు ఇంగ్లిష్ ప్రాణ వాయువు అన్నది∙అందరికీ తెలిసిందే. ప్రపంచంలో విస్తృతంగా మాట్లాడే భాషల్లో ఇది ఒకటి. 50కి పైగా ప్రపంచ దేశాల్లో అధికారిక భాష. కాబట్టి ప్రపంచంతో అనుసంధానమై.. మన అవకాశాలు మెరుగుపరచుకోవాలన్నా.. ఎంఎన్సీల్లో కెరీర్కు మార్గం వేసుకోవాలన్నా.. ఇంగ్లిష్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ‘ఫ్యూచర్ లెర్న్’ పోర్టల్లో బేసిక్ ఇంగ్లిష్ నుంచి వివిధ స్థాయిల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ ఇంగ్లిష్ 1–ఎలిమెంటరీ, బేసిక్ ఇంగ్లిష్ 2–ప్రి ఇంటర్మీడియెట్, ఇంగ్లిష్ ఫర్ వర్క్ప్లేస్తోపాటు ఐఈఎల్టీఎస్ అభ్యర్థుల కోసం లిజనింగ్, రైటింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఈ సైట్లో ఇంగ్లిష్తోపాటు జర్మన్, ఇటాలియన్, స్పానిష్ వంటి పలు విదేశీ భాషలు సైతం నేర్చుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్https://www.futurelearn.com
ఎలిసన్ కోర్సులు..ఇంగ్లిష్ భాష.. ఒకేలా కనిపిస్తున్నా.. ప్రాంతాన్ని, అవసరాన్ని, ఎదుటివారిని బట్టి వినియోగించాలి. రెస్టారెంట్కు వెళ్లి అత్యున్నత స్థాయి గ్రామర్, వొకాబ్యులరీ ఉపయోగిస్తే అవతలి వారికి భాష అర్థం కాదు. అలాగే బిజినెస్ మీటింగ్లో కూర్చుని రెస్టారెంట్æ భాష మాట్లాడితే వింతగా చూస్తారు. అందుకే ఎక్కడ ఏ స్థాయి భాష మాట్లాడాలో ఆన్లైన్ పోర్టల్ ‘ఎలిసన్’లో నేర్చుకోవచ్చు. ఇందులో బోధనకు, ఈమెయిల్స్ రాసేందుకు, సాహిత్య అభిలాష ఉన్నవారికి, జర్నలిజంలో ఉన్నవారికి వేర్వేరు వొకాబ్యులరీతో కోర్సులను అందుబాటులో ఉంచారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://alison.com/courses/english
పెర్ఫెక్ట్లీ స్పోకెన్..
ఇంగ్లిష్ నేర్చుకునేందుకు మెచ్చిన కోర్సును ఎంచుకొని పాఠాలు నచ్చితేనే ఫీజు చెల్లించవచ్చని ఈ పోర్టల్ ప్రకటించింది. ముందుగా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఇందులో ఇంటర్మీడియట్ లెవెల్, అప్పర్ ఇంటర్మీడియట్ లెవెల్, ఎఫెక్టివ్ ఒకాబ్యులరీ స్కిల్స్, బిజినెస్ ఇంగ్లిష్, మీటింగ్ ఇంగ్లిష్ స్కిల్స్, ఎలైట్ స్పీకింగ్ వంటి వివిధ రకాల కోర్సులను అందిస్తోంది. అంతేకాదు.. ప్రి ప్లాన్, స్టూడెంట్ ప్లాన్, ప్రొ ప్లాన్ పేరుతో మూడు విభాగాల్లో ఇంగ్లిష్ లెర్నింగ్ కోర్సులను అందుబాటులో ఉంచింది. మనకు నచ్చిన కోర్సును ఎంచుకొని ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://perfectlyspoken.com

ఇవే కాకుండా కోర్స్ఎరా (coursera) వంటి చాలా మూక్స్ (మాసివ్ ఆన్లైన్ కోర్సెస్) ఇంగ్లిష్ లెర్నింగ్ కోర్సులను అందిస్తున్నాయి. ఎవరికి వారు తమకు నచ్చిన కోర్సును ఎంచుకొని ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు.

సర్కారీ కొలువు దక్కేలా.. ప్రిపరేషన్ పక్కాగా!

