ఏపీ ఇంటర్ పరీక్షల 2020-21 షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది. మే 23వ తేదీ వరకు మొదటి, రెండో సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉండడంతో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ విధానంలో తరగతులు కొనసాగుతున్నాయి. మే 5 నుంచి 23 వరకు ఇంటర్మీడియల్ పరీక్షలు జరుగుతాయి. వాటిలో 5 నుంచి 22 వరకు ఫస్టియర్ విద్యార్థులు, మే 6 నుంచి 23 వరకు సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే అంతకుముందే మార్చి 31 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది.…
Read More
You must be logged in to post a comment.