విప్లవవీరులు – భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్
లాలా లజపత్ రాయ్ ని కొట్టినందుకు ప్రతీకారంగా లాహోర్ ఎస్పీపై కాల్పులు జరిపారు భగత్ సింగ్, ఆయన సహచరులు. ఎస్పీ బదులు అదనపు ఎస్పీ శాండర్స్ మరణించారు. ఆ సమయానికి తప్పించుకున్న భగత్ సింగ్ బృందం తర్వాత కొద్దికాలానికి దిల్లీ అసెంబ్లీలో భయపెట్టడానికి తక్కువ తీవ్రత గల బాంబు విసిరి దొరికిపోయింది. శాండర్స్ కేసును తిరగదోడిన ఆంగ్లేయ సర్కారు విచారించి… మరణశిక్ష విధించింది. తమను మామూలు నేరస్థులకు చేసినట్లుగా తాడుకు కట్టి ఉరితీయ వద్దని, రాజకీయ ఖైదీలం కాబట్టి నేరుగా తుపాకితో కాల్చి చంపండని ముగ్గురూ విజ్ఞప్తి చేశారు. ఆంగ్లేయ సర్కారు ఆ చివరి కోరిక తీర్చటానికి నిరాకరించింది. 1931 మార్చి 24 తెల్లవారుజామున భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను ఉరితీయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. యావద్దేశం ఉడికిపోతోంది. అశక్తతతో రగిలిపోతోంది. ఏదైనా అనూహ్యం…
Read More
You must be logged in to post a comment.