పోస్టులు వందల్లో… పోటీ లక్షల్లో..! ఎంతో మంది పరీక్ష రాసినా… కొలువు దక్కేది కొంతమందికే!! అర్హతల పరంగా చూస్తే… దాదాపు అభ్యర్థులందరికీ తగిన అర్హతలు ఉంటాయి. అందరికీ సర్కారీ కొలువు సొంతం చేసుకోవాలనే పట్టుదల ఉంటుంది. దాదాపు అందరూ అవే పుస్తకాలు, అవే మెటీరియల్ చదువుతుంటారు. కాని కొంతమందికే ఉద్యోగం లభిస్తుంది. ఎందుకు!? పక్కా వ్యూహంతో పటిష్ట ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులే అంతిమంగా విజేతలుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధించేందుకు అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహం గురించి తెలుసుకుందాం…
Career Guidanceవార్తాపత్రికలు..
పోటీ పరీక్షల ప్రిపరేషన్ పరంగా సమయానిది కీలక పాత్ర. కాబట్టి సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. ఇంటర్నెట్లో గంటల తరబడి ఆర్టికల్స్ కోసం వెతుక్కోకుండా.. ఎప్పటికప్పుడు దినపత్రికలను పరీక్షల కోణంలో చదవాలి. పత్రికలను చదివేటప్పుడు నిర్మాణాత్మక పరిణామాలు, డవలప్మెంట్ ఓరియెంటేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. నియామకాలు, సిలబస్, పరీక్ష సంబంధిత మార్పులకు సంబంధించిన వార్తలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

సమయ ప్రణాళిక..పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించిన తర్వాత ప్రిపరేషన్పై దష్టిసారించాలి. చక్కటి టైమ్ టేబుల్(సమయ ప్రణాళిక) రూపొందించుకొని.. దాన్ని అనుసరించాలి. సబ్జెక్టులను రోజులుగా, రోజులను గంటలుగా విభజించుకోవాలి. ఆయా సబ్జెక్టులను అవగాహన చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందనే∙విషయాలను గమనించాలి. స్వీయసామర్థ్యాలు ఏమేరకు మెరుగవుతున్నాయో అంచనా వేసుకోవాలి.

సొంత నోట్స్..పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులెవరైనా నోట్స్ రూపొందించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. చదువుతున్న సబ్జెక్టు ఏదైనా నోట్సు రాసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. ప్రతి చాప్టర్ అధ్యయనం పూర్తయిన తర్వాత నోట్స్ను రివిజన్ చేసి..అవసరమైన మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే.. విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రింటెడ్ పుస్తకాల్లో చదివిన అంశాల కంటే నోట్ బుక్లో రాసుకున్న విషయాలనే సులభంగా తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుంటారు. నోట్స్ సులభమైన భాషలో షార్ట్ కట్లో ఉంటే.. ప్రింటెడ్∙పుస్తకం కొంచెం క్లిష్టంగా ఉండటమే దీనికి కారణం.

మోడల్ పేపర్లు..ఇంటర్నెట్లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి పాత ప్రశ్న పత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాలు లభ్యమవుతున్నాయి. స్థానిక బుక్ స్టోర్స్లోనూ మోడల్ ప్రశ్నపత్రాలు లభిస్తున్నాయి. మోడల్ టెస్టుల వల్ల నాలెడ్జ్తోపాటు స్వీయ సామర్థ్యాలను పరీక్షించుకోవచ్చు. వారం, నెలల వారీగా మోడల్ టెస్టులను ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రశ్నల శైలి, ఏయే అంశాలపై దష్టిపెట్టాలనే విషయాలపై అవగాహన వస్తుంది. మోడల్ టెస్టు పేపర్స్ను ప్రాక్టీస్ చేసేటప్పుడు టైమర్ పెట్టుకోవడం లాభిస్తుంది.

స్వీయ ప్రేరణ..ప్రభుత్వ పోటీ పరీక్షలు ఏవైనా..వాటిలో విజయం సాధించాలంటే ప్రేరణ తప్పనిసరి. ఏటా పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి పోటీని తట్టుకొని నిలబడాలంటే.. ప్రేరణ ఎంతైనా అవసరం. ముఖ్యంగా పోటీ పరీక్షల విజయంలో స్వీయ ప్రేరణ కీలకంగా నిలుస్తుంది.

క్రమశిక్షణ, అంకితభావం..పరీక్షల్లో విజయం అనేది స్వల్పకాలంలో దక్కేది కాదు. కొన్నిసార్లు దీర్ఘకాలం ఎదురుచూడాల్సి రావొచ్చు. ఈ సమయంలో అభ్యర్థుల్లో స్వీయ ప్రేరణ సడలే ఆస్కారం ఎక్కువ. కొన్నిసార్లు చదవాలనే ఆసక్తి సన్నగిల్లుతుంది. అలాంటి సమయంలో క్రమశిక్షణ, అంకితభావం చాలా అవసరం.

ఆరోగ్యాన్ని..పరీక్షలు.. లక్ష్యాలు… ఏవైనా… ఆరోగ్యం సహకరిస్తేనే అన్నీ సక్రమంగా జరుగుతాయి. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఆర్యోగాన్ని కాపాడుకోవాలి. వరుసగా కొన్ని రోజులు ప్రిపరేషన్ తర్వాత అనారోగ్యం పాలై విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ప్రిపరేషన్కు బ్రేక్ పడుతుంది. ప్రిపరేషన్ తిరిగి గాడిలో పడటం కష్టంగా మారుతుంది. కాబట్టి అభ్యర్థులు జంక్ ఫుడ్, ఇతర అనారోగ్య పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఏకాగ్రత..కొంతమంది ఏకధాటిగా ఐదారు గంటలు చదువుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. అలా చేయడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ప్రిపరేషన్లో చిన్న చిన్న గ్యాప్లు ఇవ్వాలి. కంటి నిండా నిద్రపోవాలి. ఎన్ని గంటలు చదివాం అనే దానికంటే.. ఎంత నాణ్యమైన సమయం ప్రిపరేషన్కు కేటాయించామనేదే ముఖ్యం.

కోచింగ్…పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కాలంలో కోచింగ్కు వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఆన్లైన్ మార్గాలను అన్వేషించాలి. ఆన్లైన్ క్లాసులు తప్పనసరి అని భావించిన విద్యార్థులు కొంత రీసెర్చ్, సీనియర్లను సంప్రదించి ప్రామాణిక మెటీరియల్, బోధన అందించే కోచింగ్ ఇన్స్టిట్యూట్ను ఎంచుకోవడం మేలు.

గ్రూప్ డిస్కషన్…పోటీ పరీక్షల ఎంపిక ప్రక్రియలో గ్రూప్ డిస్కషన్స్(జీడీ)కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇందులో సమకాలీన అంశాలు, ముఖ్యమైన ఆర్థిక, బ్యాంకింగ్ రంగ సమస్యలపై చర్చించమని కోరుతున్నారు. కాబట్టి అభ్యర్థులు సమకాలీన అంశాలపై ఎక్కువగా దష్టిసారించాలి. అలాగే కేంద్ర బడ్జెట్–కీలక విషయాలపై ఫోకస్ చేయాలి.

పర్సనల్ ఇంటర్వ్యూ…అభ్యర్థులు ఎస్బీఐ పీవోగా కొలువుదీరేందుకు చివరి దశ ప్రక్రియ.. ఇంటర్వ్యూ. ఇందులో అధిక శాతం ప్రశ్నలు అభ్యర్థి విద్యా నేపథ్యం, వ్యక్తిగత విషయాలు, పని అనుభవం, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక పరిణామాలు, భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధించినవిగా ఉంటాయి. ముఖ్యంగా దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ఎక్కువ దష్టిపెట్టాలి.

సర్కారీ కొలువు కావాలంటే.. సరైన ప్రణాళిక ఉండాల్సిందే..!

ప్రస్తుతం ‘కరోనా’ లాక్డౌన్ కారణంగా దాదాపు అన్ని పోటీ పరీక్షల నిర్వహణ నిలిచిపోయింది. వైరస్ ఉధృతి తగ్గిన తర్వాతే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్ నియామక పరీక్షలు జరిగే అవకాశం ఉంది. అనుకోకుండా లభించిన ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. ఆయా ఉద్యోగ పోటీ పరీక్షలకు మరింత మెరుగ్గా సన్నద్ధమవ్వచ్చు.
Career guidance

సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే.. సర్కారీ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ‘కరోనా’ తర్వాత జరిగే అవకాశం ఉన్న ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు.. వాటి తీరుతెన్నులు.. ప్రిపరేషన్ గైడెన్స్, నిపుణుల సలహాలు, సూచనలు…
ఏటా ఫిబ్రవరి–మార్చి రాగానే పదోతరగతి, ఇంటర్మీడియెట్, ఎంసెట్, జేఈఈ, నీట్ తదితర అకడమిక్, ప్రవేశ పరీక్షలతోపాటు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షల సీజన్ ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నం. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 విపత్తు కారణంగా దేశంలో దాదాపు పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఈ లాక్డౌన్ సమయం విద్యార్థులకు, పోటీ పరీక్షార్థులకు అత్యంత కీలకం. కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ పక్కదారి పట్టకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు పరీక్షలకు చాలాముందు నుంచే ప్రణాళిక ప్రకారం చదువుతుంటే.. మరికొంతమంది పరీక్షలు సమీపించినప్పుడు మాత్రమే తమ ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. నేటి పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగ పరీక్షలో విజయం సాధించాలన్నా.. కనీసం ఆరు నెలల సమయం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి లాక్డౌన్ తర్వాత వెలువడే ఉద్యోగ ప్రకటనలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలి. ‘కరోనా’ సంక్షోభం ముగిసిన తర్వాత యూపీఎస్సీ, బ్యాంకు పరీక్షలు, ఎస్ఎస్సీ సీజీఎల్, రైల్వే ఎన్టీపీసీ, రైల్వే గ్రూప్–డి, డిఫెన్స్ తదితర పరీక్షలు జరిగే అవకాశం ఉంది.
బ్యాంక్ పరీక్షలు..
 • లాక్డౌన్ ముగిసిన తర్వాత నెలల్లో అనేక బ్యాంకు పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపు అన్ని బ్యాంకుల ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ దశలు ఉంటాయి. ఓవైపు విపరీతమైన పోటీ, మరోవైపు అంచలంచెలుగా జరిగే ఎంపిక ప్రక్రియల్లో ప్రతిభ చూపి విజయం సాధించాలంటే.. దీర్ఘకాలిక ప్రిపరేషన్ తప్పనిసరి.
 • ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) నోటిఫికేషన్ను మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదల చేయాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి కారణంగా ఆలస్యం అవుతోంది. కాబట్టి ఈ పరీక్షకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే ప్రయోజనం చేకూరుతుంది.
 • 8000 క్లర్క్ పోస్టులను భర్తీ చేయడానికి ఎస్బీఐ ఇదివరకే ప్రిలిమ్స్ పరీక్షలను పూర్తి చేసింది. మెయిన్ను ఏప్రిల్ 19న నిర్వహించాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా వేశారు.
 • ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, క్లర్క్(రూరల్ బ్యాంక్స్ రిక్రూట్మెంట్)కు మే–జూన్ మధ్యలో నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. ఆలస్యం అవుతోంది. దీనికి ఆగస్టులో ప్రిలిమ్స్ పరీక్షలు జరిగే అవకాశముంది.
 • ఆర్బీఐ గ్రేడ్ బీ నోటిఫికేషన్ కూడా ఆలస్యంగా రానుంది.
 • వీటితోపాటు ఆర్బీఐ, నాబార్డ్ నియామక పరీక్షలను సైతం వాయిదా వేశారు. ఆర్బీఐ అసిస్టెంట్.. మెయిన్ పరీక్ష(926 పోస్టులు), నాబార్డ్ గ్రేడ్– ఎ ఆఫీసర్ మెయిన్ పరీక్ష(154 పోస్టులు)లను లాక్డౌన్ తర్వాత నిర్వహించే వీలుంది.

ఎస్ఎస్సీ

 • కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో వివిధ ఉద్యోగాల నియామకానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఏటా పరీక్షలను నిర్వహిస్తుంది.
 • ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్–టైర్ 2ను జూన్ 2020లో నిర్వహించాల్సి ఉంది.
 • ఎస్ఎస్సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ టైర్–1 పరీక్షను మార్చి16న ప్రారంభించారు. కానీ 3 రోజుల తర్వాత మార్చి 20 నుంచి 29 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను ఎస్ఎస్సీ రద్దు చేసింది. ఈ పరీక్షల తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.
 • ఇంజనీర్(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్) పోస్టుల కోసం మార్చి 30న నిర్వహించాల్సిన జేఈ పేపర్ –1 పరీక్షను కూడా ఎస్ఎస్సీ వాయిదా వేసింది.

యూపీఎస్సీ

 • సివిల్స్, ఐఎఫ్ఎస్, ఐఎస్ఎస్ తదితర అత్యున్నత సర్వీసులతోపాటు ఎన్డీఏ అండ్ ఎన్ఏ, సీఐఎస్ఎఫ్ తదితర నోటిఫికేషన్ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రతి ఏటా నిర్దిష్ట సమయంలో నోటిఫికేషన్లు విడుదల చేసి.. పరీక్షలను నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ‘కరోనా’ మహమ్మారి నేపథ్యంలో పలు పరీక్షలను యూపీఎస్సీ వాయిదా వేసింది.
 • దేశవ్యాప్తంగా లక్షల మంది ఉత్కంఠగా ఎదురుచూసే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 31న జరగాల్సి ఉంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. కరోనా కారణంగా ఈ పరీక్ష కూడా వాయిదా పడింది. పరీక్ష ఎప్పుడు జరిగేది ఈ నెల 20వ తేదీన నిర్ణయించనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది.
 • నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ కోసం యూపీఎస్సీ ఏప్రిల్ 19న నిర్వహించాల్సిన ఎన్డీఏ–ఎన్ఏ పరీక్షను కూడా వాయిదా వేసింది.
 • ఐఈఎస్/ఐఎస్ఎస్ 2020 పరీక్ష మార్చి 25న జరగాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి వాయిదా పడింది.

రైల్వే పరీక్షలు

 • దేశంలో ఎక్కువ మంది ఉద్యోగార్థులు పోటీపడే వాటిలో రైల్వే పరీక్షలు ప్రధానమైనవి. రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. రాబోయే నెలల్లో పలు పరీక్షలను రైల్వే నిర్వహించే అవకాశం ఉంది.
 • ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, గ్రూప్–డీ పరీక్షలు లాక్డౌన్ తర్వాతే జరిగే వీలుంది.
 • వీటితోపాటు ఇతర నియామక పరీక్షలపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి అవి కూడా ప్రస్తుత పరిస్థితులు మెరుగయ్యాకే నిర్వహించే అవకాశముంది.
ఉద్యోగ సాధనకు వ్యూహాలు
‘కరోనా’ తర్వాత భవిష్యత్తులో నిర్వహించనున్న ఉద్యోగ నియామక పరీక్షలకు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం చదివితే.. తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అందుకోసం పరీక్ష ఎంపిక దగ్గర నుంచి మాక్టెస్టుల వరకూ సరైన వ్యూహంతో ముందుకెళ్లాలి.
పరీక్ష ఎంపిక
పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా తమ అర్హతలకు, నైపుణ్యాలకు, ప్రతిభకు అనుకూలమైన సిలబస్, సబ్జెక్టులు ఉన్న పరీక్షలను ఎంచుకోవాలి. ఆ తర్వాత పరీక్షలో విజయానికి అనుగుణంగా సరైన ప్రిపరేషన్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
క్లిష్టమైన వాటిపై దృష్టి
పరీక్ష ఎంపిక తరువాత అందులోని సిలబస్ అంశాలను పరిశీలించి.. క్లిష్టత స్థాయి ఆధారంగా జాబితా రూపొందించుకోవాలి. సిలబస్లో ఇదివరకే తెలిసిన అంశాలను, బాగా అవగాహన ఉన్న అంశాల ప్రిపరేషన్ను మొదట పూర్తిచేసుకోవాలి. ఆ తర్వాత క్లిష్టమైన టాపిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించి వాటిపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల అటు తేలికైన వాటితోపాటు ఇటు క్లిష్టమైన అంశాలపైనా పట్టుచిక్కుతుంది.
ప్రీవియస్ పేపర్లు
సిలబస్ ఒకసారి చదవడం పూర్తయ్యాక గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను సాధన చేయాలి.ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇకముందు చేయబోయే ప్రిపరేషన్ పట్ల విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంచుతుంది.
మాక్ టెస్ట్లుమాక్ టెస్ట్లను ప్రాక్టీస్ చేయడం ద్వారా వేగాన్ని పెంచుకోవడంతోపాటు, కచ్చితత్వంపై స్వీయ విశ్లేషణ చేసుకోవచ్చు. తద్వారా ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునే వీలు కలుగుతుంది. పరీక్షల ప్రిపరేషన్ తుది దశకు చేరుకున్న తర్వాత చివరి రోజుల్లో కేవలం మాక్ టెస్ట్ల సాధనపైనే దృష్టిసారించాలి.
తుది దశ
ప్రిపరేషన్ తుది దశలో.. మాక్ టెస్టులు, మోడల్ టెస్టుల ప్రాక్టీస్ ద్వారా ఏ అంశాల్లో వెనుకంజలో ఉన్నారో పరిశీలించుకోవాలి. ఆయా అంశాల్లో మెరుగైన ప్రతిభ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి!
ప్రస్తుతం కోవిడ్–19 కారణంగా దేశంలో, రాష్ట్రంలో ‘లాక్డౌన్’ పరిస్థితి నెలకొంది. దాదాపు అన్ని పోటీపరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఆయా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కరోనా విపత్తు ముగిసిన తర్వాత ఏ నోటిఫికేషన్ వెలువడినా రాసేందుకు సన్నద్ధంగా ఉండాలి. అందుకోసం ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. సాక్షిఎడ్యుకేషన్ వెబ్సైట్లోని ఉచిత లైవ్ క్లాసులతోపాటు ఆన్లైన్లోని వీడియో క్లాసులతో అభ్యర్థులు ప్రయోజనం పొందొచ్చు.